హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతాయి. ఈ మేరకు అధికారిక అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత కొంత కాలంగా అనార్యోగంతో బాధపడుతూ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వర్‌రావు ఇవాళ తెల్లవారుజామును తుది శ్వాస విడిచారు.
అధికార లాంఛనాలతో ‘చెన్నమనేని’ అంత్యక్రియలు
Published Mon, May 9 2016 8:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM
Advertisement
Advertisement