ఏడాదిలో 10.88 లక్షల మేర పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏడాది కాలంలో ఏకంగా 10.88 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి చేరాయి. ఈ సంవత్సరం మే నాటికి రాష్ట్రంలో 1,65,65,130 వాహనాలు ఉన్నట్టు తాజాగా ప్రభుత్వం సోషియో ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో స్పష్టం చేసింది. బడ్జెట్ ప్రతిపాదనలతోపాటు ప్రభుత్వం ఈ నివేదికను శాసనసభకు సమర్పించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇదే సమయా నికి రాష్ట్రంలో 1,54,77,512 వాహనాలు ఉన్నాయి. క్రమంగా వాటి పెరుగు దలలో వేగం ఎక్కువైందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఆ నివేదిక గత మే నెల 31న ఉన్న వివరాలను పొందుపర్చింది. జూలై చివరి నాటికి ఆ సంఖ్యలో కనీసం లక్ష వరకు పెరుగుదల నమోదై ఉంటుందని అంచనా.
ద్విచక్ర వాహనాలదే హవా..
⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో ద్విచక్రవాహనాలదే సింహభాగం. రాష్ట్రంలో 1.21.74,353 స్కూటర్లు, మోటారు సైకిళ్లు, మోపెడ్లు ఉన్నట్టు నివేదిక చెబుతోంది. గతేడాది ఇదే సమయానికి వాటి సంఖ్య 1.13 కోట్లు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది సమయంలో 10 లక్షలను మించి కొత్త వాహనాలు చేరితే, అందులో ద్విచక్రవాహనాలే 8 లక్షల వరకు ఉండటం విశేషం. ఇప్పుడు చాలా కుటుంబాల్లో రెండు ద్విచక్రవాహనాలు ఉండటం సహజంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment