రఘువీర్‌ చౌదరికి ఎన్టీఆర్‌ సాహితీ పురస్కారం | ntr literary award to raghuveer chaudhary | Sakshi
Sakshi News home page

రఘువీర్‌ చౌదరికి ఎన్టీఆర్‌ సాహితీ పురస్కారం

Published Sun, May 7 2017 2:55 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

రఘువీర్‌ చౌదరికి ఎన్టీఆర్‌ సాహితీ పురస్కారం

రఘువీర్‌ చౌదరికి ఎన్టీఆర్‌ సాహితీ పురస్కారం

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సాహితీ వేత్త, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రఘువీర్‌ చౌదరిని ఎన్టీఆర్‌ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎన్టీ ఆర్‌ విజ్ఞాన ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీ పార్వతి, జ్యూరీ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేవీ రమణాచారి ప్రకటించారు. శని వారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌ కోర్టు హోట ల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ విజ్ఞాన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏటా ప్రదానం చేసే ఈ అవార్డును రఘువీర్‌కు ఇవ్వనున్నట్లు తెలి పారు.

మహానటుడు, భారత సినీ ప్రపంచం లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం నిలుపు కొన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ గొప్ప సాహితీవేత్త కూడా అని చెప్పారు. 2006లో జ్వాలాముఖి ప్రోత్సాహంతో జాతీ య స్థాయిలో సాహితీ అవార్డును దేశంలోని ముఖ్యమైన సాహితీ వేత్తలకు ఇవ్వాలని నిర్ణ యించామన్నారు.
2007 నుంచి పురస్కార ప్రదానం
2007 నుంచి ఎన్టీఆర్‌ విజ్ఞాన ట్రస్ట్‌ ఆధ్వర్యం లో ఈ సాహితీ పురస్కారం ప్రదానం చేయ డం ప్రారంభించామన్నారు. ఈ అవార్డును 2007లో కన్నడ భాషకి చెందిన సాహితీవేత్తకు ఇచ్చామన్నారు. ఏటా ఈ అవార్డు ఒక్కొక్క భాషకు చెందిన వారికి అందజేస్తూ వచ్చామని తెలిపారు. ఈసారి 2017లో అవార్డుకు ముగ్గు్గరి పేర్లు పరిశీలనకు రాగా  జ్యూరీ కమిటీ గుజ రాత్‌కు చెందిన సుప్రసిద్ధ సాహితీ వేత్త, జ్ఞాన పీఠ్‌ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకా డమీ అవార్డు గ్రహీత రఘువీర్‌ చౌదరిని ఎంపిక చేసిందన్నారు. ఈయన ఈ అవార్డు అందుకొంటున్న 11వ వ్యక్తి అని తెలిపారు. ఎన్టీఆర్‌ జయంతి రోజైన మే 28న రవీంద్ర భారతిలో ఈ అవార్డు ప్రదా నోత్సవం నిర్వహి స్తున్నట్లు చెప్పారు. అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా మహా రాష్ట్ర గవర్నర్‌ సీహె చ్‌ విద్యాసాగర్‌ రావు, విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్‌ ఎల్‌ నర్సింహా రెడ్డి, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌లను ఆహ్వా నించా మన్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ కమిటీ సభ్యులు డాక్టర్‌ ఓల్గా, డాక్టర్‌ మృణాళిని, డాక్టర్‌ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement