number of vehicles
-
1,65,65,130 ఇదీ రాష్ట్రంలో మొత్తం వాహనాల సంఖ్య..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏడాది కాలంలో ఏకంగా 10.88 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి చేరాయి. ఈ సంవత్సరం మే నాటికి రాష్ట్రంలో 1,65,65,130 వాహనాలు ఉన్నట్టు తాజాగా ప్రభుత్వం సోషియో ఎకనమిక్ ఔట్లుక్ నివేదికలో స్పష్టం చేసింది. బడ్జెట్ ప్రతిపాదనలతోపాటు ప్రభుత్వం ఈ నివేదికను శాసనసభకు సమర్పించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇదే సమయా నికి రాష్ట్రంలో 1,54,77,512 వాహనాలు ఉన్నాయి. క్రమంగా వాటి పెరుగు దలలో వేగం ఎక్కువైందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఆ నివేదిక గత మే నెల 31న ఉన్న వివరాలను పొందుపర్చింది. జూలై చివరి నాటికి ఆ సంఖ్యలో కనీసం లక్ష వరకు పెరుగుదల నమోదై ఉంటుందని అంచనా.ద్విచక్ర వాహనాలదే హవా..⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో ద్విచక్రవాహనాలదే సింహభాగం. రాష్ట్రంలో 1.21.74,353 స్కూటర్లు, మోటారు సైకిళ్లు, మోపెడ్లు ఉన్నట్టు నివేదిక చెబుతోంది. గతేడాది ఇదే సమయానికి వాటి సంఖ్య 1.13 కోట్లు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది సమయంలో 10 లక్షలను మించి కొత్త వాహనాలు చేరితే, అందులో ద్విచక్రవాహనాలే 8 లక్షల వరకు ఉండటం విశేషం. ఇప్పుడు చాలా కుటుంబాల్లో రెండు ద్విచక్రవాహనాలు ఉండటం సహజంగా మారింది. -
రోడ్డెక్కిన 2,11,20,441 వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2,11,20,441 యూనిట్లు. భారత రోడ్లపైకి 2022 సంవత్సరంలో కొత్తగా దూసుకొచ్చిన వాహనాల సంఖ్య ఇది. 2021లో అమ్ముడైన 1,83,21,760 యూనిట్లతో పోలిస్తే ఇది 15.28 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 17 శాతం అధికం. కోవిడ్ ముందస్తు సంవత్సరం 2019తో పోలిస్తే 10 శాతం తగ్గుదల నమోదైంది. ఇక 2022లో ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం కొత్త శిఖరాలను తాకిందని ఎఫ్ఏడీఏ వివరించింది. ఆశించిన స్థాయిలో వృద్ధి లేదు.. ‘అక్టోబర్, నవంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదైనప్పటికీ డిసెంబర్లో తగ్గుముఖం పట్టడంతో ద్విచక్ర వాహన విభాగం మరోసారి ఆకట్టుకోవడంలో విఫలమైంది. ద్రవ్యోల్బణం, యాజమాన్య ఖర్చు అధికం కావడం, గ్రామీణ మార్కెట్ ఇంకా పూర్తిగా పుంజుకోకపోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు పెరగడం వంటి కారణాలతో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కలిగిన ద్విచక్ర వాహన విభాగంలో ఇంకా ఆశించిన స్థాయిలో వృద్ధి కనిపించలేదు’ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈవీలు మూడంకెల వృద్ధి.. గతేడాది దేశవ్యాప్తంగా రిటైల్‌లో ద్విచక్ర వాహనాలు 1,53,88,062 యూనిట్లు విక్రయం అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.37 శాతం వృద్ధి నమోదైంది. ప్యాసింజర్ వెహికిల్స్ 16.35 శాతం అధికమై 34,31,497 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం అమ్మకాల్లో దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కోవిడ్ కారణంగా తిరోగమనం చెందిన త్రిచక్ర వాహన విభాగం రికవరీ అయింది. 2019తో పోలిస్తే అంతరం తగ్గింది. 2021తో పోలిస్తే త్రీ–వీలర్లు విక్రయాలు 71.47 శాతం ఎగసి 6,40,559 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన అమ్మకాలు మూడంకెల వృద్ధి సాధించాయి. దీంతో ఈ విభాగంలో ఈవీల వాటా 50 శాతం మించింది. ట్రాక్టర్లు.. జీవిత కాల రికార్డు.. ట్రాక్టర్ల విక్రయాలు వరుసగా మూడేళ్లను మించి 2022లో 7.94 లక్షల యూనిట్లతో జీవిత కాల రికార్డు నమోదు చేశాయి. మెరుగైన రుతుపవణాలు, రైతుల వద్ద నగదు లభ్యత, వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర, ప్రభుత్వం పెద్ద ఎత్తున పంటల కొనుగోళ్లు ఇందుకు కారణం. వాణిజ్య వాహనాలు 6,55,696 నుంచి 31.97 శాతం దూసుకెళ్లి 8,65,344 యూనిట్లకు ఎగశాయి. కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్ మొత్తం 2022లో వృద్ధి చెందుతూనే ఉంది. 2019 స్థాయిలో అమ్మకాలు ఉన్నాయి. తేలికపాటి వాణిజ్య వాహనాలు (ఎల్సీవీ), భారీ వాణిజ్య వాహనాలు (హెచ్‌సీవీ), బస్‌లు, నిర్మాణ రంగ యంత్రాల్లో డిమాండ్‌కు తోడు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ విభాగాన్ని వృద్ధి బాటలో కొనసాగించాయి. ప్రత్యేక స్కీమ్‌లు ప్రకటించాలి.. ‘వాహన తయారీ సంస్థలు డిసెంబరులో సాధారణ ధరలను పెంచాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ ధరలను సవరించాయి. ఇది కాకుండా బీఎస్–6 రెండవ దశ నిబంధనలు వస్తున్నాయి. దీని ప్రభావంతో అన్ని వాహన విభాగాల్లో ధరల పెంపుదల ఉంటుంది. దీనిని ఎదుర్కోవడానికి తయారీ కంపెనీలు ప్రత్యేక పథకాలను ప్రకటించాలి. తద్వారా రిటైల్ అమ్మ కాలు ఊపందుకుంటాయి’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. -
ఢిల్లీలో వాహనాలు కోటి
న్యూఢిల్లీ: కాలుష్యంతో అల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల సంఖ్య కోటి దాటింది. మే 25 నాటికి కోటి 5 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయని ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది. ఇందులో 31.72 లక్షలు కార్లు, 66.48 లక్షల మోటారు సైకిళ్లు, స్కూటర్లు ఉన్నాయి. సరకు రవా ణా వాహనాలు (2.25 లక్షలు), మోటారు క్యాబ్ (1.18లక్షలు), మోపెడ్ (1.06 లక్ష లు), మూడు చక్రాల రవాణా వాహనాలు (68.6 వేలు) బస్సులు (35వేలు),ఈ– రిక్షాలు (31.5వేలు), మ్యాక్సీక్యాబ్‌లు (30.2 వేలు) ఉన్నాయి. ఢిల్లీలో లక్షల వాహనాలకు కాలుష్య నియంత్రణ సర్టిఫి కెట్లు లేవని పర్యావరణ కాలుష్యం నియం త్రణ, నివారణ సంస్థ తెలిపింది. -
హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో వాహన విస్ఫోటనం గ్రిడ్లాక్ దిశగా పరుగులు తీస్తోంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి వాహనాలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి తలెత్తే సంకేతం కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం అక్టోబర్ చివరి నాటికి నగరంలో వాహనాల సంఖ్య 48,70,017. అంటే సుమారు కోటి జనాభా ఉన్న గ్రేటర్లో దాదాపు సగం. వీటిల్లో 35.66 లక్షల ద్విచక్ర వాహనాలు ఉండగా, 9.06 లక్షల కార్లున్నాయి. రానున్న 2 నెలల్లో మరో లక్షకు పైగా వాహనాలు కొత్తగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని మెట్రో రైలు, పరిమిత మార్గాల్లోనే నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లు, ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో... ఇబ్బడిముబ్బడిగా వ్యక్తిగత వాహనాలు పెరుగుతున్నాయి. బెంగళూరులో సుమారు 6,000 ఆర్టీసీ సిటీ బస్సులు నడుస్తుండగా... నగరంలో 3,500 మాత్రమే అందుబాటులో ఉన్నారుు. ఇక హైదరాబాద్‌లో 6.06 శాతం రహదారులు మాత్రమే ఉండగా, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇది 8 శాతం కంటే ఎక్కువ ఉంది. హైదరాబాద్ లో అవసరానికి తగ్గట్టుగా రోడ్ల విస్తీర్ణం పెరగకపోవడం, ఉన్నవాటి నాణ్యత కొరవడటం వల్ల వాహనాల సగటు వేగం పడిపోయి... ట్రాఫిక్ జామయ్యి... గ్రిడ్లాక్ హెచ్చరికలను సూచిస్తున్నాయి. పడిపోయిన సగటు వేగం... ఐదేళ్ల క్రితం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లున్న వాహనాల వేగం... ఇప్పుడు 17 నుంచి 20 కిలోమీటర్లకు మించడంలేదు. ఏటా 1.5 లక్షల నుంచి 2 లక్షలు... రోజుకు 800 నుంచి 1,000 వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు నగరంలో నివాస ప్రాంతాలు తగ్గి, వాణిజ్య ప్రాంతాలు పెరిగిపోవడం కూడా ట్రాఫిక్ విలయానికి కారణమవుతోంది. ఐటీ రంగం విస్తరించడం, అంతర్జాతీయ స్థాయి వ్యాపార కార్యకలాపాలు అభివృద్ధి చెందడం వంటి అంశాలు కూడా వాహనాల పెరుగుదలకు ప్రధాన కారణం. ఇప్పటికిప్పుడు ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడం తప్ప గ్రిడ్లాక్ ముప్పు నుంచి నగరం తప్పించుకోవడం కష్టమేనని రవాణా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో కిలోమీటరు పరిధిలో 593 వాహనాలుంటే.. హైదరాబాద్‌లో 950 ఉన్నాయి.