పాలీహౌస్ ఉత్పత్తులకు మార్కెటింగ్
తాడేపల్లిగూడెం రూరల్ : పాలీ హౌస్‌ల్లో పండించే ఉత్పత్తులకు సబ్సిడీతో పాటు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని ఏపీ హార్టీకల్చర్ గుంటూరు కమిషనరేట్ అధికారి శరవణ న్ అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో పాలీహౌస్, షెడ్ నెట్‌ల్లో సాగు చేసే క్యాప్సికమ్, టమోట, జర్బెరా, కార్మెషన్, గులాబీ, పూలు, కూరగాయల సాగు విధానంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాలీహౌస్, షెడ్ నిర్మాణం కోసం సంబంధిత ఉద్యాన అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. క్యాప్సికంకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ప్రకాశం జిల్లాకు చెందిన రైతు దండా వీరాంజనేయులు కోరారు. కోపర్ట్ బయోలాజికల్ ల్యాబ్ (బెంగళూరు) ప్రతినిధి కె.మహేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రకృతి యాజమాన్య పద్ధతుల ద్వారా సులభంగా చీడపీడలను నివారించవచ్చని చెప్పారు. రాజ్వా న్ హైబ్రీడ్ సీడ్స్ ప్రతినిధి ఎల్వీ ప్రసాద్, నెటాఫిమ్ డ్రిప్ కంపెనీ ప్రతినిధి ఏఎస్ సుబ్బారావు మాట్లాడారు. ఉద్యాన వర్సిటీ పరిశోధన సంచాలకుడు దిలీప్‌బాబు, విస్తరణ సంచాలకులు ఆర్వీఎస్కే రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ రామ్మోహ న్‌రావు, ఉద్యాన ఏడీ జి.విజయలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు, ఎంపీఈవోలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.