గోల్డెన్‌ అరటిపండుతో పౌష్టికాహారం.. | Nutrition with Golden Banana | Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ అరటిపండుతో పౌష్టికాహారం..

Published Fri, Jul 7 2017 4:13 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

Nutrition with Golden Banana



సిడ్నీ:
అత్యధిక పోషక విలువలు కలిగిన బంగారం లాంటి అరటి పండును ‘క్వీన్‌లాండ్‌ యూనివర్శిటీ ఆఫ్‌ టెక్నాలజీ’కి చెందిన ఆస్ట్రేలియా పోలీసు తయారు చేశారు. ఈ పండులో పల గుజ్జు కొంచెం బంగారు రంగులోనూ, కొంచెం నారింజ పండు రంగులోనూ ఉంటుంది. అందుకనే దీనికి గోల్డెన్‌ బనానాస్‌ అని పిలుస్తున్నారు. ఉగాండాలో పౌష్టికాహార లోపంతో ఏటా ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల మంది పిల్లలు మరణిస్తుండడంతో వారికి పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త రకం అరటి పండును సష్టించారు. 
 
బిల్‌గేట్స్, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ చొరవతో, దాని ఆర్థిక సహాయంతో ఈ అరటి పండ్లను సష్టించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు 2005లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. వారు ఇప్పటికి విజయం సాధించగలిగారు. 2020 సంవత్సరం నుంచి ఉగాండాలో ఈ రకం అరటి పండ్లు సాగులోకి తీసుకరావాలన్నది వారి సంకల్పం. ఉగాండా ప్రధాన ఆహారం అరటి పంఢ్లు కావడం, వారు ఎక్కువగా ఏ విటమిన్, ఐరన్‌ లోపంతో బాధ పడుతున్నందున ఈ ప్రయోగానికి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కొత్తగా సష్టించిన ఈ బంగారం లాంటి అరటి పండులో ఏ విటమిన్‌ పుష్కలంగా ఉందని వారు చెబుతున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement