కర్ణాటక బ్యాంక్ 1.2 రైట్స్ ఇష్యూ
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్ రైట్స్ ఇష్యూ వివరాలు వెల్లడించింది. 1:2 నిష్పత్తిలో రైట్స్‌ను చేపట్టనుంది. దీని ప్రకారం వాటాదారుల దగ్గరున్న ప్రతీ 2 షేర్లకు 1 షేరును జారీ చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 70 ధరలో రైట్స్ షేర్లను ఇవ్వనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలియజేసింది. శుక్రవారం నాటి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రెండు షేర్లకు ఒక వాటా నిష్పత్తిలో రైట్స్ ఆధారంగా బ్యాంకు ఈక్విటీ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు.
జూన్ తో ముగిసిన ఫస్ట్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించిన బ్యాంకు 11.16 శాతం వృద్ధితో రూ. 121.54 కోట్ల నికల లాభాలను ఆర్జించింది. బ్యాడ్ లోన్లు 1,389 కోట్లుగా నమోదు చేసింది. రూ 96.000 కోట్ల బజినెస్ టర్నోవర్ బ్యాంకు ఆశిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో కర్ణాటక బ్యాంక్ షేరు ప్రారంభంలో 2.2 శాతానికిపైగా లాభపడింది. చివర్లో అమ్మకాల ఒత్తిడితో 4 శాతానికి పైగా నష్టపోయి 143 దగ్గర ముగిసింది.