న్యూఢిల్లీ: కాలుష్యంతో అల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల సంఖ్య కోటి దాటింది. మే 25 నాటికి కోటి 5 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయని ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది. ఇందులో 31.72 లక్షలు కార్లు, 66.48 లక్షల మోటారు సైకిళ్లు, స్కూటర్లు ఉన్నాయి.
సరకు రవా ణా వాహనాలు (2.25 లక్షలు), మోటారు క్యాబ్ (1.18లక్షలు), మోపెడ్ (1.06 లక్ష లు), మూడు చక్రాల రవాణా వాహనాలు (68.6 వేలు) బస్సులు (35వేలు),ఈ– రిక్షాలు (31.5వేలు), మ్యాక్సీక్యాబ్‌లు (30.2 వేలు) ఉన్నాయి. ఢిల్లీలో లక్షల వాహనాలకు కాలుష్య నియంత్రణ సర్టిఫి కెట్లు లేవని పర్యావరణ కాలుష్యం నియం త్రణ, నివారణ సంస్థ తెలిపింది.