offerings
-
ఏడుకొండలవాడికి 50 రకాలకు పైగా నైవేద్యాలు
-
ఆశ్చర్యం! కాకతీయ వారసులకు సమ్మక్క సారే
కాకతీయుల రాజులతో పోరాడి అమరులై ఆ తర్వాత దైవత్వం సాధించుకున్న వీర వనితలుగా సమ్మక్క సారలమ్మలకు పేరుగాంచారు. వారి వీరత్వం, త్యాగాలకు స్మరిస్తూ ప్రతీఏడు జాతర జరుపుకోవడం వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే గతాన్ని పక్కన పెట్టి కొత్త సంబంధాలకు తెర తీశారు సమ్మక్క పూజారులు. కాకతీయు వారసులకు సమ్మక్క తరఫున సారెను పంపారు. ప్రతాపరుద్రుడి మరణంతో వరంగల్ కేంద్రంగా కొనసాగిన కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. అయితే ప్రతాపరుద్రుడి కుటుంబ సభ్యులు గోదావరి తీరం వెంట సాహాస ప్రయాణం చేస్తూ దండకారణ్యం చేరుకున్నారు. కాకతీయ వారసుడిగా అన్నమదేవ్ జగదల్పూర్ కేంద్రంగా కొత్త సామ్ర్యాజ్యం స్థాపించాడు. బ్రిటీష్ వారి చారిత్రక పరిశోధనల్లోనూ అన్నమదేవ్ కాకతీయ వారసుడిగా తేలింది. ప్రస్తుతం అన్నమదేవ్ పరంపరలో చంద్రదేవ్భంజ్ కొనసాగుతున్నారు. రాజరికం అంతరించినా.. జగ్దల్పూర్ కోటలో ఉంటూ స్థానిక పండుగుల్లో గత సంప్రదాయాలను, వైభవాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 16న మొదలైన జాతర ఫిబ్రవరి 23న తిరుగు వారం పండుగతో ముగిసింది. జాతర ముగిసిన తర్వాత సమ్మక్క పూజారులుగా చెప్పుకునే సిద్ధబోయిన వంశస్తులు కాకతీయ వారుసుడైన చంద్రదేవ్భంజ్కి సమ్మక్క సారెగా బంగారం (బెల్లం), గాజులు, కుంకుమ భరిణి, చీర, కండువాలను పంపించారు. వందల ఏళ్ల క్రితమే ఉన్న బంధాన్ని మరోసారి తట్టి లేపారు. మేడారం జాతర, బస్తర్ దసరా వేడుకలపై పరిశోధనలు చేస్తున్న టార్చ్ సంస్థ కన్వీనర్ అరవింద్ పకిడె ద్వారా ఈ సారేను సమ్మక్క పూజారులు పంపించారు. తిరుగువారం పండుగ ముగిసిన వెంటనే వీటిని తీసుకుని టార్చ్ బృందం జగదల్పూర్ వెళ్లింది. కాగా ఫిబ్రవరి 25 శుక్రవారం రాజమాత కృష్ణకుమారి దేవికి ఈ సారెను సమ్మక్క తరఫున అందించారు. పరిశోధనలు జరగాలి - సిద్ధబోయిన అరుణ్‌కుమార్ (సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు) కాకతీయ రాజులు, సమ్మక్క కుటుంబీల మధ్య ఉన్న సంబంధాలు నెలకొన్న వివాదాలపై అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై విస్తారమైన పరిశోధనలు జరగలేదు. పైపై విషయాలకే ఎక్కువ ప్రచారం దక్కింది. కానీ ఆనాదిగా దండకారణ్యంతో ఆదివాసీలకు వారిలో ఒకరైన సమ్మక్క ఆమె కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయి. మా పూర్వీకులు మాకు అదే విషయం చెప్పారు. మరోవైపు కాకతీయ రాజులకు దండకారణ్యంతో సంబంధాలు ఉన్నాయి. దీంతో కాకతీయ వారసులకు సారెను పంపి కొత్త బంధవ్యాలకు తెర తీశాం. వచ్చే జాతరకు వారిని ఆహ్వానించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. మహిళా శక్తికి ప్రతిరూపం - చంద్రదేవ్భంజ్ (కాకతీయుల వారసుడు) వీర నారీమణి, త్యాగానికి మరోపేరైన సమ్మక్క సారేను మా కుటుంబం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. దండకారణ్యంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఉంటుంది. ఆనాదిగా మేము స్త్రీలను శక్తి స్వరూపాలుగా చూస్తున్నాం. సమ్మక్కను ఇక్కడ సడువలిగా కొలుస్తారు. ఇక్కడే దంతేశ్వరి ఆలయం కూడా ఉంది. వరంగల్ - దండకారణ్యంల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సారెతో అవి మరింత బలపడనున్నాయి. -
నైన్‌వేద్యాలు
మంచి పెంచు స్వామీ.సంపద ఇవ్వు స్వామీ.సంతోషం పంచు స్వామీ.సోదరభావం నేర్పించు స్వామీ.దానాన్ని బోధించు స్వామీ.సంస్కారం అలవర్చు స్వామీ.దయను కలిగించు స్వామీ.స్వస్థత చేకూర్చు స్వామీ.శాంతిని ప్రసాదించు స్వామీ.తొమ్మిది నైవేద్యాలు స్వీకరించి నవ జీవనాన్ని దయ చేయి తండ్రీ. పాల తాలికలు కావలసినవి: పాలు – ఒక లీటరు; బెల్లం పొడి – పావు కేజీ; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; సగ్గు బియ్యం – 50 గ్రా.; బియ్యం – పావు కేజీ; జీడి పప్పు – 50 గ్రా.; నెయ్యి – 6 టీ స్పూన్లు; ఉప్పు – చిటికెడు తయారీ ∙ముందురోజు బియ్యాన్ని తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙మరుసటి రోజు ఉదయం నీళ్లు శుభ్రంగా ఒంపేసి, పొడి వస్త్రం మీద బియ్యం ఆరబోసి, బియ్యంలోని తడి పోయిన తరవాత, మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఈ పిండికి బెల్లం పొడి, వేడి పాలు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ∙ కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని సన్నగా పొడవుగా తాలికలుగా ఒత్తి పక్కన ఉంచాలి ∙ఒక మందపాటి గిన్నెలో లీటరు పాలకు కప్పుడు నీళ్లు జత చేసి, సగ్గుబియ్యం కూడా వేసి స్టౌ మీద ఉంచి, సగ్గు బియ్యం ఉడికేవరకు మరిగించాక, తయారుచేసి ఉంచుకున్న తాలికలను పాలలో వేసి జాగ్రత్తగా కలపాలి ∙ చివరగా బెల్లం, నెయ్యి, ఏలకుల పొడి జత చేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి దింపేయాలి ∙చల్లగా అందించాలి. పప్పు ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పెసర పప్పు – ఒక కప్పు (నానబెట్టి, నీరు ఒంపేయాలి); బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి కలుపుతుండాలి ∙పిండి గట్టిపడ్డాక బాణలి దింపేసి, పిండి కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙వేరొక బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙నానబెట్టి ఉంచుకున్న పెసర పప్పును వేసి కలపాలి ∙బెల్లం పొడి జత చేసి మరోమారు కలిపి, తగినన్ని నీళ్లు జత చేయాలి ∙పెసర పప్పు బాగా ఉడికిన తరవాత ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న చిన్ని చిన్ని ఉండ్రాళ్లను ఇందులో వేసి కలిపి దింపేయాలి ∙అంతే పప్పు ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే. ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యపు రవ్వ – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; సెనగ పప్పు/పెసర పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద మందపాటి ఇత్తడి గిన్నె కాని బాణలి కాని ఉంచి వేడి చేయాలి ∙వేడెక్కిన తరవాత టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙జీలకర్ర వేసి వేయించాలి ∙శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసి బాగా వేయించాలి ∙ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి ∙సెనగపప్పు, ఉప్పు జత చేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యపు రవ్వ వేసి ఆపకుండా కలుపుతుండాలి ∙మంట బాగా తగ్గించి, మూత పెట్టాలి ∙ మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బాగా ఉడుకుపడుతుండగా టేబుల్ స్పూను నెయ్యి వేసి కలపాలి ∙ పూర్తిగా ఉడికిన తరవాత గిన్నె/బాణలి దింపేసి ఉడికిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.చల్లారాక కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని గుండ్రంగా ఉండ్రాళ్లు తయారుచేసుకోవాలి ∙వినాయకుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. ఫ్రైడ్ మోదక్ కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; గోరు వెచ్చని నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని ఫిల్లింగ్ కోసం: బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు. పైభాగం తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, గోరు వెచ్చని నూనె, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి, సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. ఫిల్లింగ్ తయారీ: ∙ఫిల్లింగ్ కోసం చెప్పిన పదార్థాలను ఒక మందపాటి పాత్రలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపి పక్కన ఉంచాలి. మోదకాల తయారీ: ∙గోధుమపిండి మి్రÔ¶ మాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తి చేతిలోకి తీసుకోవాలి ∙ఫిల్లింగ్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఒత్తిన చపాతీ మధ్యలో ఉంచి, అన్నిపక్కలా కొద్దికొద్దిగా దగ్గరకు తీసుకుంటూ (బొమ్మలో చూపిన విధంగా) మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసి పక్కన ఉంచుకోవాలి ∙ బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, కాగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి. చాకొలేట్ మోదక్ కావలసినవి: పచ్చి కోవా – ఒక కప్పు (సన్నగా తురమాలి); చాకొలేట్ చిప్స్ – అర కప్పు; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి – కొద్దిగా గార్నిషింగ్ కోసం: పిస్తా పప్పుల తరుగు – రెండు టీ స్పూన్లు; గులాబీ రేకలు – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడి చేసి, మంట బాగా తగ్గించి పచ్చి కోవా తురుము వేసి, ఆపకుండా కలుపుతుండాలి ∙కోవా కరగడం మొదలైన తరవాత, పంచదార పొడి వేసి బాగా కలిపాక, చాకొలేట్ చిప్స్ వేసి వెంటనే కలిపేయాలి ∙చాకొలేట్ చిప్స్ కరిగి, మిశ్రమం చిక్కబడుతుండగా ఏలకుల పొడి వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙మిశ్రమం మరీ గట్టిపడకుండా చూసుకోవాలి ∙ఉడుకుతున్న మిశ్రమం అంచులను విడవగానే, ఒక పాత్రలోకి తీసుకుని, చల్లారనివ్వాలి ∙బాగా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙మోదక్ మౌల్డ్స్ తీసుకుని ఒక్కో ఉండను అందులో ఉంచి జాగ్రత్తగా మూత తీసి మోదకాలను, నెయ్యి పూసిన ప్లేట్లో ఉంచాలి ∙గులాబీ రేకలు, పిస్తా తరుగు తో అందంగా అలంకరించి, వినాయకుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా సేవించాలి (ఇష్టపడేవారు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా కూడా తినొచ్చు. వీటిని త్వరగా తినేయాలి, లేదంటే చాకొలేట్ కరిగిపోయే అవకాశం ఉంటుంది) డ్రైఫ్రూట్స్ మోదక్ కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – పావు టీ స్పూను మోదక్ ఫిల్లింగ్ కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి కోవా – 100 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; బాదం పప్పులు – పావు కప్పు; జీడి పప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా తరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; చిరోంజీ – ఒక టేబుల్ స్పూను; ఖర్జూరాల తరుగు – ఒక టేబుల్ స్పూను; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – పావు కప్పు. తయారీ: ∙ఒక పాత్రను స్టౌ మీద ఉంచి వేడయ్యాక నీళ్లు పోసి మరిగించాలి ∙పావు టీ స్పూను ఉప్పు వేసి కలియబెట్టాలి ∙నీళ్లు బాగా మరుగుతుండగా మంట తగ్గించి, బియ్యప్పిండి వేస్తూ కలపాలి ∙కొద్దిగా ఉడికించి వెంటనే దింపేయాలి ∙ఉడికిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙పిండి బాగా చల్లారాక చేతితో బాగా కలిపి మూత పెట్టి పావు గంట సేపు పక్కన ఉంచాలి. డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్ తయారీ: డ్రై ఫ్రూట్స్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙తరిగి ఉంచుకున్న బాదం పప్పులు, జీడి పప్పు పలుకులు, పిస్తా, ఖర్జూరం, చిరోంజీ, కిస్మిస్లను వేసి రెండు నిమిషాల పాటు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ∙గసగసాలు వేసి చిటపటలాడేవరకు వేయించి డ్రైఫ్రూట్స్‌తో పాటు పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కోవా వేసి బాగా కలపాలి ∙కోవా కరుగుతున్న సమయంలో పావు కప్పు పంచదార వేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం ఉడుకుపట్టగానే, పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, గసగసాలు వేసి కలిపి దింపేసి, మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకోవాలి. మోదకాల తయారీ: ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఒత్తాలి ∙డ్రైఫ్రూట్స్ మిశ్రమం కొద్దిగా తీసుకుని అందులో ఉంచి, అన్నివైపులా మూసేయాలి (మౌల్డ్స్‌లో చేసుకుంటే చూడటానికి బాగుంటాయి) ∙అన్నీ తయారుచేసుకున్నాక ఇడ్లీ స్టాండులో ఉంచి, స్టౌ మీద పెట్టి ఆవిరి మీద ఉడికించి దింపేయాలి. కొబ్బరి ఉండ్రాళ్ల పాయసం కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – రుచికి తగినంత; నూనె – ఒక టీ స్పూను; పంచదార – 3 టేబుల్ స్పూన్లు; పాలు – 3 కప్పులు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకులు – 2 (పొడి చేయాలి); కిస్మిస్ – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద మందపాటి పాత్ర పెట్టి వేడి చేయాలి ∙నీళ్లు పోసి మరిగించాక, ఉప్పు జత చే సి బాగా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి మరోమారు కలపాలి ∙నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి మంట తగ్గించి, పిండి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి ∙పిండి ఉడికి బాగా గట్టిపడ్డాక దింపి, చల్లారనివ్వాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద మరో బాణలి పెట్టి, వేడయ్యాక పాలు పోసి మరిగించాలి ∙పంచదార, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్న ఉండ్రాళ్లను పాలలో వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి ∙కొద్దిగా పాలలో టేబుల్ స్పూను బియ్యప్పిండి వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేయాలి ∙జీడి పప్పులు వేసి మరోమారు కలియబెట్టాలి ∙కొద్దిగా ఉడుకుçపట్టాక కొబ్బరి తురుము వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి. ఉండ్రాళ్ల పాయసం కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; పాలు – అర లీటరు; పంచదార – ఒక కప్పు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీస్పూను; జీడి పప్పు – కొద్దిగా; సార పలుకులు – కొద్దిగా తయారీ: ∙ముందుగా స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, సార పలుకులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ∙నీళ్లు మరిగిన వెంటనే టీ స్పూను పంచదార వేసి కలపాలి ∙బియ్యప్పిండి (కొద్దిగా పిండి పక్కన ఉంచుకోవాలి) వేసి కలపాలి ∙పిండి ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతూ, పిండి గట్టి పడ్డాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙వేరే బాణలిలో పాలు పోసి మరిగించాలి ∙ఒక కప్పు పంచదార వేసి కరిగించాలి ∙కొద్దిగా ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి ∙ఏలకుల వలన సువాసన వస్తుంది ∙పాలు మరిగి చిక్కబడేవరకు కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న చిన్నచిన్న ఉండ్రాళ్లను మరుగుతున్న పాలలో వేయాలి ∙పక్కన ఉంచుకున్న బియ్యప్పిండిని కొద్దిగా చన్నీళ్లలో వేసి కలిపి, ఉడుకుతున్న పాలలో వేసి మరోమారు కలియబెట్టాలి ∙చివరగా... వేయించి ఉంచుకున్న జీడి పప్పులు, సార పలుకులను వేసి బాగా కలిపి దింపేయాలి ∙వినాయకుడికి నివేదన చేసి సేవించాలి. పూర్ణం కుడుములు కావలసినవి: సెనగ పప్పు – ఒక కప్పు; నీళ్లు – 3 కప్పులు; బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – కొద్దిగా తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేయాలి ∙బాణలిలో బెల్లం, కొద్దిగా నీరు పోసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించాలి ∙పాకం బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి ∙పొడి చేసి ఉంచుకున్న సెనగపప్పును వేసి కలియబెట్టాలి ∙పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి ∙మిశ్రమం దగ్గరపడేవరకు ఆపకుండా కలిపి దింపేయాలి ∙చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.వేరొక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిగా నెయ్యి జత చేసి కలపాలి ∙నీళ్లు బాగా మరిగాక బియ్యప్పిండి వేసి బాగా కలిపి ఉడికించాలి ∙ఉడికిన పిండిని ఒక పళ్లెంలోకి తీసి, చేతితో మెదుపుతూ ఉండలా చేయాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసుకోవాలి ∙ఉడికించిన బియ్యప్పిండిని కొద్దిగా తీసుకుని చేతితో ఒత్తాలి ∙సెనగ పప్పు + బెల్లం ఉండను మధ్యలో ఉంచి బియ్యప్పిండితో మూసేసి నున్నగా చేసి పక్కన ఉంచాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ స్టాండ్‌లో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి ∙ఉడికిన తరవాత దింపేసి, బయటకు తీసి, చల్లారాక తినాలి. -
పెసరే రామరసం
శ్రీరామనవమి వస్తే చలువ పందిళ్లు చల్లటి నీడనిస్తాయి. మల్లెలు రాముని పాదాల చెంతకు చేరటానికి వికసిస్తాయి. జగతి ఆ దివ్య జంట కల్యాణం కోసం సిద్ధమవుతుంది. శుభ ఘడియలలో శుచితో నిండిన రుచికరమైన పదార్థాలు పండగ శోభను తెస్తాయి... పెసర ప్రసాదం... పెసర చలువ చేసే పదార్థం... రాముడి కోసం రామభక్తుల కోసం ఇవిగో నైవేద్యాలు... పెసర పాయసం కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు + ఒకటిన్నర కప్పులు; పల్చటి కొబ్బరి పాలు – అర కప్పు; బెల్లం పొడి – ముప్పావు కప్పు; కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి∙– అర టీ స్పూను; జీడిపప్పు – 25 గ్రా; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను తయారీ: కుకర్‌లో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి ∙ ఒక గిన్నెలో పెసరపప్పు పోసి శుభ్రంగా కడిగి, ఒక కప్పు నీళ్లు జత చేసి ఉడికించి దింపేసి, చల్లారాక కొద్దిగా మెత్తగా అయ్యేలా మెదపాలి ∙ముప్పావు కప్పు బెల్లం పొడి జత చేసి స్టౌ మీద ఉంచి బాగా కలపాలి ∙ అర కప్పు కొబ్బరి పాలు జత చేసి మరో మారు బాగా కలపాలి ∙ చిన్న బాణలిలో కొబ్బరి నూనె వేసి కాగాక జీడిపప్పులు వేయించి తీసేయాలి ∙ అదే బాణలిలో కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ∙ ఉడికిన పెసరపప్పు పాయసంలో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్, ఏలకుల పొడి వేసి బాగా కలిపి అందించాలి. పెసర ఢోక్లా కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; అల్లం + పచ్చి మిర్చి ముద్ద – టేబుల్ స్పూను; నీళ్లు – అర కప్పు; కొత్తిమీర – టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; నిమ్మరసం – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ ఉప్పు – టీ స్పూను. పోపు కోసం.. నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; వేయించిన నువ్వులు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు గార్నిషింగ్ కోసం... కొత్తిమీర తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు తయారీ: ∙పెసరపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నాలుగు గంటల పాటు నాన»ñ ట్టి, నీళ్లు ఒంపేయాలి ∙కొత్తిమీర, అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి కొద్దిగా పలుకులా ఉండేలా మిక్సీ పట్టాలి. (మరీ ముద్దలా అవ్వకూడదు. మరీ పల్చగాను, మరీ గట్టిగానూ కూడా ఉండకూడదు) ∙ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మరిగించాలి ∙ఒక వెడల్పాటి పళ్లానికి కొద్దిగా నూనె పూసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో అల్లం + పచ్చిమిర్చి ముద్ద, నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, తయారుచేసి ఉంచుకున్న పెసరపిండి మిశ్రమాన్ని జత చేయాలి ∙చివరగా నిమ్మ ఉప్పు జత చేసి బాగా కలిపి, నూనె రాసి ఉంచుకున్న పాత్రలో పోసి సమానంగా పరవాలి ∙స్టౌ మీద మరుగుతున్న నీళ్ల పాత్రలో ఈ పళ్లెం ఉంచి, మూత పెట్టి, సుమారు పావుగంట అయ్యాక దింపేయాలి ∙బాగా చల్లారాక బయటకు తీయాలి ∙చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙నువ్వులు జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙ఇంగువ, కరివేపాకు వేసి వేయించి బాగా కలపాలి ∙రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి పోపు మిశ్రమాన్ని బాగా కలపాలి. ∙ఈ మిశ్రమాన్ని తయారుచేసి ఉంచుకున్న ఢోక్లా మీద వేయాలి ∙కొత్తిమీర, కొబ్బరి తురుములతో అలంకరించి అందించాలి. పెసరపప్పు తడ్కా కావలసినవి: పెసర పప్పు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – మూడు కప్పులు; ఉప్పు – తగినంత; జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5; గరం మసాలా – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఇంగువ – చిటికెడు; కొత్తిమీర – కొద్దిగా; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒక పాత్రలో పెసర పప్పు, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, మూడు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙విజిల్ తీసి, మిశ్రమం మరీ గట్టిగా ఉంటే, కొద్దిగా నీళ్లు, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి ∙చిన్న బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి, కరిగాక జీలకర్ర వేసి వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు జత చేసి, కొద్దిగా వేయించాలి ∙గరం మసాలా పొడి, మిరప కారం, ఇంగువ జత చేసి కలిపి వెంటనే పెసరపప్పు తడ్కాలో వేసి కలపాలి ∙కొత్తిమీరతో అలంకరించి అందించాలి. పెసర బూరెలు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; బియ్యం – అర కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – చిటికెడు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙ముందుగా ఒక పాత్రలో మినప్పప్పు, బియ్యం, వేసి సుమారు నాలుగు గంటలు నానబెట్టి, నీరు ఒంపేసి, మిక్సీలో వేసి, ఉప్పు జతచేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బి పక్కన ఉంచాలి ∙పెసర పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙బాణలిలో తగినన్ని నీళ్లు పోసి మరిగించాక, పెసరపప్పు జత చేసి ఉడికించాక రంధ్రాలున్న గిన్నెలో పోసి నీళ్లు పోయేవరకు సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి, ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు ముద్ద, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసి కలిపి, గడ్డ కట్టిన తరవాత దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న పెసర పూర్ణాలను మినప్పప్పు మిశ్రమంలో ముంచి బూరెల మాదిరిగా నూనెలో వేసి వేయించాలి ∙దోరగా వేగిన తరవాత పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙కొద్దిగా చల్లారాక మధ్యకు కట్ చేసి, కాచిన నెయ్యి వేసి అందించాలి. -
కోటీశ్వర గణపతి...
అగజానన పద్మార్కమ్ గజాననమహర్నిశమ్ అనేకదం తం భక్తానామ్ ఏకదంతముపాస్మహే ॥ జిఎస్బి సేవా మండలి వినాయకుడు విలక్షణుడు. ఆయన బంగారు మేని చాయ వాడు. అంతేనా ఆయన ఒళ్లంతా బంగారమే. అందుకే ఈయన అత్యంత సంపన్నుడు. 80 కిలోల బంగారం, 450 కిలోల వెండితో మెరిసిపోయే స్వామి ఆభరణాలలో... నాలుగు చేతులు, భుజాలు, చెవులు, రెండు కాళ్లు, సింహాసనం, తిలకం, జంధ్యం, శంఖం తదితరాలు ఉంటాయి. ప్రభావళి (మకర్), మూషికం, వినాయకుని నైవేద్యం సమర్పించే సామాగ్రి వంటివన్నీ వెండితో రూపొందినవి. ఈ సారి వజ్రోత్సవాల కారణంగా ఏకదంతుడికి... మరో మూడు కిలోల బంగారం, అయిదు కిలోల వెండితో ప్రత్యేకమైన వైజయంతిమాల (హారం) రూపొందించారు. ఈ హారాన్ని కర్నాటకలోని ఉడిపి ప్రాంతంలోని స్వర్ణకారులు తయారుచేశారు. ఈ హారంతో పాటు కెంపులు, పచ్చలు పొదిగిన ఆభరణాలు వినాయకుని కోసం ప్రత్యేకంగా చేయించారు. కేవలం అయిదు రోజులు మాత్రమే కొలువుండే ఈ వినాయకుడిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కాపాడే స్వామికి కాపలా వినాయక చవితి వస్తోందంటే ఎక్కడ చూసినా నెల రోజుల ముందు నుంచే సంబరాలు ప్రారంభమవుతాయి... అయితే ప్రత్యేకంగా ముంబైలో దశాబ్దాలుగా వేలాది మండళ్లు ఇక్కడ వినాయకుడికి ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో దేశంలోనే అత్యంత సంపన్నమైనది... ముంబై కింగ్స్ సర్కిల్ ప్రాంతంలోని ‘గౌడ సారస్వత్ బ్రాహ్మణ్ (జిఎస్బి) సేవా మండలి’. అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మండలి వినాయకుడు అత్యంత శ్రీమంతుడు. గత కొన్ని సంవత్సరాలుగా గణేశ విగ్రహం ఎత్తును 12 అడుగులకు మించనీయకుండా జాగ్రత్తపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఈ మండలి. ‘‘ఈసారి వజ్రోత్సవాలు కావడంతో మా జిఎస్బి సేవా మండలి వినాయకుని ఉత్సవాలకు మరింత ప్రాముఖ్యత ఇస్తున్నాం’’ అంటున్నారు ఈ కమిటీ ట్రస్టీ సతీశ్ నాయక్. భక్తులను కంటికి రెప్పలా కాపాడే వినాయకుని ఆభరణాలను కాపాడటానికి ఆ భక్తులే శ్రద్ధ తీసుకుంటారు. శ్రీమంతుడికి బీమా... అత్యంత సంపన్నుడైన ఇక్కడి వినాయకుడికి ఈ మండలివారు 258.90 కోట్ల రూపాయలకు బీమా చేశారు. ఈ వినాయకుని ఉత్సవాల్లో ఒక్క రోజు కోసం సుమారు రూ.51.7 కోట్లు బీమా చేశారు. ఈ బీమా... ఉత్సవాలలో పాల్గొనే భక్తులు, అర్చకులు, సిబ్బందితో పాటు విగ్రహం, బంగారం, వెండి ఆభరణాలు... మొదలైన వాటి మీద చేయడం విశేషం. అగ్ని ప్రమాదం, ఉగ్రవాదుల దాడులు, అల్లర్లు ఇలా ఆరు రకాల విపత్తులకు ఈ బీమా వర్తిస్తుంది. వినాయక చవితిని పురస్కరించుకొని మొదటి రోజే ఈ బీమా ప్రారంభం అవుతోంది. ఈ విగ్రహానికి మొదటి రోజే బంగారు ఆభరణాలతో ముస్తాబు చేస్తారు. నిమజ్జనకు కొన్ని గంటల ముందు విగ్రహానికి అలంకరించిన బంగారు ఆభరణాలను తొలగించి వాటిని జాగ్రత్తగా బ్యాంక్ లాకర్లో భద్రపర్చే వరకు బీమా కొనసాగుతుంది. భద్రతకు పెద్ద పీట... వినాయకుడిని దర్శించుకోవడం కోసం అయిదు ద్వారాలు (గేట్లు) ఏర్పాటయ్యాయి. ముఖదర్శనం కోసం సుమారు ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన స్కై వాక్‌పై భక్తులు వినాయకుని ముఖదర్శనం చేసుకుని తరిస్తారు. - గుండారపు శ్రీనివాస్ ఫొటోలు: పిట్ల రాము, సాక్షి ముంబై