nuziveedu mla meka pratap apparao
-
నూజివీడు ఎమ్మెల్యేకు పితృ వియోగం
సాక్షి, నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి మేకా వెంకట శ్వేతా చలపతి వేణుగోపాల అప్పారావు (94) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును... పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. అలాగే పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు సానుభూతి తెలిపారు. -
నూజివీడు ఎమ్మెల్యేకు వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శ
నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు సతీమణి సుజాతాదేవి ఆకస్మిక మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ఈమేరకు ఆయన మేకా ప్రతాప్ అప్పారావుకు ఫోన్ చేసి పరామర్శించారు. సోమవారం జరిగే సుజాతా దేవి అంత్యక్రియలకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు.