nuclear security summit
-
'ట్రంప్ కు చాలా విషయాలు తెలియవు'
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షపదవికి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ కు అన్ని విషయాలు తెలియవని అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. జపాన్, దక్షిణ కొరియాలతో అణు ఒప్పందాల విషయంలో అమెరికా తీరుపై ట్రంప్ కు అంతగా విషయ పరిజ్ఞానం లేదని, విదేశీ వ్యవహారాలపై మరింత అవగాహనా అతనికి అవసరమని ఒబామా అభిప్రాయపడ్డారు. విదేశీ వ్యవహారాలు, అణు ఒప్పందాలు రెండు వేరు వేరు విషయాలని.. ఒక్కో దేశంతో ఓ రకమైన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అణు భద్రత సదస్సులో రెండో రోజైన శుక్రవారం ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్, దక్షిణ కొరియాల తీరుతో అమెరికాకు నష్టమేంలేదని ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో వాటి ప్రాబల్యం గురించి కొన్ని అంశాలను పేర్కొన్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన లేని వ్యక్తులు తమ కార్యాలయంలో ఉండాలని ఏ పౌరుడు భావించారని పునరుద్ఘాటించారు. అణు సంబంధ అంశాలు ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయని, జపాన్, దక్షిణ కొరియా దేశాలు సొంతంగా ఈ రంగంలో అభివృద్ధి చెందుతాయని ఒబామా అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు అణు సంబంధ రంగంలో సక్సెస్ సాధిస్తే అది అమెరికాకు లాభం చేకూర్చడానికి దోహదం చేస్తాయని సదస్సులో వివరించారు. -
అమాయకులను కూడా చంపేశాం: ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆశ్చర్యకర నిజాలను బయటపెట్టారు. ఓ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన ఉగ్రవాదం అంశంపై మాట్లాడారు. అమెరికా డ్రోన్లు ఎంతో మంది అమాయక జనాలను పొట్టనపెట్టుకున్నాయని అంగీకరించారు. అయితే డ్రోన్ల ద్వారా చేస్తున్న యుద్ధాన్ని మాత్రం సమర్థించుకున్నారు. ఈ పాలసీకి తాను ఎప్పుడు అనుకూలమేనని మరోసారి స్పష్టం చేశారు. అణుభద్రత సదస్సులో డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్న భద్రతపై ఇరవై దేశాల అధినేతలతో చర్చించారు. తమ దేశం చాలా తప్పులు చేసిందని.. అయితే ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే కాస్త కఠినంగా ఉండాల్సి వస్తుందన్నారు. ఐఎస్ఎస్, ఇరాన్ తో అణు ఒప్పందం అంశాలు ఈ సదస్సులో కీలక అంశాలుగా మారాయని చెప్పుకొచ్చారు. గత కొన్ని వారాలుగా ఐఎస్ఎస్ మిలిటెంట్లు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశాలున్నాయని, మహిళలు, చిన్నారులు వారి టార్గెట్ అవుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ లో అమెరికా కరెన్సీని వినియోగించడాన్ని నిషేధించాలని అమెరికా భావిస్తుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి, అరికట్టడానికి తాము చాలా కృషి చేస్తున్నామని, ఇకముందు అమెరికా దాడులు గతంలో మాదిరిగా ఉండవంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను బరాక్ ఒబామా హెచ్చరించారు. -
అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరానికి చేరుకున్నారు. నాలుగో అణు భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లిన విషయం తెలిసిందే. ముందుగా బెల్జియం రాజధాని బ్రసెల్స్‌కు వెళ్లిన మోదీ.. అక్కడి నుంచి నేరుగా వాషింగ్టన్ డీసీ నగరానికి వెళ్లారు. భారతదేశంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అక్కడ ఆయనకు స్వాగతం పలికారు. నాలుగో అణు భద్రతా సదస్సులో ప్రధానంగా అణు సామగ్రిని దుర్వినియోగం చేస్తున్న తీరు, ఉగ్రవాదులకు వీటి అందుబాటు, ఐఎస్ఐఎస్ లాంటి సంస్థల చేతికి అణ్వస్త్రాలు వెళ్లడం లాంటి అంశాలపై చర్చిస్తారు.