octopuses
-
వైరల్ వీడియో: వావ్.. సముద్రం అడుగున ఆక్టోపస్‌తో స్కూబా డైవర్ ఆటలు
-
వావ్.. సముద్రం అడుగున ఆక్టోపస్‌తో స్కూబా డైవర్ ఆటలు
ఎన్నో అద్భుతాలు, అందమైన జీవులకు నిలయం సముద్ర గర్భం. అక్కడ కన్పించే జలచరాలను చూస్తే ముచ్చటేస్తుంది. ఒక్కసారైనా వాటి దగ్గరకు వెళ్తే బాగుండనిపిస్తుంది. సాధారణ మనుషులకు ఇది కష్టమే అయినా స్కూబా డైవర్లు చాలా ఈజీ. వారు చాలా సార్లు సముద్రం అడుగుకు వెళ్తుంటారు. ఇప్పుడు అలాంటి స్కూబా డైవర్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సముద్ర గర్భంలో అతడు ఆక్టోపస్‌తో సరదాగా ఆడుకున్నాడు. అది కూడా అతనితో చనువుగా మెదిలింది. స్కూబ్ డైవర్ అరచేతి చూపగానే ఆక్టోపస్ అటువైపే దూసుకెళ్లింది. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత.. ఆక్టోపస్ అతని చేతిపైకి వెళ్లి సేదతీరింది. ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి దాదాపు 30లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. స్కూబా డైవర్‌కు ఆక్టోపస్ హగ్ ఇచ్చిందని, అతను చాలా లక్కీ అని చమత్కరించారు. చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
అక్టోపస్ సిటీ..!?
-
అక్టోపస్ సిటీ..!?
న్యూఢిల్లీ : ఇదేంటి ఆక్టోపస్‌లకు సిటీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇదెక్కడైనా సాధ్యమేనా? అనే ప్రశ్న వచ్చిందా? మీరు చదివింది అక్షరాల నిజం.. ఆస్ట్రేలియాకు తూర్పుతీరంలో ఆక్టోపస్‌లు నిజంగానే నగరాన్ని నిర్మించుకున్నాయి. మనుషులు నిర్మించుకున్నట్లే.. సాగరగర్భంలో మహారాజసౌధాలను ఏర్పాటు చేసుకున్నాయి.. ఇల్లినాయిస్, చికాగో, అలాస్కా రీసెర్చ్ విద్యార్థులు, అంతర్జాతీయ పరిశోధకులు సంయుక్తంగా పసిఫిక్ సముద్రంపై పరిశోధనలు చేస్తుండగా ఈ విచిత్రం బయటపడింది. ఆస్ట్రేలియాకు తూర్పు తీరంలో సైంటిస్టులు పరిశోధనలు చేస్తుండగా.. రంగులు మార్చే ఆక్టోపస్‌లు వెలుగుచూశాయి. ఆక్టోపస్ సిటీ మొత్తం 10 నుంచి 15 మీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉంది. జంతువుల వదిలేసిన శకలాలు, మృతి చెందిన జంతుకళేబరాలతో నిర్మించబడి ఉండడం గమనార్హం. ఒక సిటీలో 10 నుంచి 13 ఆక్టోపస్‌లు నివాసముంటున్నాయి.