officers corruption
-
‘ఐడీ’ కావాలంటే.. చేయి తడపాల్సిందే!
సుభాష్‌నగర్: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకులను(వీఆర్ఏ) పలు శాఖల్లో సర్దుబాటు చేసినా.. వారికి ఎంప్లాయీ ఐడీలు ఇచ్చేందుకు ట్రెజరీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎంప్లాయీ ఐడీలు ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయంతెలిసిందే. వీరికి ఎంప్లాయీ ఐడీలు ట్రెజరీశాఖ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఐదునెలలుగా జీతాలు లేక ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న పూర్వ వీఆర్ఏల నుంచి వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఉద్యోగి నుంచి రూ. 2వేల వరకు డిమాండ్ చేసి తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. చేయి తడపకుంటే ఎంప్లాయీ ఐడీ ఇచ్చేందుకు కొర్రీలు పెడుతుండడంపై పూర్వ వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 1643 మంది వీఆర్ఏలు ఉన్నారు. అందులో 201 మందిని వేరే జిల్లాలకు బదిలీ చేశారు. మరో 420 మంది వారసత్వ ఉద్యోగాల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో వారు రెవెన్యూశాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా 1022 మందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. విద్యార్హత ఆధారంగా జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ ఇతర హోదాల్లో నియమించారు. వీరికి గతేడాది ఆగస్టు నుంచి గత ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. పలుమార్లు కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రినిసైతం విన్నవించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డి రెవెన్యూశాఖపై పలుమార్లు సమీక్ష నిర్వహించారు. ఎంప్లాయీ ఐడీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ. 20 లక్షల వరకు.. జిల్లాలోని వివిధశాఖల్లో సుమారు 1022 మంది పూర్వ వీఆర్ఏలు వివిధశాఖల్లో ఐదు నెలలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఎంప్లాయీ ఐడీలు తీసుకునేందుకు జిల్లా ఖజానాశాఖలో సంప్రదిస్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకున్న ఆ శాఖ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో ఎంప్లాయీ ఐడీ ఇచ్చేందుకు రూ. 2వేల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లెక్కన సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది రూ. 2వేల చొప్పున చెల్లించినట్లు తెలిసింది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పూర్వ వీఆర్ఏలు పూర్వ వీఆర్ఏలకు ఐదు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాలు, మండలాలకు బదిలీపై వెళ్లిన వారు అద్దెలు, ఇంటి ఖర్చులు, విద్య, వైద్యం కోసం అప్పులు చేశారు. ఈ క్రమంలో జిల్లా ఖజానాశాఖ ఉద్యోగులు ఎంప్లాయీ ఐడీ కోసం రూ. 2వేలు వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇంత మొత్తంలో డిమాండ్ చేస్తే.. నాలుగు నెలల సప్లిమెంటరీ జీతంతోపాటు ప్రస్తుత నెల జీతం తయారు చేసేందుకు ఇంకెంత అడుగుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దాదాపు రూ. 10వేల వరకు డిమాండ్ చేస్తారని కూడా చర్చ జరుగుతోంది. నా దృష్టికి రాలేదు పూర్వ వీఆర్ఏల నుంచి ఎంప్లాయీ ఐడీల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి రాలేదు. ఎవరైనా వసూలు చేసినట్లు ఫిర్యాదు చేస్తే సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఐడీ కోసం ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరంలేదు. – దశరథ్, డీడీ, ట్రెజరీశాఖ -
వాళ్లు చనిపోయారు..కానీ పింఛన్లు మాత్రం వస్తున్నాయి
ఎవరూ మనల్ని పట్టించుకోవడం లేదనుకున్నారో ఏమో... ఏం చేసినా ఎవరూ గుర్తించరు అనుకున్నారో ఏమో... చనిపోయినవారి పేరుమీద వచ్చిన పింఛన్లు కాజేసినా ఎవరికీ తెలియదనుకున్నారో ఏమో... ఓ ఇద్దరు ఉద్యోగులు అక్రమానికి తెరతీశారు. అథంటికేషన్‌ను తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఆరు నెలలుగా చనిపోయినవారి పేరున పింఛన్లు తీసేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారం వెలుగు చూడటంతో ఇప్పుడు వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. సాక్షి, బలిజిపేట(విజయనగరం) : బడుగులకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లను ఓ ఇద్దరు ఉద్యోగులు పక్కదారి పట్టించేశారు. చనిపోయినవారి పేర్లను జాబితా నుంచి తొలగించకుండా... ప్రతి నెలా వారి పేరు న తీసేసుకుంటున్నారు. ఆరు నెలలుగా ఈ అక్రమం సాగుతోంది. బలిజిపేట మండలం గలావల్లిలో వెలుగు చూసిన సంఘటన ఇది. గలావల్లి పంచాయతీ పరిధిలోని కడగల రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102371602), చందక సంగయ్య(పెన్షన్ ఐడీ 102394294), మజ్జి రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102137032), రాగోలు రామయ్య(పెన్షన్ ఐడీ 102796572), గేదెలపేటకు చెందిన కొంచాడ సుందరమ్మ(పెన్షన్ ఐడీ 102404322), చందక రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102820571) 6 నెలల క్రితమే మృతి చెందారు. వారిపేర్లు జాబితా నుంచి తొలగించకపోవడంతో పింఛన్లు మంజూరవుతున్నాయి. ఆ మొత్తాలను ఇద్దరు ఉద్యోగులు దర్జాగా స్వాహా చేసేస్తున్నారు. జూన్‌నెల పింఛన్ల పంపిణీ సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. రాగోలు రామయ్య డిసెంబర్లో పింఛ న్ తీసుకుని మృతి చెందినా ఆ పేరు తొలగించకపోవడంతో అతని పేరున పింఛన్ వచ్చేస్తోంది. అతని భార్య సుందరమ్మకు వితంతు పింఛన్ ఫిబ్రవరి నుంచి ఇస్తున్నారు. ఈ 6 నెలల వ్యవధిలో వ చ్చిన మొత్తాలు గ్రామ కార్యదర్శి మోహన్, రెండు నెలలుగా ఎంపీడీఓ కార్యాలయ టైపిస్ట్ నారాయణరావు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టైపిస్టే సూత్రధారి గలావల్లిలో మే, జూన్ నెలలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయ టైపిస్ట్ నారాయణరావు పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుంఇచ 10నుంచి 20రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో పింఛన్ల ఫైలును తనవద్దే ఉంచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పింఛన్లు ఆన్లైన్ చేసేటపుడు చేతివాటం చూపుతున్నారని కూడా కొందరు చెబుతున్నారు. గతంలోనూ పెద్దింపేటలో 6, పలగరలో ఒకటి, అంపావల్లిలో 2, వంతరాంలో 2, అరసాడలో ఒకటి ఆథంటికేషన్ పద్ధతిలో కార్యదర్శులు విత్‌డ్రా చేసిన విషయం విదితమే. ఈ విషయం సోషల్ ఆడిట్‌ద్వారా బయటపడింది. అథంటికేషన్ పేరుతో అక్రమాలు రెండేళ్లుగా బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛన్ల పంపిణీ చేపడుతున్నారు. లబ్ధిదారులు వేలిముద్రలు వేసి వారి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది. మంచంమీద ఉండేవారు, ఇతరత్రా రాలేనివారి వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ వేయించుకుని వారికి పింఛన్ పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పడక, ఐరిస్ అవక పింఛన్ పొందలేనివారికి పింఛన్లు పంపిణీ చేసేవారే అథంటికేషన్ వేసి మొత్తాలు అందజేస్తారు. ఈ విధంగా చేసేందుకు వారికి గ్రామపింఛన్ లబ్ధిదారుల మొత్తంలో 2శాతం వరకే అవకాశం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. మరణ ధ్రువీకరణ నమోదు కాకే... మరణ ధ్రువీకరణ పత్రాలు గ్రామ కార్యదర్శులే ఇస్తారు. మృతుడు ఎప్పుడు మృతిచెందాడో వారికి తెలుస్తుంది. వారికి సంబంధించిన సమాచారాన్ని 21రోజుల్లోగా కార్యదర్శి ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు చనిపోయిన వారి పేరున మొత్తాలు మంజూరయ్యే అవకాశం ఉండదు. అయితే కావాలనే ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ చేయకుండా తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. దీనిపై ఈఓపీఆర్డీ దేవకుమార్వద్ద సాక్షి ప్రస్తావించగా టైపిస్ట్ ఎక్కడ పింఛన్లు పంపిణీ చేసినా మృత్యువాత పడినవారి పేరున వచ్చే వాటికి ఆథంటికేషన్ వేసి విత్‌డ్రా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని తాము గుర్తించినట్టు తెలిపారు. అంతేగాకుండా పింఛన్లు పెట్టేందుకు కార్యాలయానికి వచ్చేవారి నుంచి వెయ్యి నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారనీ, పింఛన్లు పంపిణీ చేసే సమయంలోనూ లబ్ధిదారులనుంచి 10 నుంచి 20రూపాయలు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎంపీడీఓకు తెలియజేసినా ఆయన పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు గలావల్లిలో అక్రమాలకు పాల్పడినట్టు బట్టబయిలయిందని దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని వివరించారు. -
మంత్రుల జోక్యం నచ్చకే.. లీలా శాంసన్
న్యూఢిల్లీ: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కీలకపాత్ర పోషించిన వివాదాస్పద చిత్రం 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్'కి సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. సినిమా ధ్రువీకరణ అప్పీళ్ల ట్రిబ్యునల్, సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శాంసన్ ఈ క్లియరెన్స్ నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకి తెలిపినట్లు ఆమె చెప్పారు. సినిమాల సర్టిఫికేషన్ విషయాల్లో మంత్రుల జోక్యం చేసుకోవడం నచ్చని కారణంగా లీలా శాంసన్ తన పదవికి రాజీనామా చేశారు. 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్' శుక్రవారం రోజు విడుదల కావాల్సి ఉంది. కాగా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. బోర్డు విషయాల్లో మంత్రులు జోక్యం చేసుకోవడం హాస్యాస్పదంగా మారిందని లీలా అన్నారు. మంత్రిత్వశాఖ నియమించిన ప్యానెల్ సభ్యులు, అధికారుల అవినీతి, జోక్యం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. గత తొమ్మిది నెలలుగా మంత్రిత్వశాఖ మాకు నిధులు ఇవ్వకపోగా, బోర్డు సమావేశాలకు అనుమతివ్వలేదని లీలా చెప్పారు. తన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు.