Offspring
-
కోవిడ్ కాలం.. అంకురం కోసం...
భర్త ప్రాణం తీసుకెళుతున్న యుముణ్ణి సంతాన వరం కోరి భర్తను కాపాడుకుని పురాణాల్లో నిలిచింది సావిత్రి. ఇప్పుడు వడోదరాలో ఇద్దరు స్త్రీలు ఈ కారణం చేతనే అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. కోవిడ్ వల్ల భర్త మరణించగా ముందే నిల్వ చేసిన అతని వీర్యంతో ఒక భార్య తల్లి కావాలనుకుంటూ ఉంటే కోవిడ్ వల్ల చావు అంచుల్లో ఉన్న భర్త వీర్యాన్ని హైకోర్టుకు వెళ్లి మరీ సేకరించి తల్లి కావాలని నిర్ణయించుకుంది మరో భార్య. మాతృత్వ భావన, సహచరుడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమ ఈ స్త్రీలను నేటి సావిత్రులుగా మార్చింది. వివాహం అయ్యాక భార్యాభర్తలు ఎన్ని ఊసులాడుకుంటారో ఎవరికి తెలుసు? పుట్టబోయే సంతానం గురించి ఎన్ని కలలు కంటారో ఎవరికి తెలుసు? పరస్పరం ఎంత అనురాగం పంచుకుంటారో ఎవరికి తెలుసు? వైవాహిక జీవితం సంతానం కలగడంతో ఫలవంతం అవుతుంది. మనిషి తన కొనసాగింపును సంతానం తో ఆశిస్తాడు. తన ఉనికి సంతానం ద్వారా వదిలిపెడతాడు. ఆ సంతానం కలిగే లోపే ఆ ఉనికి మరుగున పడిపోయే పరిస్థితి వస్తే? అతని సంతానం కావాలి మూడు రోజుల క్రితం గుజరాత్ హైకోర్టుకు అత్యవసర ప్రాతిపదికన ఒక మహిళ అప్పీలు చేసుకుంది. ‘నేను సంతానవతిని కాదల్చుకున్నాను. అందుకు నా భర్త నుంచి వీర్యం తీసి సంరక్షించుకునేందుకు అనుమతినివ్వండి’ అని. మంగళవారం (జూలై 20) కోర్టుకు వెళితే ఆ సాయంత్రానికే కోర్టు అనుమతినిస్తే అదే రోజు రాత్రి ఆమె భర్త నుంచి వీర్యాన్ని సేకరించి భద్ర పరిచారు డాక్టర్లు. వడోదరాలోని స్టెర్లింగ్ హాస్పిటల్లో ఈ ఉదంతం జరిగింది. ‘పేషెంట్‌కు కోవిడ్ వల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగింది. అతను ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నాడు. ప్రాణాలు దక్కే ఆశలు అతి స్వల్పం. అందుకే అతని భార్య అతని వీర్యం ద్వారానే కృత్రిమ పద్ధతిలో భవిష్యత్తులో సంతానవతి అయ్యే విధంగా వీర్యాన్ని సేకరించమని మమ్మల్ని కోరింది. భర్త కుటుంబం అందుకు అంగీకరించింది. అయితే అలా వీర్యాన్ని సేకరించాలంటే ఆ పురుషుడి అనుమతి ఉండాలి. అనుమతి ఇచ్చే స్థితిలో అతను లేడు. అందుకే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోమన్నాం. ఆమె కోర్టు నుంచి అనుమతి తీసుకురావడంతో వెంటనే వీర్యాన్ని సేకరించాం. అలా వీర్యాన్ని సేకరించే ప్రొసీజర్‌కు అరగంట సమయం పట్టింది’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మాతృత్వపు హక్కు ప్రతి స్త్రీకి ఉంటుంది. సహజంగా వీలు లేకపోతే కృత్రిమ పద్ధతి ద్వారా, సరొగసి ద్వారా ఆమె తల్లి కావచ్చు. కాని ఈ కోవిడ్ కాలంలో అన్నీ హటాత్తుగా జరిగిపోతున్నాయి. ఎన్నో ఆశలు, కలలు కన్న జీవన భాగస్వాములు రోజుల వ్యవధిలో అదృశ్యమవుతున్నారు. సంతాన కల నెరవేరక ముందే వారు మరణించే పరిస్థితి ఎన్నో కుటుంబాల్లో ఈ కోవిడ్ కాలంలో జరిగినా ఈ మహిళ మాత్రం భర్త ద్వారానే సంతానాన్ని కనడానికి ఈ విధం గా నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది. ఆమెను అర్థం చేయించే ప్రయత్నం చేస్తోంది. హైకోర్టు ఆమె నిర్ణయానికి మద్దతుగా ‘కృత్రిమ పద్ధతిలో ఆమె తల్లి అయ్యే విషయం లో మీ అభిప్రాయం ఏమిట’ని ప్రభుత్వాన్ని, ఆస్పత్రి వర్గాలని కూడా సమాధానం కోరుతూ నోటీసులు ఇచ్చింది. భర్త చనిపోయాక తల్లి కావాలని... అయితే ఇదే వడోదరాలో రెండు నెలలుగా మరో మహిళ కూడా ఇదే కారణంతో వార్తల్లో ఉంది. ఆమె పేరు హెలీ ఏర్కే. వయసు 36. వడోదరాలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఆమె భర్త సంజయ్ టీచర్‌గా పని చేసేవాడు. ఏప్రిల్ మొదటి వారంలో అతడు కోవిడ్ వల్ల మరణించాడు. ‘నా భర్త ఎంతో మంచివాడు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనాలని నాకు చెప్పేవాడు. నేనంటే ఎంతో ప్రేమ. నాకు 30 ఏళ్లకు పెళ్లయ్యింది. ఆయన నా కంటే పెద్ద. పెళ్లి సమయంలోనే మేము లేటు వయసు వల్ల గర్భధారణకు ఇబ్బంది వస్తుందా అని సందేహించాం. రెండు మూడు ఆస్పత్రులకు తిరిగి చివరకు ఒక ఆస్పత్రి లో మా ‘ఎంబ్రియో’ (అండం, వీర్యాల ఫలదీకరణం. దీనిని గర్భంలో ప్రవేశపెట్టాక పిండం అవుతుంది)లు ఐదారు సంరక్షించుకున్నాం. నా భర్త జీవించి ఉండగా ఒక ఎంబ్రియోతో గర్భం దాల్చడానికి ప్రయత్నించాను. నిలువలేదు. ఇప్పుడు నా భర్త లేడు. కాని అతని వారసుణ్ణి కనాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నా కుటుంబం సమాజం ఇందుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని హెలీ అంది. సంతానం కలిగితే ఆ సంతానంలో భర్తను చూసుకోవాలని ఆమె తపన. ‘నా గర్భాశయం గర్భం మోయడానికి అనువుగా లేదని డాక్టర్లు తేల్చేశారు. మా ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును నేను తల్లి కావడానికి వెచ్చిస్తాను. సరొగసీ ద్వారా నేను నా భర్త అంకురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నిస్తాను’ అని హెలీ అంది. కోవిడ్ ఎందరికో మరణశాసనాలు రాస్తోంది. కాని మనుషులు జీవించే ఆశను పునరుజ్జీవింప చేసే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఒక మనిషి మరణించినా అతడి సంతానం జన్మనెత్తే వినూత్న సమయాలను ఇప్పుడు మనిషి సృష్టిస్తున్నాడు. క్రిమి మరణిస్తుంది. మనిషి తప్పక జయిస్తాడు. హెలీ ఏర్కె, సంజయ్ -
నిజాం కుటుంబంలో తీవ్ర విషాదం
సాక్షి, హైదరాబాద్ : నిజాం కుటుబంలో విషాదం నెలకొంది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్న కుమార్తె బషీరున్నిసా బేగం(93) మంగళవారం కన్నుమూశారు. వయసు సైబడిన కారణంగా గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ సంతానంలో ఈమె చివరిది. అంతేకాకుండా నిజాం నవాబు సంతానంలో ఇప్పటివరకు బతికి ఉన్నది కూడా ఆమె ఒక్కరే. నవాబ్ కాజీమ్ యార్ జంగ్‌ను వివాహం చేసుకోగా ఆయన 1998లో కన్నుమూశారు. ప్రస్తుతం బషీరున్నిసా బేగం పురాణీ హవేలీలో నివసముంటున్నారు. బషీరున్నిసా బేగం మరణం పట్ల నిజం కుటుంబానికి చెందిన పలువురు కుటుంబసభ్యులు సంతాపం తెలియజేయడానికి ఆమె నివాసాన్ని సందర్శిస్తున్నారు. పలువురు ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. కాగా ఆమె అంత్యక్రియలు ‘జోహార్’ ప్రార్థనల అనంతరం పాతబస్తీలోని దర్గా యాహియా పాషా స్మశాన వాటికలో జరుగుతాయని బంధువులు తెలిపారు. -
సంతానం కలగలేదని వ్యక్తి ఆత్మహత్య
ఆదిలాబాద్ ,కుభీర్(ముథోల్) : మండలంలోని పల్సి గ్రామానికి చెందిన తోట రాములు (37) సంతానం కలగడం లేదని మనస్తాపంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై కె.రమేశ్ తెలిపిన వివరాలు.. రాములుకు 15ఏళ్ల క్రితం సరస్వతితో వివాహమైంది. వీరికి సంతానం కలగలేదు. మంగళవారం సరస్వతి తన పుట్టింటికి వెళ్లింది. కొంతకాలంగా సంతానం లేదని మధనపడుతున్న రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సంతానం కోసం మందులు ఇస్తానని మోసం
♦ రూ.5500లతో ఉడాయించిన గుర్తుతెలియని వ్యక్తి మంచిర్యాల: సంతానం లేనివారికి సంతానం కలిగేవిధంగా మందులు ఇస్తానని నమ్మబలికి ఓ గుర్తుతెలియని వ్యక్తి రూ.5500 వసూలు చేసుకొని ఉడాయించిన సంఘటన మంచిర్యాల్లో చోటుచేసుకోంది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఏసీసీ గొల్లవాడకు చెందిన ఈర్ల శ్రీను, సృజన దంపతులకు పిల్లలు లేరు. వారి ఇంటికి మంగళవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆయుర్వేద వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. వారికి పిల్లలు లేరనే విషయాన్ని స్థానిక అంగన్వాడీ సూపర్వైజర్ చెప్పారని, ఆమె సూచన మేరకు మందులు ఇచ్చేందుకు వచ్చానని నమ్మబలికాడు. తాను ఇచ్చే ఆయుర్వేద మందులు వాడితే సంతానం కలుగుతుందని, ఇందుకు రూ.5500 ఖర్చవుతుందని చెప్పాడు. అతడి మాటలు నమ్మి డబ్బులు ఇవ్వడంతో శ్రీనుకు ఏదో మందు తాగించి, సృజనకు ఇంజక్షన్ ఇచ్చాడు. తాను వారం రోజులకు మళ్లీ వస్తానంటూ ఓ సెల్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు. తర్వాత అనుమానం వచ్చిన శ్రీను అంగన్వాడీ సూపర్వైజర్ను సంప్రదించగా.. తాను ఎవరినీ పంపలేదని పేర్కొన్నారు. దీంతో తాము మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నారు. -
ఇన్ఫెర్టిలిటీ సమస్యకు పరిష్కారం ఉందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. వివాహమై నాలుగేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? - ఈశ్వరి, అమలాపురం ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు: జన్యుసంబంధిత లోపాలు థైరాయిడ్ సమస్యలు అండాశయంలో లోపాలు; నీటిబుడగలు గర్భాశయంలో సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు డయాబెటిస్ గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు: హార్మోన్ సమస్యలు థైరాయిడ్ పొగతాగడం శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం. సంతానలేమిలో రకాలు: ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ.ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా: తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని క్రమంగా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ సమస్యను పూర్తిగా నివారిస్తారు. సయాటికా అంటే...? ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 27 ఏళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఏడాదిగా నడుము నొప్పితో బాధపడుతున్నాను. ఇటీవల ఒక్కసారిగా నా కుడికాలి తొడలో నరం పట్టేసింది. దాంతో నేను భరించలేనంత బాధతో విలవిలలాడిపోయాను. సాయంత్రం డాక్టర్ని కలిశాను. ఆయన పరిశీలించి నేను ‘సయాటికా’ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పారు. సయాటికా అంటే ఏమిటి? దయచేసి దీనికి శాశ్వత పరిష్కారాన్ని తెలియజేయండి. - శ్వేత, కూకట్పల్లి సయాటికా అనేది ఒక నరం. మన వెన్నుపూస చివరి నుంచి అరికాలి వరకు ఉంటుంది. శరీరంలో ఇదే అతి పెద్ద నరమని చెప్పవచ్చు. ఎక్కువగా బరువులు మోసేవాళ్లు, అదేపనిగా కూర్చొనిగానీ, నిల్చొని గాని ఉండేవారిలో ఇది సయాటికా వ్యాధి కనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నవాళ్లలోనూ ఇది ఎక్కువ. అలాగే ప్రమాదవశాత్తు ఎత్తుపై నుంచి పడినప్పుడు లేదా రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పుడు కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. పడుకునే సమయంలోగానీ, గంటల తరబడి కూర్చొని ఒకేసారి లేచే సమయంలో కాలి తొడ భాగాన నరం పట్టేస్తుంది. అప్పటివరకు ఈ వ్యాధి బారిన పడినట్లు మనకు తెలియదు. మీ విషయంలోనూ అదే జరిగింది. ఇది మొదట్లో సాధారణ నడుం నొప్పిగా అనిపిస్తుంది. చాలామంది కొన్ని పెయిన్‌కిల్లర్స్ వాడి దాని నుంచి ఉపశమనం పొందుతారు. ఈ తర్వాత అదే నొప్పి పిరుదుల మీదుగా తొడ భాగం నుంచి మోకాలి వరకు వ్యాపిస్తుంది. అలాగే నిర్లక్ష్యం చేస్తే అరికాలి వరకు పాకి సమస్యను జటిలం చేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారనేది తెలుసుకొని చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకు మీరు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ విషయాన్ని వైద్యుడికి తెలపండి. అలాగే మీరు ఎంతకాలం నుంచి నొప్పితో బాధపడుతున్నారో కూడా వివరించండి. వైద్యలు మీకు కొన్ని పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్సను అందిస్తారు. సాధారణంగా కొన్ని మందులతో పాటు ఫిజియోథెరపీ లాంటి ప్రక్రియతో ఈ నొప్పిని అదుపులో ఉంచవచ్చు. వాటితోనే చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ జాయింట్స్, డిస్క్‌లలో ఏమైనా గ్యాప్‌ల లాంటివి ఏర్పడినట్లు ఎక్స్-రేలో తేలితే చిన్నపాటి సర్జరీతో వాటిని సరిచేసి మీకు ఉన్న సమస్యను వీలైనంతవరకు తగ్గించవచ్చు. మీరు హైహీల్స్ ధరించకూడదు. అధికబరువులు ఎత్తకూడదు. ఒక్కసారిగా పక్కకు తిరగడం, లేవడం, కూర్చోవడం లాంటివి చేయకూడదు. పడుకునేటప్పుడు మీ మోకాలి దగ్గర దిండు ఉండేలా చేసుకోండి. ఆందోళన అవసరం లేదు. డా.సునీల్ దాచేపల్లి సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ అది బట్టల వల్ల వస్తున్న అలర్జీ! నాకు ఒంటి మీద బట్టలు తొడిగి ఉన్న చోట ఎర్రటి ర్యాష్ కనిపిస్తోంది. అక్కడ దురదగా ఉంటోంది. ఇక దుస్తులు కవర్ కాని చోట అంటే ముఖం, మెడ మీద ర్యాష్లేదు. ఇక అండర్ గార్మెంట్స్ కవర్ అయ్యే చోట ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - ఒక సోదరి, మహబూబాబాద్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ‘టెక్స్టైల్స్ డర్మటైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. కాంటాక్ట్ డర్మటైటిస్లలో ఇది ఒక రకం. ఈ తరహా డర్మటైటిస్లో ఒంటితో కాంటాక్ట్‌లో ఉన్న చర్మంపై అలర్జీ వస్తోంది. మీరు దుస్తులు ఉతికే సమయంలో వాటిని సరిగా పిండకపోవడం వల్ల, అక్కడ ఉన్న డిటర్జెంట్ మీ ఒంటిపై కలిగించే అలర్జీతో ఈ సమస్య వస్తుంటుంది. మీరు ఇకపై దుస్తులు ఉతికే సమయంలో డిటర్జెంట్ వదిలిపోయేలా వాటిని పూర్తిగా పిండివేయండి. ఒకవేళ అలాగే వదిలేస్తుండటం వల్ల అదేపనిగా దురద రావచ్చు. అదే కొనసాగుతూ ఉంటే బట్టలు మీ ఒంటికి ఆనుకునే చోట అది ఎగ్జిమాకు దారితీయవచ్చు. ఇక మీ లోదుస్తులు ఒంటికి ఆనేచోట బట్టలతో చర్మానికి కాంటాక్ట్ మరింత ఎక్కువ కాబట్టి అక్కడ ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స ఇలా: మీరు నోటి ద్వారా మాంటెలుకాస్ట్ కలిగి ఉన్న టెక్సో ఫెనాడిన్ హైడ్రోక్లోరైడ్ మందులను ప్రతిరోజూ ఉదయం, రాత్రి చొప్పున రెండు వారాల పాటు వాడాలి స్నానం చేసే సమయంలో ఆలోవీరా షవర్జెల్ను వాడాలి వైట్ సాఫ్ట్ పారఫిన్ మాయిశ్చరైజర్‌ను ప్రతిరోజూ ఉదయం, రాత్రివేళల్లో ఒంటిపై రాసుకోవాలి ఈ మాయిశ్చరైజర్పైన మొమాటజోన్ ఫురోయేట్, ఫ్యుసిడిక్ అసిడ్ అనే క్రీమ్‌ను రోజూ ఉదయం, రాత్రివేళల్లో రాయాలి. ఇది రెండు వారాల పాటు వాడాలి మీ బట్టలు శుభ్రంగా ఉతికేసుకోవడం అన్నిటికంటే ప్రధానం. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
పెళ్లై ఐదేళ్లయినా ఇంకా సంతానం లేదు తగిన సలహా ఇవ్వండి!
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 23. నాకు పెళ్లయి ఐదేళ్లు అవుతోంది. ఇంకా సంతానం కలగలేదు. మాకు సంతానం పొందే అవకాశం ఉందా? సంతానం కలగడానికి ఉన్న వివిధ మార్గాలు చెప్పండి. - ఒక సోదరి, హైదరాబాద్ ఇప్పుడు సంతానం పొందడానికి చాలా రకాల చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అయితే లోపం ఎవరిలో ఉందో తెలుసుకోడానికి చేయించాల్సిన వివిధ పరీక్షలు చేయించారో లేదో రాయలేదు. లోపం ఎలాంటిదైనా, ఎవరిలో ఉన్నా దాన్ని అధిగమించడానికి ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రంలో అనేక మార్గాలున్నాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వంటి చాలా చిన్న చిన్న సమస్యలు కూడా సంతానలేమికి కారణం కావచ్చు. ఇక తీవ్రమైన సమస్యలూ, ఆటంకాలూ, అవరోధాలూ ఉన్నా సంతానలేమి ఈ రోజుల్లో ఒక సమస్య కాదు. వాటికోసమూ తగిన చికిత్స ప్రక్రియలు ఉన్నాయి. మహిళల్లో అండం ఉత్పత్తి మొదటి సమస్య. ఏదైనా కారణాల వల్ల అండం సరిగా ఉత్పత్తి కానివారికి అండోత్పత్తికి తగిన చికిత్సలు ఉన్నాయి. అండం వరకు శుక్రకణాలును తీసుకెళ్లే ఫెలోపియన్ ట్యూబ్స్‌లో ఏవైనా అడ్డంకులు ఉన్నా, నీటి తిత్తులు (ఒవేరియన్ సిస్ట్స్) ఉన్నా వాటిని తొలగించడానికీ శస్త్రచికిత్సలున్నాయి. ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలకూ, గర్భాశయంలో అదనపు కండ పెరగడం (పాలిప్స్) ఉన్నా ఇవి మహిళల్లో గర్భధారణకు అడ్డంకులవుతాయి. ఇక పురుషుల్లో సివియర్ గ్రేడ్ వేరికోస్ వెయిన్స్, బ్లాక్స్ వంటి సమస్య కూడా గర్భధారణకు అవరోధమే. ఈ సమస్యలన్నింటినీ తగిన శస్త్రచికిత్సల ద్వారా సరిదిద్ది, గర్భధారణకు ఎలాంటి అవరోధమూ లేకుండా చేయవచ్చు. ఒకవేళ కొందరిలో ఎలాంటి అవరోధమూ, ఆటంకాలూ లేకపోయినా సరే... ఏవో తెలియని కారణాల వల్ల గర్భధారణ జరగకపోవచ్చు. అలాంటివారిలోనూ అనేక ఆధునిక ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ), ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్), ఐసీఎస్ఐ (ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్... వంటి అనేక ప్రక్రియల ద్వారా గర్భధారణ జరిగేలా చూడవచ్చు. గర్భధారణ జరగడానికి ఈ కింది అంశాలు అవరోధమవుతాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంతవరకు నివారించండి. వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణ రిస్క్ అవుతుంది. కాబట్టి త్వరగా చేసుకోండి. ఇటీవల కొందరు మహిళలు తమ కెరియర్ కోసం గర్భధారణను వాయిదా వేసుకుంటున్నారు. కెరియర్‌నూ, గర్భధారణనూ సరిగా ప్లాన్ చేసుకోండి. స్థూలకాయంతో ఉండటం గర్భధారణకు కొంత అవరోధం. మీ బరువును తగ్గించుకోండి. ఉండాల్సిన బరువు మాత్రమే ఉండేలా చూసుకోండి. ఒత్తిడిని పూర్తిగా నివారించుకోండి. ఒత్తిడి గర్భధారణకు అడ్డుపడటమే కాకుండా, ఒక్కోసారి గర్భస్రావానికీ దారి తీయవచ్చు. అందుకే ఒత్తిడి నుంచి పూర్తిగా దూరంగా ఉండండి. మీకు పెళ్లయి ఐదేళ్లు నిండాయంటున్నారు కాబట్టి సంతానసాఫల్యం కోసం డాక్టర్‌ను కలిసి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
తల్లికి ‘మహమ్మారి’ సోకిందని..
బాబును బావిలోపడేసిన అమ్మమ్మ, పెద్దమ్మ గండేడ్: తల్లికి ప్రాణాంతకమైన వ్యాధి సోకిందనే అనుమానంతో ఓ పసికందును అయినవారే చం పేందుకు యత్నించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గండేడ్ మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండలం దాదాపూర్ వాసి వడ్డె అంజిలమ్మకు సంతానం లేకపోవడం తో తన చెల్లెలి ఇద్దరు కూతుళ్లను పెంచుకుంది. వారిలో చిన్న కూతురుకు కుల్కచర్ల మండలం కల్మన్‌కల్వ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకుంది. వీరంతా నగరంలోని బోరబండకు వలస వెళ్లారు. ఇటీవల ఆ యువకుడు భార్య ను వదిలేసి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. గర్భం తో ఉన్న ఆమె నాలుగు రోజుల క్రితం నగరంలోని ఓ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. తల్లికి ప్రాణాంతకవ్యాధి ఉండడంతో బిడ్డకు పాలు ఇవ్వలేదు. దీంతో కుటుంబీకులంతా చర్చించుకొని పసికందును చంపేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మమ్మ అంజిలమ్మ, పెద్దమ్మ రత్నమ్మలు బాబుని తీసుకొని మంగళవారం గండేడ్ మండలం రంగారెడ్డిపల్లి శివారులో ఓ నీళ్లులేని బావిలో పడేసి వెళ్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. శిశువును ఐసీడీఎస్ అధికారి దివ్య సహాయంతో 108 వాహనంలోఆసుపత్రికి తరలించారు.