official bungalows
-
మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన యూపీ సీఎం యోగి
లక్నో: అధికార పర్యటనల్లో హోటళ్లలో బస చేయకుండా ప్రభుత్వ గెస్ట్హౌసుల్లోనే ఉండాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తన మంత్రులను ఆదేశించారు. అదేవిధంగా బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దన్నారు. ప్రభుత్వ గెస్ట్హౌసుల్లోనే బసచేయాలన్న ఆదేశం మంత్రులకే కాకుండా ప్రభుత్వాధికారులకు కూడా వర్తిస్తుందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయాలని, లంచ్ బ్రేక్ 30 నిమిషాలకు మించకుండా చూడాలని ఆదేశించారు. ఆఫీసుకు లేటుగా వచ్చే ఉద్యోగులపై చర్యలుంటాయని సీఎం బుధవారం హెచ్చరించారు. ప్రతి ఆఫీసులో సిటిజెన్ చార్టర్ను ప్రదర్శించాలన్నారు. ప్రజలు చేసే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. చదవండి: (యూపీలో ఏం జరిగిందో చూశారుగా!: సీఎం యోగి) -
‘మాజీ సీఎంలకు అధికారిక బంగ్లాలు వద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్లో మాజీ సీఎంలు ఎవరికీ ప్రభుత్వ బంగ్లాలు కేటాయించరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పదవీకాలం ముగిసిన సీఎంలకూ అధికారిక బంగ్లాలను కేటాయిస్తూ గతంలో యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఎన్జీఓ లోక్ప్రహరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ నిర్ణయం వెల్లడించింది. సీఎంగా తమ పదవీకాలం ముగిసిన వారికీ అధికారిక బంగ్లాలను కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. మాజీ సీఎంలకూ ప్రభుత్వ వసతిని కొనసాగిస్తూ యూపీ ప్రభుత్వం చేపట్టిన సవరణను సుప్రీం కోర్టు కొట్టివేసింది. యూపీ సర్కార్ తీసుకువచ్చిన చట్ట సవరణ వివక్షతో కూడినదని, రాజ్యాంగం నిర్ధేశించిన సమానత్వ సూత్రానికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం యూపీలో మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, రాజ్నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, ఎన్డీ తివారీలు ప్రభుత్వ బంగ్లాలను తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. -
నితీశ్ పరువు తీస్తున్న మంత్రులు
పాట్నా: సాధారణంగా రాజకీయ పదవుల్లో ఉండే నాయకు ఆ దర్జాయే వేరు. మిగితా సామాన్య ప్రజలకు ఒక కలగా మాత్రమే మిగిలిపోయే ఆశలు, అవకాశాలు, అతిథి మర్యాదలు ఇట్టే వారికి అందుతాయి. అయినప్పటికీ కొంతమంది నాయకులకు మాత్రం అవి చాలదన్నట్లు పక్కదార్లు పడుతుంటారు. ఐదేళ్ల వరకు తమను ఎవరూ ఏం చేయలేరనే తీరుగా వ్యవహరిస్తుంటారు. బిహార్లో కొంతమంది మంత్రులు ఇప్పుడు అదే చేస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరువు తీస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ బంగళాలను డబ్బులకు కక్కుర్తిపడి అద్దెకు ఇస్తున్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే నిర్వహించాల్సిన ఆ భవనాల్లో ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతిస్తూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఓ టీవీ చానెల్ ఈ గుట్టును బయటపెట్టింది. పెళ్లిళ్ల కార్యక్రమాలతోపాటు తదితర కార్యక్రమాలు వాటిల్లో నిర్వహిస్తున్నారు. మైనారిటీ వ్యవహారల మంత్రి అబ్దుల్ గఫూర్ అనే ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ బంగళాను ఇప్పుడు ఓ వివాహ వేడుకకు అద్దెకు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ అన్ని టెంట్లు, కటౌట్లు వెలిశాయి. ఒక్క రోజు అద్దెగా రూ.2.5లక్షలతోపాటు ఇతర సౌకర్యాలు తగిన మొత్తం చెల్లిస్తే అందిస్తున్నారంట. బంగ్లా లోపల ఉండే ఎయిర్ కండిషన్ గదులు పెళ్లి కూతురు, పెళ్లి కొడుక్కి ఎక్కువ మొత్తానికి ఇస్తున్నట్లు ఆ బంగ్లాలకు కాపలా కాస్తున్న సెక్యూరిటీలు చెబుతున్నారు. వీరే పెళ్లిల్ల బ్రోకర్లు తీసుకొచ్చే సమాచారాన్ని సంబంధిత మంత్రులకు చేరవేసి అనుమతులు ఇప్పిస్తున్నారంట. అయితే, దీనిపై వివరణ ఇవ్వగా సదరు మంత్రి కస్సుమన్నాడు. పెళ్లి చేసుకునేందుకు చోటుదొరకక ఇబ్బంది పడుతున్న వారికి తాను బాధ్యతతో సహాయం చేస్తున్నానంటూ సమర్థించుకున్నారు. తాను ఉంటున్న బంగ్లా వెనుక చాలా ఖాళీ ప్రదేశం ఉందని, వృధాగానే ఉంటుంది కదా సహాయం చేసినట్లవుతుందని తాను అలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.