officers no action
-
కొన్నది లేదు.. అమ్మిందీ లేదు..!
ఆదెమ్మదిబ్బ స్థలంలో భూ బకాసురుల లీల! రూ.100 కోట్ల స్థలం కబ్జా చేసినా పట్టించుకోని వైనం పత్రాలు చూపించకపోయినా అధికారుల ప్రేక్షకపాత్ర రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున రూ.100 కోట్ల స్థలం యథేచ్ఛగా ఆక్రమించారు భూ బకాసురులు. నగదు ఇచ్చి పేదల ఇళ్లు తొలగిస్తున్నారు. ఇదేమిటని అడిగిన అధికారులకు, నాయకులకు ‘నేను ఈ స్థలం కొన్నాను’ అని చెబుతున్నారు. ఎప్పుడు కొన్నారు? ఎంత స్థలం కొన్నారు? ఆ డాక్యుమెంట్లు చూపించాలని అధికారులు, వివిధ పార్టీల ద్వితియ శ్రేణి నేతలు అడిగితే.. ‘సాయంత్రం తెస్తాను.. రేపు తెచ్చి చూపిస్తా’నంటూ స్థలం కొనట్టు చెబుతున్న కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు చెబుతున్నారు. దాంతో అధికారులు, పార్టీల నేతలు వెళ్లిపోతున్నారు. 50 ఏళ్ల నుంచి ఉంటున్న పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని, స్థలం కొనుగోలు చేసి ఉంటే ఈ పక్కకు రాబోమని నేతలు అంటున్నారు. ఇదీ ఇప్పటి వరకు జరిగిన రూ.100 కోట్ల విలువైన ఆదెమ్మ దిబ్బ స్థలం వ్యవహారం. – సాక్షి, రాజమహేంద్రవరం డాక్యుమెంట్లు ఏవీ? నగరంలోని 36, 38 డివిజన్ల మధ్య ఉన్న ఆదెమ్మ దిబ్బ స్థలంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న 110 మంది పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఈ నెల 11వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. 13వ తేదీన అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోసయ్య తన సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గుడిసెలు తొలగింపజేస్తున్న కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడితో మాట్లాడారు. తాను 4 వేల గజాలు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని ఈశ్వరుడు తహసీల్దార్‌కు చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని తహసీల్దార్ కోరగా, ఈశ్వరుడు ఇక్కడ లేవని చెప్పారు. అయితే సాయంత్రం కార్యాలయానికి తీసుకువచ్చి చూపించాలని తహసీల్దార్ ఆదేశించారు. ఇందుకు సమ్మతించిన ఈశ్వరుడు ఆ రోజు సాయంత్రం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదు. సరే మరుసటి రోజు తెస్తారని ఎదురుచూసిన తహసీల్దార్‌కు సమయం వృథా అయ్యిందే తప్ప డాక్యుమెంట్లు రాలేదు. ఒకటి కాదు, రెండు కాదు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ స్థలం కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లు తహసీల్దార్‌కు చేరలేదు. యథేచ్ఛగా ఇళ్ల తొలగింపు డాక్యుమెంట్లు చూపిస్తానని చెప్పడంతో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు వెళ్లిపోయారు. డాక్యుమెంట్లు చూపించకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న పేదల గుడిసెలు, రేకుల షెడ్లను ఆక్రమణదారులు యథేచ్ఛగా తొలగిస్తున్నారు. పేదలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తున్నారు. ఖాళీ చేయబోమని చెబుతున్న వారి ఇళ్లను కూడా కలిపి చుట్టూ ముళ్ల కంచె వేశారు. రాకపోకలకు వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సొంత వాంబే ఇళ్లు ఉన్నవారు చెప్పిందే తడవుగా ఇచ్చింది తీసుకుని ఖాళీ చేశారు. ఇళ్లు లేని పేదలు వారు ఖాళీ చేశారు కదా, పెద్దలతో వివాదం ఎందుకని వెళ్లిపోయారు. ఇక అక్కడ 10 రేకుల షెడ్లు ఉన్నాయి. అవి పేద బ్రాహ్మణలకు చెందినవి. ఖాళీ చేయాలని వారికి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఓపక్క ఇళ్లు తొలగిస్తుండడంతో, 50 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని పేరు చెప్పడానికి భయపడుతున్న బ్రాహ్మణ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల నేతలకూ టోకరా.. ఎన్నో ఏళ్ల నుంచి ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారని తెలుసుకున్న సీపీఎం నేతలు ఈ నెల 13న, బీజేపీ అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, గరిమెళ్ల చిట్టిబాబు తదితరులు ఈ నెల 15న ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మురుసటి రోజు నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మసా రామజోగి, జిల్లా కార్యవర్గ సభ్యుడు లంక సత్యనారాయణ తదితరులు స్థలాన్ని పరిశీలించి, పేదలు, పిన్నమరెడ్డి ఈశ్వరుడితో మాట్లాడారు. అప్పుడు కూడా ఈశ్వరుడు తాను ఈ స్థలం కొన్నానంటూ వారికి చెప్పారు. ఆ డాక్యుమెంట్లు చూపించాలని అడగ్గా, అధికారులకు చెప్పినట్టే సాయంత్రం తెచ్చి చూపిస్తాననడంతో నేతలు వెనుదిరిగారు. అయితే ఇక్కడకు కూడా అధికారులతో పాటు నేతలకూడా స్థలం కొన్నాననంన్న వ్యక్తి టోకరా వేశారు. డాక్యుమెంట్లు చూపించకపోగా, నేతలు ఫో¯ŒS చేసినా తీయడం మానేశారు. ఐదు రోజులవుతున్నా ఈశ్వరుడు డాక్యుమెంట్లు చూపించకపోవడం గమనార్హం. ప్రశ్నలు అనేకం.. సమాధానాలు? స్థలం కొన్నానని చెబుతూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారు. డాక్యుమెంట్లు ఇప్పటి వరకూ చూపించకున్నా.. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఎందుకు మిన్నుకుండిపోయారు? ఆ స్థల యజమానులు ఎవరు? ఎన్నో ఏళ్లుగా పేదలుంటున్నా వారిని ఎందుకు ఖాళీ చేయించలేదు? ఇన్ని రోజులు అమ్మని స్థలాన్ని ఇప్పడెందుకు విక్రయించారు? అసలు ఎవరికి అమ్మారు? సర్వే నంబర్ ఎంత? ఎంత స్థలం కొన్నారు? ఏ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేష¯ŒS జరిగింది? సాక్షులు ఎవరు? పెద్దనోట్ల రద్దు, నగదు విత్‌డ్రాపై ఆంక్షలున్న సమయంలో అంత డబ్బు కొనుగోలుదారులకు ఎక్కడ నుంచి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం నగర ప్రజలను తొలిచేస్తున్నాయి. -
గట్లను మింగేస్తున్నారు!
గ్రావెల్ కోసం పోలవరం ఎడమ ప్రధాన కాలువకు తూట్లు పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జగ్గంపేట : జలయజ్ఞంలో భాగంగా తాగు, సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఇందిరా సాగర్ ప్రాజెక్టు(పోలవరం)కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో విశాఖ వరకు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు చురుగ్గా జరిగాయి. విశాలమైన కాలువ, గట్లు, శాయిల్ బ్యాంక్‌తో పోలవరం కాలువలు దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే జలయజ్ఞం ఫలం దక్కుతుంది. కాలువ నిర్మాణంలో వచ్చిన మట్టిని ఇతర అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో ఎవరికివారు తరలించుకుపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, కొందరు స్వార్థపరులు మాత్రం కాలువ గట్లకే తూట్లు పొడుస్తున్నారు. కాలువ గట్లలో గ్రావెల్‌ను పోలిన ఎర్రమట్టి ఉండడంతో.. దానిని రోడ్ల నిర్మాణానికి తరలించుకుపోతున్నారు. పొక్లెయిన్లతో కాలువ గట్లను గుల్ల చేస్తుండడంతో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక దెబ్బతిన్న కాలువల వద్ద గండ్లు పడే అపాయం పొంచి ఉంది. తమ స్వార్థం కోసం గట్లను తవ్వేసి మట్టి తరలించుకుపోతున్నవారు.. కనీసం వేరే మట్టితోనైనా దానిని పూడ్చడం లేదు. దీనిపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగ్గంపేట ప్రాంతంలో కాలువ గట్లకు కనీస రక్షణ లేకుండా పోయింది. -
పర్యవేక్షణా లేదూ..ముందు చూపూ లేదు
అమలుకాని వైద్య ప్రణాళికలు భర్తీ కాని పోస్టులు నిలిచిపోయిన దోమతెరల పంపిణీ ఇదీ ఏజెన్సీలో వైద్య సేవల పరిస్ధితి రంపచోడవరం : ఏజెన్సీలో మలేరియా, విషజ్వరాలతో గిరిజనులు ప్రాణాలు కోల్పోయినపుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హడావుడి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా సాధారణ పరిస్థితుల్లో గిరిజనులకు వైద్యసేవలు సక్రమంగా అందుతున్నదీ, లేనిదీ లోతుగా అధ్యయనం చేయడం లేదు. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించే అధికారులు ఏజెన్సీలో కానరావడం లేదు. ఏటా సీజనల్‌గా వచ్చే వ్యాధులపై సమగ్ర ప్రణాళిను కూడా అమలు చేయడం లేదు. ఫలితంగా మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటింటి పరిశీలన జరగడం లేదు ఏజెన్సీ 11 మండలాల్లో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు( పీహెచ్సీ) ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఆరు సబ్‌సెంటర్లు ఉంటాయి. ప్రతి సబ్ సెంటరుకు ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక పురుష ఆరోగ్య కార్యకర్తా ఉంటారు. వీరి పనిని పరిశీలించేందుకు మగ, ఆడ పర్యవేక్షకులు ఉండాలి. ఇంత పెద్ద వైద్య వ్యవస్థ ఉన్నప్పటికీ, మారుమూల గ్రామాల్లో ప్రబలుతున్న వ్యాధుల గురించి బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఏఎన్ఎంలు సబ్‌సెంటర్ పరిధిలోని గ్రామాల్లో ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య విషయాలు, రక్త నమూనాలు సేకరించాలి. వ్యాధులు ఎక్కువగా నమోదైతే పీహెచ్‌సీకి సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన పర్యవేక్షకులు స్థానికంగా నివాసం ఉండడం లేదు. దూర ప్రాంతాల్లో ఉంటూ విధులకు హాజరు కావడం వల్ల వారు పూర్తిస్థాయిలో గ్రామాలను సందర్శించడం లేదు. కేవలం అంగన్వాడీ కేంద్రాల సందర్శనకే పరిమితం అవుతున్నారు. ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్త ఉంటారు. ఆ గ్రామ బాధ్యత ఆశాలపై నెట్టివేస్తున్నారు. వారికి కనీసం గౌరవ వేతనం కూడా సక్రమంగా చెల్లించడం లేదు. వేధిస్తున్న వైద్యుల కొరత ఏజెన్సీ 11 మండలాల్లోని పీహెచ్‌సీల్లో 57 మంది వైద్యులు పనిచేయాలి. సుమారు 10 వరకు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక డాక్టర్‌కు రెండు పీహెచ్‌సీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఫలితంగా రోగులకు సక్రమంగా వైద్యసేవలు అందడం లేదు. వివిధ స్థాయిలో స్టాఫ్ నర్సులు, ఎంపీఎంఓలు, ఫార్మాసిస్టులు, ఎంపీహెచ్ఏ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. విలీన మండలాల్లో వివిధ పోస్టుల్లో 221 మంది సిబ్బంది పనిచేయాలి. వాటిలో 79 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీహెచ్‌సీలకు ఈ–ఔషదం ద్వారా ఆన్లైన్లో మందులు సరఫరా చేస్తున్నారు. అయితే ఏజెన్సీలోని చాలా పీహెచ్‌సీలకు నెట్ సదుపాయం లేదు. మందుల ఇండెంట్ పెట్టేందుకు ఫార్మాసిస్టులు లేరు. నెల్ సౌకర్యం ఉండి ఇండెంట్ పెట్టినా సెంట్రల్æడ్రగ్ స్టోర్ నుంచి రెండు నెలలకు గాని మందులు రావడం లేదు. మూడేళ్లుగా దోమతెరలు రాలేదు ఏజెన్సీలో మూడేళ్లుగా దోమతెరల పంపిణీ జరగడం లేదు. 2012లో లక్షా 60 వేల దోమతెరలు పంపిణీ చేశారు. తరువాత వాటి అవసరం ఉన్న సరఫరా మాత్రం జరగలేదు. 2014, 2015 సంవత్సరాల్లో దోమతెరల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేకపోయింది. దోమతెరల పంపిణీతో పాటు వాటి వినియోగంపై అవగాహన కలిగించడం కూడా ఎంతో అవసరం.ఈ ఏడాది దోమతెరల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటì æవరకూ రాలేదు. జిల్లా మలేరియా కార్యాలయం అధికారులు ఫ్యామిలీ, డబుల్, సింగిల్ సైజ్ అనే మూడు రకాల దోమతెరల కోసం ప్రతిపాదనలు పంపించారు. మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలతో పాటు ఏజెన్సీ అంతటా పంపిణీ చేసేందుకు 3 లక్షల 60 వేల దోమతెరలకు ప్రతిపాదనలు పంపించారు. ఏజెన్సీలో మలేరియా విభృజిస్తునప్పటికీ దోమతెరలు మాత్రం రాలేదు. మలేరియా సీజన్లోనే దోమతెరలను పంపిణీ చేయడం వల్ల ఫలితం ఉంటుంది.