అక్టోపస్ సిటీ..!?
న్యూఢిల్లీ : ఇదేంటి ఆక్టోపస్‌లకు సిటీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇదెక్కడైనా సాధ్యమేనా? అనే ప్రశ్న వచ్చిందా? మీరు చదివింది అక్షరాల నిజం.. ఆస్ట్రేలియాకు తూర్పుతీరంలో ఆక్టోపస్‌లు నిజంగానే నగరాన్ని నిర్మించుకున్నాయి. మనుషులు నిర్మించుకున్నట్లే.. సాగరగర్భంలో మహారాజసౌధాలను ఏర్పాటు చేసుకున్నాయి.. ఇల్లినాయిస్, చికాగో, అలాస్కా రీసెర్చ్ విద్యార్థులు, అంతర్జాతీయ పరిశోధకులు సంయుక్తంగా పసిఫిక్ సముద్రంపై పరిశోధనలు చేస్తుండగా ఈ విచిత్రం బయటపడింది. ఆస్ట్రేలియాకు తూర్పు తీరంలో సైంటిస్టులు పరిశోధనలు చేస్తుండగా.. రంగులు మార్చే ఆక్టోపస్‌లు వెలుగుచూశాయి.
ఆక్టోపస్ సిటీ మొత్తం 10 నుంచి 15 మీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉంది. జంతువుల వదిలేసిన శకలాలు, మృతి చెందిన జంతుకళేబరాలతో నిర్మించబడి ఉండడం గమనార్హం. ఒక సిటీలో 10 నుంచి 13 ఆక్టోపస్‌లు నివాసముంటున్నాయి.