nurse dies
-
నర్సు అనుమానాస్పద మృతి.. ఆసుపత్రిలో ఏం జరిగింది?
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నగరంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. నగర శివారులోని టమాట మండీ వద్ద ఉన్న బీజేపీ కొట్టాలలో నివాసముంటున్న సునీత, కేశప్ప దంపతుల కుమార్తె పద్మ(23).. కిమ్స్ సవీరా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. సోమవారం రాత్రి విధులకు హాజరైన ఆమె మంగళవారం వేకువ జాము 2.22 గంటలకు ఎమర్జెన్సీ గదిలోని ఓ బెడ్‌పై నిద్రించింది. తెల్లవారుజాము 4.45 గంటలకు ఆమెను నిద్రలేపేందుకు తోటి ఉద్యోగి వెళ్లింది. ఆ సమయంలో అచేతనంగా పడి ఉన్న పద్మను గమనించి.. విషయాన్ని వెంటనే ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన వైద్యులు.. పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే తమ బిడ్డ మృతి చెందిందంటే నమ్మశక్యంగా లేదని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు సాకే హరి, తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకుని పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మృతికి కారకులెవరో తెలపాలంటూ ఆస్పత్రి వర్గాలను డిమాండ్ చేశారు. చదవండి: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి రెండు రోజుల క్రితం చిన్నారికి వైద్యం అందించే అంశంపై పద్మను యాజమాన్యం భయభ్రాంతులకు గురి చేసిందని, తప్పు లేకపోయినా లిఖిత పూర్వకంగా సంజాయిషీ తీసుకున్నారని మండిపడ్డారు. మరుసటి రోజు కూడా ఆమెను డైరెక్టర్ల సమావేశానికి రప్పించుకుని రాత్రి 9 గంటల వరకూ నిల్చోబెట్టి అవమానించారని మండిపడ్డారు. పద్మ మృతిపై లోతైన దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
డెంగీ లక్షణాలతో నర్సు మృతి
కర్ణాటక, యశవంతపుర: ఉడుపి జిల్లాలో కరోనాతోపాటు డెంగీ కూడా ప్రబలుతోంది. ఈక్రమంలో బెళ్మణ్‌కు చెందిన దివ్యా(23) అనే నర్సు డెంగీ లక్షణాలతో మృతి చెందింది. ఉడుపిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తున్న ఆమె 15 రోజులుగా జ్వరంతో బాధపడుతూ అదే ఆస్పత్రిలోనే చికిత్స పోందుతోంది. జ్వరం తీవ్రత ఆధికంగా ఉండటంతో మంగళవారం మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
నర్సు మృతి.. ఐదుగురు ఎయిమ్స్ వైద్యుల సస్పెన్షన్
సొంత సిబ్బంది విషయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు సీనియర్ వైద్యులతో పాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సస్పెన్షన్ వేటు వేసింది. ప్రసవం కోసం చేరిన నర్సు మరణించడంతో ఎయిమ్స్ ఈ చర్య తీసుకుంది. దాంతో ఇప్పుడు నర్సుల యూనియన్లు, రెసిడెంట్ డాక్టర్ల యూనియన్లు పరస్పరం తలపడుతున్నాయి. రాజ్బీర్ కౌర్ (28) ఎయిమ్స్‌లోని మెడిసిన్ డిపార్టుమెంటులో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఆమె జనవరి 16న ప్రసవం కోసం ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యారు. ప్రసవానికి కొద్ది గంటల ముందు శిశువు గుండె కొట్టుకునే వేగం బాగా తక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. శిశువు ప్రాణాలకు ముప్పు ఉండటంతో వెంటనే సిజేరియన్ చేయాలని నిర్ణయించారు. కానీ, అనెస్థటిస్టు ఆలస్యంగా రావడంతో ఆపరేషన్ లేటయింది. ఎట్టకేలకు సిజేరియన్ ఆపరేషన్ చేసినా, మృత శిశువు బయటపడింది, కౌర్‌కు తీవ్రంగా కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. ఆమెకు కార్డియో పల్మనరీ రీససికేషన్ (సీపీఆర్) చేసినా ఫలితం లేకపోవడంతో కౌర్ కోమాలోకి వెళ్లిపోయారని ఎయిమ్స్ నర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు హరీష్ కుమార్ కజ్లా చెప్పారు. నొప్పులు రప్పించడానికి కౌర్‌కు బాగా ఎక్కువ మొత్తంలో మందు ఇవ్వడం వల్లే ఆమెకు తీవ్ర అనారోగ్యం వచ్చిందని ఆయన ఆరోపించినా, ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. ఈ విషయమై నిజానిజాలు తెలుసుకోడానికి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకే శర్మ అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీని నియమించామని, రెండు రోజుల్లో ప్రాథమిక నివేదిక వస్తుందని ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ అమిత్ గుప్తా తెలిపారు. కాగా ఇప్పటికే ఎనస్థీషియా శాఖకు చెందిన ఇద్దరు జూనియర్ డాక్టర్లు, గైనకాలజీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ డాక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే వైద్యుల సస్పెన్షన్‌పై రెసిడెంట్ డాక్టర్ల సంఘం తీవ్రంగా మండిపడి, సమ్మె చేస్తామని బెదిరించింది. మరోవైపు ఎయిమ్స్‌కు చెందిన 500 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఇప్పటికపే డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తప్పు చేసినవారచిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాము తమ సహోద్యోగిని కోల్పోయామని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.