N.V.S.REDDY
-
మెట్రో కోటిన్నర మందికి ఉపయోగం: ఎన్వీఎస్ రెడ్డి
కూకట్పల్లి: నగరంలో 72 కి.మీ మార్గంలో ఏర్పాటవుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును సమీప భవిష్యత్‌లో మహానగర పరిధిలోని కోటిన్నర మంది ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చే విధంగా తీర్చిదిద్దుతున్నామని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు స్టేషన్లు, సమీప కాలనీలను అనుసంధానించేందుకు ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు వెల్లడించారు. నగరంలో అన్ని వర్గాల ప్రజలకు మైట్రోరైళ్లు అందుబాటులో ఉండే విధంగా పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఆదివారం కూకట్‌పల్లిలోని ఆకార్ ఆశ ఆస్పత్రిలో మెట్రో ట్రావెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అంతకుముందు ఆకార్ ఆశ ఆస్పత్రి ఆవరణలో చెట్లు నాటారు. కార్యక్రమంలో మెట్రో ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు లింగారెడ్డి, గోపాల్‌రావు, డి.ఎస్.శాస్త్రి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మెట్రో ప్రాజెక్టు విశిష్టతలు ఎన్వీఎస్ రెడ్డి మాటల్లో.. ప్రయాణికులు ప్రతిరోజూ టిక్కెట్ తీసుకునే అవసరం లేకుండా మెట్రో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు మెట్రో రైలు ఎంతో దోహదం చేస్తుంది. ప్రతి ట్రిప్పులో ఒకేసారి వేయి మంది ప్రయాణికులను తీసుకెళ్లే అవకాశం. గంటన్నర ప్రయాణ కాలాన్ని అరగంటకే కుదింపు. హైదరాబాద్‌లోని మూడు కారిడార్ల పరిధిలో దశలవారీగా 57 రైళ్లు (171 కోచ్‌లు) తిరిగేలా చర్యలు. ప్రతి స్టేషన్ వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు. కోచ్‌లో వికలాంగులు, సీనియర్ సిటిజన్స్‌తో పాటు పిల్లలకు ప్రత్యేక సీట్లు కేటాయింపు. మెట్రో పిల్లర్ల కింద గార్డెన్ల ఏర్పాటు. వీకెండ్లో పిల్లలతో సహా మెట్రో స్టేషన్ల సమీపంలో ఏర్పాటు చేయనున్న గేమ్జోన్లు, షాపింగ్ ఏరియాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు. మెట్రో మెంబర్షిప్ కార్డు తీసుకుంటే వారికి ఉచిత ప్రవేశం. -
చకచకా ‘మెట్రో’ నిర్మాణం
ఉప్పల్, న్యూస్‌లైన్: మెట్రో రైలు వంతెన నిర్మాణం అద్భుతమని రైల్వే బోర్డు ఇంజనీరింగ్ సభ్యుడు ఎస్కే జైన్ కొనియాడారు. అతి తక్కువ సమయంలో అతి తక్కువ స్థలంలో అతి పెద్ద, అత్యాధునిక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం హర్షణీయమన్నారు. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ, ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్‌తో కలిసి శనివారం ఆయన ఉప్పల్‌లో మేట్రో రైలు స్టేషన్, రైల్వే ట్రాక్ తదితర నిర్మాణాలను పరిశీలించారు. మెట్రో రైలు డిపో నిర్మాణం, పనిచేస్తున్న విభాగాలను పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నిర్మాణం, డిజైన్, అత్యాధునిక సౌకర్యాలతో లే అవుట్ వంటివి అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇంతటి పట్టిష్టమైన నిర్మాణం మరెక్కడా కనబడలేదన్నారు. దేశంలోని కట్టడాలకు ఇది మార్గదర్శకంగా రూపొందాలని ఆకాంక్షించారు. మెట్రో వంతెన పనుల్లో కొన్ని న్యాయపరమైన సమస్యలున్నప్పటికీ త్వరలోనే వాటిని అధిగమిస్తామన్నారు. జూన్‌లో ట్రయల్ రన్... ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ... ‘నగరంలో మెట్రో రైలు 8 ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్ చేయాల్సి ఉంటుంది. ఒత్తిడులకు లొంగనందుకే అనేక విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో 80 లక్షల మందికి మేలు జరుగుతుంది. ఈ క్రమంలో కొద్దిమందికి సమస్యలు తప్పవు. జూన్‌లో మెట్రో రైలు ట్రయల్ రన్ ఉంటుంది’ అన్నారు. -
జూన్‌లో ‘మెట్రో’ ట్రయల్ రన్
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల కలల మెట్రో రైలు ట్రయల్న్ ్రఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానుం ది. ఉప్పల్ మెట్రో డిపో దీనికి వేదిక కానుంది. ముం దుగా అనుకున్న ప్రకారమే 2015 మార్చి 21న (ఉగా ది రోజున) నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. నాగోల్-రహేజా మైండ్‌స్పేస్, జూబ్లీబస్‌స్టేషన్-ఫలక్‌నుమా, ఎల్బీనగర్-మియాపూర్ రూట్లలో మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టును 2017 జూన్ (నిర్ణయించిన గడువు) లోగా పూర్తిచేస్తామని ప్రకటించారు. ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆయనతో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి నగరవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. పలువురు సిటీజనులు వివిధ అంశాలపై ఎండీని ఫోన్లో ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.