Nuclear fuel
-
అగ్రరాజ్యాలపై మోదీ ఫైర్
అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలపట్ల అగ్రరాజ్యాలు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నానాటికి పెరిగిపోతోన్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాలు మాటలే తప్ప చేతలకు సిద్ధపడవని ఆరోపించారు. పర్యావరణ హితం కోసం పెద్ద స్థాయిలో అణుశక్తిని వినియోగంలోకి తేవాలనే భారత్ ప్రయత్నాలను ఆయా దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో పర్యావరణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న జాతీయ పర్యావరణ సదస్సులో ప్రసంగించిన ఆయన ప్రకృతిని దైవంగా భావించడం భారతీయుల సంప్రదాయంలో భాగమన్నారు. 'భారత్‌లో కాలుష్యం పెరిగిపోతోందని వివిధ దేశాల ఏజెన్సీలు లెక్కలతో సహా మనల్ని నిందిస్తాయి. పోనీ, అలా జరగకుండా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల్ని కడతామంటే మాత్రం గగ్గోలు పెడతాయి. ఈ వేదిక నుంచి గ్లోబర్ న్యూక్లియర్ కమిటీని అర్ధిస్తున్నాను.. దయచేసి మాకు అనుమతులు మంజూరుచేయండి' అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
హోమీ బాబా ‘మెహ్రాన్‌గిర్’ వేలం
రూ. 372 కోట్లు పలికిన భవనం సాక్షి, ముంబై: భారత అణు ఇంధన కార్యక్రమ పితామహుడు హోమీ జే బాబాకు చెందిన మూడంతస్తుల భవనం ‘మెహ్రాన్‌గిర్’ను బుధవారం నాడిక్కడ వేలం వేశారు. దక్షిణ ముంబైలోని విలాసవంతమైన మల్బార్ హిల్ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా విశాలమైన స్థలంలో ఉన్న ఈ బంగళా రూ.372 కోట్లకు అమ్ముడుపోరుుంది. అరుుతే ఎవరు కొన్నారనే విషయూన్ని కొనుగోలుదారుడి విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచారు. ఈ స్థల విస్తీర్ణం సుమారు 40 వేల చదరపు అడుగులు కాగా.. 17,550 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మితమైంది. దీనికి ప్రస్తుతం కస్టోడియన్‌గా ఉన్న ఎన్సీపీఏ (నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్స్) ఈ వేలాన్ని నిర్వహించింది. ‘మెహ్రాన్‌గిర్’ను మ్యూజియంగా తీర్చిదిద్దాలని సీఎన్ఆర్ రావు వంటి శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బాబా అణు పరిశోధన సంస్థ (బార్క్)కు చెందిన కొందరు ఉద్యోగులు ఇదే డిమాండ్‌తో బోంబే హైకోర్టును ఆశ్రరుుంచారు. వేలంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కు వారుుదా వేసింది. అవసరమైతే అప్పుడు వేలాన్ని రద్దు చేస్తామని తెలిపింది. 1966లో బాబా విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత సాంస్కృతిక, కళా రంగ ప్రముఖుడైన ఆయన సోదరుడు జంషెడ్ బాబా ‘మెహ్రాన్‌గిర్’కు కస్టోడియన్ అయ్యూరు. 2007లో జంషెడ్ మరణానంతరం ఈ ఆస్తిని ఎన్సీపీఏకి బదలారుుంచారు. ఆయన విల్లు ప్రకారమే భవనాన్ని విక్రరుుంచినట్టు ఎన్సీపీఏ చైర్మన్ ఖుస్రూ సంటూక్ తెలిపారు. ఇలావుండగా ‘మెహ్రాన్‌గిర్’ను కేంద్రం స్వాధీనం చేసుకుని జాతీయ కట్టడంగా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి బుధవారం లేఖ రాశారు. -
‘కూడంకుళం’ వ్యతిరేక ఉద్యమ నేతపై బాంబు కేసు
కూడంకుళం (తమిళనాడు): కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని ఇడినాదకరై గ్రామంలో జరిగిన బాంబు పేలుడుకు సంబంధించి, అణు ఇంధన వ్యతిరేక ఉద్యమ నేత, ‘పీపుల్స్ మూవ్మెంట్ అగెనైస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ’ (పీఎంఏఎన్‌ఈ) సమన్వయకర్త ఎస్.పి.ఉదయకుమార్పైన, ఆయన సహచరులపైన బుధవారం పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి చేరువలో మంగళవారం ఒక నాటు బాంబు పేలడంతో ఆరుగురు మరణించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు మరో రెండు పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నారని, వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తిరునల్వేలి ఎస్పీ విజేంద్ర బిదారి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పీఎంఏఎన్‌ఈ సమన్వయకర్త ఉదయకుమార్, ఆయన సహచరులు పుష్పరాయన్, ముకిళన్‌లతో పాటు మరికొందరిపై భారతీయ శిక్షా స్మృతి, పేలుడు పదార్థాల నియంత్రణ చట్టాల కింద కేసులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అయితే, బాంబు పేలుడుతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఉదయకుమార్ స్పష్టం చేశారు.