Nupur Saraswat
-
ఎన్నారై ఉదంతంపై మంత్రిత్వశాఖ సీరియస్
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎన్నారై మహిళకు ఎదురైన చేదు అనుభవంపై కేంద్ర మహిళా శిశుశాఖా మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈవ్యవహారంపై కేంద్ర మహిళా శిశుశాఖా మంత్రి మేనకా గాంధీ సోషల్‌మీడియాలో స్పందించారు. కేవలం సింగిల్ మహిళ అయిన కారణంగా హోటల్ లోకి ఎంట్రీ తిరస్కరించడం తీవ్రమైన విషయమని కేంద్ర మంత్రి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి వివక్షాపూరిత విధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నివేదిక కోరినట్టు ట్వీట్ చేశారు. కాగా సింగిల్ విమెన్ అన్నకారణంతో హైదరాబాద్ నగరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఎన్నారై నుపుర్ సారస్వత్‌కు ఎర్రగడ్డలోని హోటల్ దక్కన్ ప్రవేశాన్ని నిరాకరించింది. దీంతో తనకు ఎదురైన అవమానం పై సోషల్‌మీడియాలో వెల్లడించడంతో దుమారం రేగింది. నగరంలోని హోటళ్లు అనుసరిస్తున్న పాలసీపై తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. It’s a matter of serious concern that a woman is denied entry into a hotel only because she was a ‘single’ woman. https://t.co/8a1rENIQOb /1 — Maneka Gandhi (@Manekagandhibjp) June 27, 2017 My Ministry has sought a report from the state government on such a discriminatory policy of the hotel. 2/2 — Maneka Gandhi (@Manekagandhibjp) June 27, 2017 -
ఒంటరిగా వచ్చిందని హోటల్ రూం ఇవ్వలేదు!
హైదరాబాద్‌లో ఎన్నారై మహిళకు చేదు అనుభవం హైదరాబాద్: నగరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఓ ఎన్నారై మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఒంటరిగా వచ్చిందన్న కారణంతో ఆమెకు గది ఇచ్చేందుకు నిరాకరించింది ఓ హోటల్. తనకు ఎదురైన ఈ దుస్థితిపై ఆమె ఫేస్బుక్లో వెల్లడించడంతో.. ఆమె పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. నగరంలోని హోటళ్లు అనుసరిస్తున్న పాలసీపై చర్చ నడుస్తోంది. నుపుర్ సారస్వత్ అనే మహిళ ట్రావెల్ వెబ్సైట్ ‘గోఐబిబో’ ద్వారా ఎర్రగడ్డలోని హోటల్ దక్కన్లో గది బుక్ చేసుకున్నారు. శనివారం నగరానికి వచ్చిన ఆమె హోటల్‌కు వెళ్లగా.. ’సింగల్ లేడీ’ ( ఒంటరి మహిళ) అన్న కారణంతో హోటల్ ఆమెకు గది నిరాకరించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో వెల్లడించారు. ‘ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో ఓ హోటల్ బయట నిలుచున్నాను. ఆన్లైన్ బుకింగ్‌ను అంగీకరించినప్పటికీ.. నేను ‘ఒంటరి మహిళ’ అన్న కారణంతో నాకు హోటల్లో గది ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ఈ పోస్టు వెంటనే వైరల్‌గా మారింది. దీంతో ట్రావెల్ వెబ్సైట్ నగరంలోని మరో హోటల్లో కాంప్లిమెంటరీ గదిని ఆమెకు సమకూర్చింది. అంతేకాకుండా తనకు ట్రావెల్ వెబ్సైట్ క్షమాపణలు చెప్పిందని, ఇలాంటి నిబంధనలు పాటించే హోటళ్లను తమ వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నట్టు చెప్పిందని ఆమె మరో పోస్టులో వెల్లడించారు.