లక్నో: అధికార పర్యటనల్లో హోటళ్లలో బస చేయకుండా ప్రభుత్వ గెస్ట్‌హౌసుల్లోనే ఉండాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తన మంత్రులను ఆదేశించారు. అదేవిధంగా బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దన్నారు. ప్రభుత్వ గెస్ట్‌హౌసుల్లోనే బసచేయాలన్న ఆదేశం మంత్రులకే కాకుండా ప్రభుత్వాధికారులకు కూడా వర్తిస్తుందన్నారు.
అధికారులు ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయాలని, లంచ్ బ్రేక్ 30 నిమిషాలకు మించకుండా చూడాలని ఆదేశించారు. ఆఫీసుకు లేటుగా వచ్చే ఉద్యోగులపై చర్యలుంటాయని సీఎం బుధవారం హెచ్చరించారు. ప్రతి ఆఫీసులో సిటిజెన్ చార్టర్‌ను ప్రదర్శించాలన్నారు. ప్రజలు చేసే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment