nuclear war heads
-
Ind Vs Pak: భారత్‌లో అణ్వాయుధాలు ఎన్నో తెలుసా.. పాక్‌లో ఇలా..
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ కంటే భారత్‌లోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని స్పీడన్‌కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో అణ్వాయుధాలను పెంచుకోవడంతో ఆసియా దేశాలు భారత్, చైనా, పాకిస్తాన్‌లు పోటీ పడుతున్నాయని స్పష్టం చేసింది.కాగా, సిప్రి నివేదిక ప్రకారం.. భారత్‌లో అణ్వాయుధాలు 172 ఉండగా పాకిస్తాన్లో 170 ఉన్నట్టు పేర్కొంది. 2023 తర్వాత రెండు దేశాలు కొత్త రకమైన న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం కొనసాగించాయని పేర్కొంది. ఇక, గతేదాడితో పోలిస్తే 2024 జనవరి నాటికి చైనాలో వార్ హెడ్స్ సంఖ్య 410 నుంచి 500 పెరిగినట్టు తెలిపింది. India possesses more nuclear weapons than Pakistan, while China has expanded its nuclear arsenal from 410 warheads in January 2023 to 500 by January 2024, according to a report by Stockholm International Peace Research Institute (SIPRI)Source : HT— Naveen Kapoor (@IamNaveenKapoor) June 18, 2024 ఇక, అణ్వాయుధ సేకరణలో భారత్‌ను నిరోధించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రణాళికలు చేస్తున్నట్టు కీలక విషయాలను వెల్లడించింది. అలాగే, సుదీర్ఘ లక్ష్యాలను తాకే అణువార్ హెడ్లపై భారత్ దృష్టిపెట్టింది. ముఖ్యంగా చైనా అంతటా లక్ష్యాల్ని చేరుకోగలగటం ప్రాధాన్యతగా ఉందని చెప్పుకొచ్చింది. అయితే, చైనాలో అణు వార్హెడ్ల నిల్వ ఇప్పటికీ రష్యా, అమెరికా కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. మరోవైపు.. భారత్, పాక్, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాల అణు వార్హెడ్లకు సంబంధించి కీలక విషయాలను నివేదికలో పేర్కొన్నది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,100 అణ్వాయుధాలు(బాలిస్టిక్ క్షిపణులు) ఉన్నాయి. దీంట్లో 90 శాతం అమెరికా, రష్యా కలిగి ఉన్నట్టు నివేదికలో పేర్కొంది. ఇజ్రాయెల్‌లో 90 వార్‌హెడ్స్ ఉన్నాయని తెలిపింది. 🇨🇳 China's nuclear arsenal to reach 500 warheads in 2024, says think tankChina has increased its nuclear arsenal to a total of 500 warheads in 2024, an increase of 90 warheads in 12 months, reports the Stockholm International Peace Research Institute (SIPRI). The institute… pic.twitter.com/ifgpBQ6rLi— Barong (@Barong369) June 17, 2024కాగా, ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్ర చేసిన నేపథ్యంలో రెండు దేశాల్లోనూ అణు బలగాలకు సంబంధించి పారదర్శకత క్షీణించిందని తెలిపింది. అలాగే, రెండు దేశాల్లో అణు భాగస్వామ్య ఏర్పాట్ల గురించి చర్చలు ఉధృతంగా పెరిగాయని పేర్కొంది. 2024 జనవరిలో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 12,121 వార్‌హెడ్స్ ఉండగా.. వాటిలో దాదాపు 9,585 సైనికుల వద్దే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. జనవరి 2023తో పోలిస్తే ఇది 60 ఎక్కువ అని స్పష్టం చేసింది. -
అణు యుద్ధంపై మరోమారు పుతిన్ వ్యాఖ్యలు.. ఏం జరుగుతోంది?
మాస్కో: అణ్వాయుధాల వినియోగంపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుతం అణు యుద్ధం ముప్పు పెరుగుతోందని, అయితే, తాము అణ్వాస్త్రాలను వినియోగించబోమని పేర్కొన్నారు. రష్యాలోని మానవ హక్కుల మండలితో వర్చువల్‌గా మాట్లాడారు పుతిన్. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాపై పరోక్ష విమర్శలు చేశారు. ‘ఉక్రెయిన్‌లో యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న ప్రక్రియ. అణు యుద్ధం ముప్పు పెరుగుతోందనడంలో అనుమానాలు లేవు. ఏ పరిస్థితిలోనూ రష్యా మొదట అణ్వాయుదాలను ప్రయోగించదు. వాటిని చూపించి బెదిరించదు. అణ్వాయుధాల సంగతి మాకు తెలుసు. అందుకే ఉన్మాదంగా వ్యవహరించబోం. ప్రపంచమంతా తిరుగుతూ ఆ ఆయుధాలను బ్రాండింగ్ చేసుకోం. ప్రపంచంలోనే అత్యాధునిక అణ్వాస్త్రాలు రష్యా వద్ద ఉన్నాయి. ఇతర దేశాల భూభాగాలపై మా అణ్వాయుధాలు లేవు.’ అని పేర్కొన్నారు పుతిన్. టర్కీ, ఇతర ఐరోపా దేశాల్లో అమెరికాకు చెందిన న్యూక్లియర్ బాంబ్స్ ఉండడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. కేవలం ఆత్మ రక్షణకే రష్యా న్యూక్లియర్ వెపన్స్ వాడుతుందన్నారు. ఇదీ చదవండి: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్స్కీ -
తలుచుకుంటే ఉత్తర చైనా తునాతునకలే!
న్యూఢిల్లీ: అణు శక్తి సామర్ధ్యం కలిగిన అగ్ని-5 ఖండాంతర క్షిపణికి భారత్ త్వరలో చివరి పరీక్షలు నిర్వహించనుంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు చివరి దశ పరీక్షలకు క్షిపణిని సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి ప్రథమార్ధంలో ఒడిశాలోని మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే 5,000-5,500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను భారత్ చేధించగలదు. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకేలు మాత్రమే ఈ సామర్ధ్యం కలిగిన క్షిపణులను కలిగివున్నాయి. వాస్తవానికి 2015 జనవరిలోనే అగ్ని-5కు ఆఖరి దశ పరీక్షలు నిర్వహించాల్సివుండగా.. అంతర్గత బ్యాటరీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేశారు. అగ్ని-5 క్షిపణి ఆఖరి దశ ప్రయోగం విజయవంతమైతే భారత్ తలుచుకుంటే ఉత్తర చైనాను తునాతునకలు చేయొచ్చు. జపాన్ తో అణుఒప్పందం, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్(ఎమ్ టీసీఆర్)లో సభ్యత్వాన్ని సంపాదించిన భారత్.. అణు ఆయుధ సరఫరా బృందం(ఎన్ఎస్ జీ)లో చేరేందుకు యత్నాలు చేస్తోంది. భారత్ ఎన్ఎస్ జీ ప్రవేశానికి, టెర్రరిస్టు మసూద్ అజర్ పై నిషేధం విధించడానికి చైనా అడ్డుపడుతున్న నేపథ్యంలో అగ్ని-5 ఆఖరి దశ ప్రయోగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 2003లో స్ధాపించిన ట్రై సర్వీస్ స్ట్రాటజిక్ ఫోర్స్ స్ కమాండ్(ఎస్ఎఫ్ సీ) క్షిపణులను పరీక్షిస్తుంది. ఏ క్షిపణినైనా రక్షణ శాఖకు అందించేముందు కనీసం రెండు సార్లైనా పరీక్షిస్తారు. అగ్ని-5ను 2012-ఏప్రిల్, 2013-సెప్టెంబర్, 2015-జనవరిలో పరీక్షించారు. పృథ్వీ, ధనుష్ క్షిపణులతో పాటు అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3 క్షిపణులను పరీక్షించింది ఎస్ఎఫ్ సీనే. ఈ ఐదు క్షిపణులను పాకిస్తాన్ ను దృష్టిలో ఉంచుకుని తయారుచేయగా.. అగ్ని-4, అగ్ని-5లను చైనాను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు.