raghuveer chaudhary
-
రఘువీర్ చౌదరికి ఎన్టీఆర్ సాహితీ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సాహితీ వేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రఘువీర్ చౌదరిని ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎన్టీ ఆర్ విజ్ఞాన ట్రస్ట్ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, జ్యూరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి ప్రకటించారు. శని వారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోట ల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా ప్రదానం చేసే ఈ అవార్డును రఘువీర్‌కు ఇవ్వనున్నట్లు తెలి పారు. మహానటుడు, భారత సినీ ప్రపంచం లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం నిలుపు కొన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గొప్ప సాహితీవేత్త కూడా అని చెప్పారు. 2006లో జ్వాలాముఖి ప్రోత్సాహంతో జాతీ య స్థాయిలో సాహితీ అవార్డును దేశంలోని ముఖ్యమైన సాహితీ వేత్తలకు ఇవ్వాలని నిర్ణ యించామన్నారు. 2007 నుంచి పురస్కార ప్రదానం 2007 నుంచి ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఆధ్వర్యం లో ఈ సాహితీ పురస్కారం ప్రదానం చేయ డం ప్రారంభించామన్నారు. ఈ అవార్డును 2007లో కన్నడ భాషకి చెందిన సాహితీవేత్తకు ఇచ్చామన్నారు. ఏటా ఈ అవార్డు ఒక్కొక్క భాషకు చెందిన వారికి అందజేస్తూ వచ్చామని తెలిపారు. ఈసారి 2017లో అవార్డుకు ముగ్గు్గరి పేర్లు పరిశీలనకు రాగా జ్యూరీ కమిటీ గుజ రాత్‌కు చెందిన సుప్రసిద్ధ సాహితీ వేత్త, జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకా డమీ అవార్డు గ్రహీత రఘువీర్ చౌదరిని ఎంపిక చేసిందన్నారు. ఈయన ఈ అవార్డు అందుకొంటున్న 11వ వ్యక్తి అని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న రవీంద్ర భారతిలో ఈ అవార్డు ప్రదా నోత్సవం నిర్వహి స్తున్నట్లు చెప్పారు. అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా మహా రాష్ట్ర గవర్నర్ సీహె చ్ విద్యాసాగర్ రావు, విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ ఎల్ నర్సింహా రెడ్డి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌లను ఆహ్వా నించా మన్నారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ కమిటీ సభ్యులు డాక్టర్ ఓల్గా, డాక్టర్ మృణాళిని, డాక్టర్ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి జ్ఞానపీఠ్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2015 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో రఘువీర్ చౌదరి 51వ వారు. ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ సెలెక్షన్ బోర్డు చైర్మన్ సురంజన్ దాస్ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ప్రొఫెసర్ షమిమ్ హనిఫ్, హరీశ్ త్రివేది, రామకాంత్ రాత్, చంద్రకాంత్ పాటిల్, అలోక్‌రాయ్, దినేశ్‌మిశ్రా, లీలాధర్ మంద్లోయి పాల్గొన్నారు.ఆయన గుజరాతీలో పలు రచనలు చేశారు. రఘువీర్ చౌదరి గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. గుజరాతీ సాహిత్యానికి వన్నె తెచ్చిన రచయిత 1938లో జన్మించిన రఘువీర్ చౌదరికి గుజరాతీ సాహిత్యంలో ప్రత్యేక స్థానముంది. నవలాకారుడిగా, కవిగా, విమర్శకుడిగా గుజరాతీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ వ్యక్తి ఆయన. ఆయన ప్రభావం ఎంతోమంది గుజరాతీ రచయితలపై ఉంది. గోవర్ధన్‌రాం త్రిపాఠి, కాకా కలేల్కర్, సురేశ్ జోషి, రామాదర్శ మిశ్రా, జీఎన్ డిక్కీ వంటి రచయితలు ఆయన రచనలతో ప్రభావితమైన వాళ్లే. భావవ్యక్తీకరణ గంభీరత, అర్థవంతమైన ఉపమాలు, ప్రతీకల ప్రయోగం రఘువీర్ కవిత్వంలో ప్రముఖంగా కనిపిస్తుంది. కవిత్వమే ఆయనకు అత్యంత ప్రీతికరమైనదైనా.. నవలా సాహిత్యంలో నిరంతర అన్వేషి ఆయన. మానవ జీవిత నిత్య ప్రవర్ధమాన కార్యకలాపాలను ప్రగతిశీల దృక్పథంతో బలోపేతం చేయడం ఆయన దృక్పథంగా కనిపిస్తుంది. ఆయన నవలలు 'అమృత', 'వేణు వాత్సల', 'ఉపర్వస్' త్రయంలో ఇదే దృక్పథం ప్రతిధ్వనిస్తుంది. ఆయన రచించిన 'రుద్ర మహాలయ' గుజరాతీ సాహిత్యంలోనే విఖ్యాత రచనగా నిలిచిపోయింది. సృజనాత్మక రచించడం, విభిన్నంగా ఆలోచనను ఆవిష్కరించే విషయంలో ఆయన రాసిన వ్యాసాలు ఆయన సునిశిత దృష్టిని చాటుతాయి.