officials honour
-
అధికార లాంఛనాలతో ‘చెన్నమనేని’ అంత్యక్రియలు
హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతాయి. ఈ మేరకు అధికారిక అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత కొంత కాలంగా అనార్యోగంతో బాధపడుతూ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వర్‌రావు ఇవాళ తెల్లవారుజామును తుది శ్వాస విడిచారు. -
అధికార లాంఛనాలతో 'నర్రా' అంత్యక్రియలు
హైదరాబాద్ : ప్రజా సేవకుడు, కమ్యూనిస్టు కురవృద్ధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. నర్రా రాఘవరెడ్డి (91) గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నర్రా రాఘవరెడ్డి 11 గంటల వరకు పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి అనంతరం నకిరేకల్ కేంద్రానికి తరలిస్తారు. అక్కడి నుంచి వట్టిమర్తి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారని . అంత్యక్రియలకు తమ్మినేని వీరభద్రం, రాఘవులుతోపాటు ఇతర రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు సంతాప దినాలను పాటించి గ్రామ గ్రామాన సంతాప సభలు నిర్వహిస్తామని తెలిపారు.