nutritions
-
పైనాపిల్ మంచిదని తినేస్తున్నారా?
పైనాపిల్ అంటే అందరూ ఇష్టంగా తినరు. ఎందుకంటే అది తినంగానే నోటిలో ఏదో దురదగా అనిపిస్తుంది. కాస్త పులుపు, తీపి కలయికతో కూడిన ఒక విధమైన రుచితో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి మూడు దేశాలు ప్రముఖంగా ఈ పండుని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని సలాడ్లు, కాక్ టెయిల్ లేదా డిజార్ట్ల రూపంలో చాలామంది తీసుకంటుంటారు. అయితే ఈ పండుని తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధులకు చెక్‌పెట్టడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అలానే అతిగా తింటే అంతే స్థాయిలో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. పైనాపిల్ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఇది అందించే ప్రయోజనాలను చూసి నిపుణులే ఆశ్చర్యపోయారు. పైగా బరువువ తగ్గాలనే వారికి ఈ పండు గొప్ప వరమని చెబుతున్నారు. అదేసయంలో దీన్ని అధికంగా తీసుకుంటే జరిగే పరిణామాలను కూడా సవివరంగా వెల్లడించారు. అవేంటంటే..? కలిగే ప్రయోజనాలు.. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను ప్రభావితం చేసే ప్రత్యేక పోషకం బ్రోమెలైన్ ఉంది. ఇది కొలెస్ట్రాల్ ఫలకాలను విచ్ఛిన్నం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని కాండంలో ఉండే ప్రోటీన్ జీర్ణ ఎంజైమ్‌ని ప్రోత్సహించి చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ప్రతిరోజూ పైనాపిల్ తింటే హైపర్ కొలెస్టెరోలేమియా స్థాయిలు, లిపోప్రోటీన్(ఎల్డీఎల్) వంటి చెడుకొలస్ట్రాల్లకు చెక్ పెడుతుంది. రోజు దీని ఆహారంగా తీసుకునేవారికి బరువు అదుపులో ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇందులో ఉండే ఫైబర్, పోటాషియం, విటమిన్ సీ కంటెంట్లు గుండె ఆరోగ్యానికి మంచివి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. విటమిన్ సీ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కేన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బుల వంటి వ్యాధుల బారిన పడకుండా నియంత్రిస్తుంది. అతిగా తీసుకుంటే తలెత్తే పరిణామాలు.. వికారం, విరేచలు లేదా గుండెల్లో మంట వంటి వాటికి దారితీస్తుంది ఇందులో ఉండే బ్రోమెలైన్ అధిక రక్తస్రావం లేదా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకావం ఉంది. అలాగే రక్తం గడ్డకట్టాన్ని ప్రభావితం చేస్తుంది. పైనాపిల్ జ్యూస్‌గా తీసుకునేవారు పోటాషియం స్థాయిల విషయంలో జాగురకతతో ఉండాలి. ఎందుకంటే ఇది మూత్ర పిండాల సమస్య ఉన్నవారికి మరింత సమస్యత్మకంగా మారిపోతుంది. అదనంగా ఉండే పోటాషియంను బయటకు పంపడంలో మూత్రపిండాలు విఫలమై లేనిపోని సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అలెర్జీ దద్దర్లు, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, ముఖం, నాలుకు, గొంతు నొప్పి, పెదవుల వాపు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంత మంచిది మితంగా తీసుకోకపోతే అంత ప్రమాదం. అందువల్ల వాటిని మీ రోజూవారి ఆహారంలో ఎంతమేర తినడం బెటర్ అనేది న్యూట్రిషియన్లు లేదా వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం ఇవ్వడం జరిగింది. మీ ఆహారంలో భాగం చేసుకోవాలనుకుంటే మాత్రం నిపుణులు లేదా ప్రముఖ డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం మంచిది. (చదవండి: అట్లాంటిక్ డైట్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
గర్భిణులకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న ‘కేసీఆర్ కిట్’ స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లకు రూపకల్పన చేసింది. రక్తహీనత అధికంగా ఉన్న 9 జిల్లాల్లో కిట్లు పంపిణీ చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. అదే సమయంలో మిగతా 8 జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఆదిలాబాద్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ములుగులో సత్యవతి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, వికారాబాద్‌లో సబిత ఇంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, గద్వాల్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పుడు 1.25 లక్షల మంది గర్భిణులకు ఇది ఉపయోగపడనుందని అంచనా. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకోసం రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. రక్తహీనత నుంచి విముక్తి రక్తహీనత గర్భిణుల పాలిట శాపంగా మారుతోంది. దీనివల్ల ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్నాయి. రక్తహీనతను నివారించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తు న్న ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో విజయవంతమైంది. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం, మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృ మరణాల సంఖ్యను తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని అమలు చేస్తోంది. అత్యధికంగా కొమురంభీం జిల్లాలో 83 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రిçÙన్ కిట్ల లక్ష్యం. ప్రభుత్వం ఒక్కో కిట్‌కు రూ.1,962 వెచ్చిస్తోంది. 13–27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్ చెకప్ సమయంలో ఒకసారి, 28–34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్ చెకప్ సమయంలో రెండోసారి కిట్‌ను ఇస్తారు. 9 జిల్లాల్లోని 231 ఆరోగ్య కేంద్రాల్లో వీటిని పంపిణీ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతంగా ఉన్న ప్రసవాలు, ఇప్పుడు 66 శాతానికి చేరాయి. తల్లీబిడ్డల సంరక్షణకు ఎక్కడా లేని పథకాల అమలు :హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: ‘తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది. పిల్లలు బాగుంటే భావిభారతం బాగుంటుంది. అందుకే తల్లీబిడ్డల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్నారు’అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్.. పౌష్టికాహారాన్ని అందించి, తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించనుందని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని మరింత చేరువ చేస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
గోల్డెన్ అరటిపండుతో పౌష్టికాహారం..
సిడ్నీ: అత్యధిక పోషక విలువలు కలిగిన బంగారం లాంటి అరటి పండును ‘క్వీన్‌లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ’కి చెందిన ఆస్ట్రేలియా పోలీసు తయారు చేశారు. ఈ పండులో పల గుజ్జు కొంచెం బంగారు రంగులోనూ, కొంచెం నారింజ పండు రంగులోనూ ఉంటుంది. అందుకనే దీనికి గోల్డెన్ బనానాస్ అని పిలుస్తున్నారు. ఉగాండాలో పౌష్టికాహార లోపంతో ఏటా ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల మంది పిల్లలు మరణిస్తుండడంతో వారికి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త రకం అరటి పండును సష్టించారు. బిల్‌గేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ చొరవతో, దాని ఆర్థిక సహాయంతో ఈ అరటి పండ్లను సష్టించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 2005లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. వారు ఇప్పటికి విజయం సాధించగలిగారు. 2020 సంవత్సరం నుంచి ఉగాండాలో ఈ రకం అరటి పండ్లు సాగులోకి తీసుకరావాలన్నది వారి సంకల్పం. ఉగాండా ప్రధాన ఆహారం అరటి పంఢ్లు కావడం, వారు ఎక్కువగా ఏ విటమిన్, ఐరన్ లోపంతో బాధ పడుతున్నందున ఈ ప్రయోగానికి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కొత్తగా సష్టించిన ఈ బంగారం లాంటి అరటి పండులో ఏ విటమిన్ పుష్కలంగా ఉందని వారు చెబుతున్నారు. -
జావ..చేవ
⇒ మారుతున్న నగర ప్రజల ఆహారపు అలవాట్లు ⇒ జావ, గటక, దలియా, మొలకలకు ప్రాధాన్యం ⇒మారుతున్న నగర ప్రజల ఆహారపు అలవాట్లు ⇒ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాల వైపు చూపు ⇒జావ, గటక, దలియా, మొలకలకు ప్రాధాన్యం ⇒‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ నినాదంతో ముందుకు ఖమ్మం హవేలి: సంప్రదాయ వంటకాలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు మళ్లీ వాటినే ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యం అలనాటి వంటల్లోనే ఉందనే విషయాన్ని ఇన్నాళ్లకు గ్రహించినట్టున్నారు. ‘బ్యాక్ టు నేచర్’ అనే నినాదంతో సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు, పెసలు, మినుములు, గోధుమలతో తయారు చేసిన గటక, జావ, దనియా (అన్ని చిరుధాన్యాలు కలిపిన పిండి), మొలకలు సత్ఫలితాలు ఇస్తుండటంతో ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఉదయం అల్పాహారానికి బదులు జొన్న, రాగి జావకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఆహారంతోనే రోజును ప్రారంభిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మార్నింగ్ వాకర్స్, క్రీడాకారులు, జిమ్‌కు వెళ్లేవారు, బాడీబిల్డర్స్, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు కాస్తంత ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని స్వీకరిస్తున్నారు. నగరంలో ఉదయాన్నే జనసమర్థం ఎక్కువగా ఉండే చోట గటక, జావ విక్రయ స్టాల్స్ వెలుస్తున్నాయి. ఎనీ ఐటెమ్ టెన్ రూపీస్ ఓన్లీ.. ఈ స్టాల్స్‌లో జన్న, రాగి జావతో పాటు వామువాటర్, మొలకలు లభిస్తున్నాయి. ఏ ఐటమ్ అయినా రూ.10కే లభిస్తుండడంతో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. జావలో శొంఠి, మిరియాల పొడి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, మజ్జిగ, నిమ్మకాయ రసం, తేనె కలిపి ఇస్తుండటంతో ఆరోగ్యానికి ఆరోగ్యం..రుచికి రుచి ఉంటుండటంతో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వీటిలో కారం, మసాలాలు లేకపోవడంతో ఆరోగ్యానికి ఉపకరిస్తున్నాయి. ఇక ఇంటి వద్ద రొట్టెలు తయారు చేసుకునే దలియా (చిరుధాన్యల మిశ్రమాల పిండి)కి కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. సర్దార్‌పటేల్ స్టేడియం, భక్తరామదాసు కళాక్షేత్రం, రైతుబజార్, డీఆర్డీఏ కూరగాయల మార్కెట్ వద్ద రెండుళ్లుగా ఈ ఆహారపదార్థాల స్టాల్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం 5:30 నుంచి 11:00 గంటల వరకు వీటి వద్దకు వందల సంఖ్యలో జనం వచ్చి జావ, గటక సేవిస్తున్నారు. కొందరు ఇళ్లకు పార్సిల్స్ తీసుకెళ్తున్నారు. డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉండటం కూడా కలిసొస్తోంది. తక్కువ పరిమాణం.. ఎక్కువ శక్తి చిరుధాన్యాల ఆహారం కావడంతో తక్కువ పరిమాణంలో తీసుకున్నా సరే ఎక్కవ శక్తి లభిస్తోందని వినియోగదారులు అంటున్నారు. షుగర్, మలబద్ధకం జీర్ణసంబంధ వ్యాధుల నియంత్రణ, లావు, బరువు తగ్గటం, రక్తశుద్ధి, రోగ నిరోధకశక్తి పెంపుదలకు ఈ ఆహారపదార్థాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయని పలువురి అభిప్రాయం. ఆయా ఆహారపదార్థాలతో ఉపయోగం.. జొన్నల్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇనుము, కాల్షియం, జింక్, పొటాష్, పాస్ఫరస్ లాంటి పోషకాలు, థయామిన్, రైబోఫ్లోవిన్, లాంటి ‘బి’ విటమిన్లు లభిస్తాయి. టానిన్లూ, ఫెనోలిక్ ఆమ్లాలు యంథోసియానిన్స్ లాంటి ఫైటోకెమికల్స్ శరీర బరువును తగ్గించడమే కాకుండా శక్తినిస్తాయి. గర్భిణులకు ఇవి మరీ మంచిది. రాగుల్లో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, ‘ఏ’, ‘బి’ విటమిన్స్ లభిస్తాయి. ఫాస్ఫరస్ లాంటి పోషకాలు, పీచు పదార్థాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. కాల్షియం ఎముకల్ని దృఢపరుస్తుంది. కీళ్లనొప్పులు, మహిళల్లో మోనోపాజ్ (40ఏళ్లు దాటిన) దశ దాటిన తరువాత ఆస్టియోపోరోసిస్ రాకుండా ఇవి నియంత్రిస్తాయి. రాగులు మైగ్రెయిన్ ను తగ్గిస్తాయి. బాలింతలకు పాలు పెరిగేందుకు దోహదపడుతాయి. మహిళల్లో రక్తహీనతను నివారించే ఇనుము పెరుగుతుంది. రాగుల్లో ఉన్న మెగ్నీషియం నెలసరిలో వచ్చే నొప్పులు, అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. సజ్జలు, సామలు, బార్లీ, రాజ్గీరా ధాన్యాల్లో గ్లైసమిన్ ఇండెక్స్ తక్కువ. అవి జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఇన్సులిన్ నియంత్రించబడి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. నాడీవ్యవస్థ బాగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరిగేలా ఇందులో ఉన్న ‘బి’ విటమిన్ దోహదపడుతుంది. గుండెజబ్బులు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ వంటికి రాకుండా ఉంటాయి. బీపీ, గుండెజబ్బులు, కొలెస్ట్రాల్ ఉన్న మహిళలు వారానికి 6 సార్లు చిరుధాన్యాలు తీసుకోవాలని న్యూట్రిషన్స్సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ చిరుధాన్యాలను ఒకేసారి కాకుండా నెమ్మదిగా జీవనవిధానంలో చేరిస్తే బాగుంటుందని వైద్యుల సలహా.