అక్టోపస్‌ సిటీ..!? | underwater octopuses 'city' | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 20 2017 3:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ఇదేంటి ఆక్టోపస్‌లకు సిటీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇదెక్కడైనా సాధ్యమేనా? అనే ప్రశ్న వచ్చిందా? మీరు చదివింది అక్షరాల నిజం.. ఆస్ట్రేలియాకు తూర్పుతీరంలో ఆక్టోపస్‌లు నిజంగానే నగరాన్ని నిర్మించుకున్నాయి. మనుషులు నిర్మించుకున్నట్లే.. సాగరగర్భంలో మహారాజసౌధాలను ఏర్పాటు చేసుకున్నాయి.. ఇల్లినాయిస్‌, చికాగో, అలాస్కా రీసెర్చ్‌ విద్యార్థులు, అంతర్జాతీయ పరిశోధకులు సంయుక్తంగా పసిఫిక్‌ సముద్రంపై పరిశోధనలు చేస్తుండగా ఈ విచిత్రం బయటపడింది. ఆస్ట్రేలియాకు తూర్పు తీరంలో సైంటిస్టులు పరిశోధనలు చేస్తుండగా.. రంగులు మార్చే ఆక్టోపస్‌లు వెలుగుచూశాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement