oil shares
-
గ్లోబల్ ఆయిల్ సెగ: ఆయిల్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: గ్లోబల్‌గా చమురు ధరలు పడిపోవడంతో దేశీయమార్కెట్లో ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఫెడ్ రేటు వడ్డీ రేటు భారీ పెంపు, గ్లోబల్‌గా ఇంధన డిమాండ్ తగ్గిపోవచ్చన్న భయాలతో శుక్రవారం ముడి చమురు నాలుగు వారాల కనిష్ట స్థాయికి 7 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి కనొసాగుతోంది. బ్యారెల్‌కు 125 డాలర్ల ఇటీవలి గరిష్ట స్థాయి నుండి 11 డాలర్లు తక్కువ. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు శుక్రవారం 5 శాతానికి పైగా క్షీణించాయి. ముదురుతున్న ప్రపంచ మాంద్యం భయాలతో గతకొన్ని సెషన్లలో దాదాపు 10 శాతం పడిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఆయిల్ ఇండియా ఏకంగా 12శాతం, ఓఎన్జీసీ 7 శాతం కుప్పకూలాయి. మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ దాదాపు 19 శాతం, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ 18 శాతంపైగా క్షీణించింది. ఇంకా గోవా కార్బన్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ 6 - 8 శాతం వరకు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు 77.98 వద్ద బలంగా ప్రారంభమైంది. ప్రస్తుతం నష్టాల్లోకి జారుకుంది. మునుపటి సెషన్లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పురోగమించి 78.05 వద్ద స్థిరపడింది. అయితే, విదేశీ నిధుల తరలింపు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఊగిసలాట ధోరణి, డాలరు బలం కారణంగా లాభాలు పరిమితమవుతున్నట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. మరోవైపు ఆరు కరెన్సీల బాస్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.30 శాతం పడిపోయి 104.38కి చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.26 శాతం పడిపోయి 112.83డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్లో నికర విక్రయదారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం రూ. 7,818.61 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ లాభాలును కోల్పోయాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభాలకు పరిమితమయ్యాయి. -
మార్కెట్లకు బ్లాక్ ‘వీక్’
⇒ఈ వారం 1100 పాయింట్లు హుష్ ⇒మూడేళ్లలో ఇదే అత్యధిక నష్టం ⇒తాజాగా 251 పాయింట్లు పతనం ⇒27,351 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈ వారం స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ‘వీక్’గా నిలిచింది. మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ తాజాగా 251 పాయింట్లు పతనంకావడంతో వారం మొత్తంగా 1,107 పాయింట్లు(దాదాపు 4%) కోల్పోయింది. గత మూడేళ్ల కాలంలో ఇదే అత్యధిక నష్టంకాగా, ఇంతక్రితం 2011 డిసెంబర్లో మాత్రమే ఈ స్థాయిలో నష్టపోయింది. వెరసి సెన్సెక్స్ 27,351 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 69 పాయింట్లు క్షీణించి 8,224 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోగా, ప్రధానంగా ఆయిల్ గ్యాస్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్ రంగాలు 2.5-1.5% మధ్య వెనకడుగు వేశాయి. అక్టోబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకే ప్రాధన్యమివ్వడం గమనార్హం. అమెరికా వడ్డీ పెంపు భయాలు అంచనాలకంటే ముందుగానే అమెరికా వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చునన్న భయాలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు ఉసిగొల్పుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు ముడిచమరు ధరల పతనానికి కారణమైన అంచనాలు సైతం ఆందోళనలు పెంచుతున్నట్లు తెలిపారు. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం 1.5% స్థాయిలో నీరసించాయి. ఆయిల్ షేర్లు డీలా సెన్సెక్స్‌లో ఆయిల్ దిగ్గజాలు గెయిల్, ఓఎన్జీసీ, రిలయన్స్ 4.5-2.5% మధ్య పతనంకాగా, మెటల్ షేర్లు టాటా స్టీల్, సెసాస్టెరిలైట్ 4-3% మధ్య క్షీణించాయి. ఈ బాటలో భెల్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ సైతం 3-2% మధ్య తిరోగమించాయి. అయితే మరోపక్క మారుతీ, భారతీ, ఇన్ఫోసిస్ 1% స్థాయిలో బలపడ్డాయి. -
రికార్డు స్థాయిలో సెన్సెక్స్, నిప్టీ
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 28వేల స్థాయిని అధిగమిస్తే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 8,400 మార్క్ పాయింట్లను దాటింది. రికార్డ్ స్థాయిలో స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 28,260.66 వద్దకు, నిఫ్టీ 8,447.40 వద్దకు చేరింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఇక రూపాయి కూడా 8 పైసలు నష్టపోయింది. ప్రస్తుతం డాలర్ విలువ 61.81గా ఉంది. -
ఆయిల్ షేర్లు డీలా
మూడు రోజుల వరుస లాభాల తరువాత గురువారం స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు క్షీణించి 27,941 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 25 పాయింట్ల నష్టంతో 8,358 వద్ద నిలిచింది. ముందురోజు సెన్సెక్స్ 28,126 పాయింట్ల వద్ద చరిత్రాత్మక గరిష్ట స్థాయిని చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారని విశ్లేషకులు తెలిపారు. అయితే పారిశ్రామికోత్పత్తి మూడు నెలల గరిష్టానికి చేరడం, రిటైల్ ద్రవ్యోల్బణం 5.5%కు దిగడం వంటి సానుకూల అంశాల కారణంగా తొలుత సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడి 28,099 వద్ద గరిష్టానికి చేరింది. ఎక్సైజ్ సుంకం పెంపు ఎఫెక్ట్ బీఎస్ఈలో ప్రధానంగా ఆయిల్, రియల్టీ రంగాలు 1.5% చొప్పున నీరసించాయి. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను పెంచడంతో చమురు ఉత్పత్తి, మార్కెటింగ్ కంపెనీల షేర్లు అమ్మకాలతో డీలాపడ్డాయ్. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, కెయిర్న్, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ 6-2% మధ్య పతనమయ్యాయి. ఇక రియల్టీ షేర్లు యూనిటెక్, హెచ్‌డీఐఎల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్, మహీంద్రా లైఫ్, అనంత్‌రాజ్ 5.5-2% మధ్య తిరోగమించాయి. ఇక యూపీ ప్రభుత్వం చెరకు మద్దతు ధరను పెంచకపోవడంతో చక్కెర షేర్లు అప్పర్ గేంజెస్, బలరామ్‌పూర్, బజాజ్ హిందుస్తాన్, ఓధ్, ధంపూర్ షుగర్ 12-4% మధ్య దూసుకెళ్లాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో సెసాస్టెరిలైట్, టాటా పవర్, యాక్సిస్ 2.5-1.5% మధ్య నష్టపోగా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ 1% చొప్పున లాభపడ్డాయి. -
భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 14౦ పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు పైగా లాభపడ్డాయి. రికార్డ్ స్థాయిలో స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 27,500 పాయింట్లు దాటగా, నిఫ్టీ 8,200 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.61.35గా ఉంది. -
అసలు బుల్ మార్కెట్ ముందుంది..!
* ఇది ట్రయల్ మాత్రమే: ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా * కమోడిటీ ధరలు ఇక పతనమే 80 డాలర్లలోపే చమురు ధరలు * ఆయిల్ షేర్లపై దృష్టి... పెట్టుబడికి ఓఎన్జీసీ అత్యుత్తమం ముంబై: ఈ ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా దేశీ స్టాక్ మార్కెట్లలో అసలుసిసలు బుల్ దశ మొదలైందంటూ వ్యాఖ్యానించారు. ఇది మదర్ ఆఫ్ ఆల్ బుల్ మార్కెట్స్ అంటూ చెప్పిన రాకేష్ దీపావళి సందర్భంగా ఒక చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి మార్కెట్లపై అత్యంత ఆశావహంగా స్పందించారు. బిగ్‌బుల్‌గా ప్రసిద్ధులైన రాకేష్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... ‘దేశీ స్టాక్ మార్కెట్ సినిమాలో ట్రయిలర్ మాత్రమే మొదలైంది. అసలు సినిమా ముందుంది. అయితే తీవ్ర కరెక్షన్లకు కూడా సిద్ధంగా ఉండాలి. బుల్ మార్కెట్లో దిద్దుబాట్లు సహజం’. ఇప్పుడే చెప్పలేం మోడీ ప్రభుత్వం పనితీరుపై ఇప్పుడే వ్యాఖ్యానించలేం. మనది ప్రజాస్వామ్య దేశం. మార్పులు సహజం. అయితే ఆరు నెలల్లోనే మోడీ అద్భుతాలు చేస్తారని ఆశించడం తప్పు. అయితే కనీసం ఏడాదిన్నర లేదా రెండేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు కనిపించే అవకాశముంది. చమురు ధరలు లేదా కమోడిటీల పతనానికి అందరూ అనుకంటున్నట్లు వినియోగం తగ్గడం కారణంకాదు. గత 15ఏళ్లలో కమోడిటీ మార్కెట్లలో బుల్ ట్రెండ్ నడిచింది. ప్రస్తుతం ఇది అంతమైనట్లే. ఇకపై కమోడిటీల్లో భారీ దిద్దుబాటు(కరెక్షన్) జరిగే అవకాశముంది. అంతేకాదు. ఇది బేర్ ట్రెండ్‌కు దారితీయొచ్చుకూడా. పతనమవుతున్న చమురు ధరలు బ్యారల్‌కు 70-80 డాలర్ల ధరలో స్థిరపడే అవకాశముంది. నా అంచనా ప్రకారం దీర్ఘకాలంపాటు ఇదే స్థాయిలో ధరలు కొనసాగవచ్చు. ఆయిల్ షేర్లు భేష్ ఆయిల్ ధరల పతనం నేపథ్యంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ లబ్దిపొందనున్నప్పటికీ, వ్యక్తిగతంగా ఓఎన్జీసీ పట్ల బుల్లిష్‌గా ఉన్నాను. ఇప్పటికే ఓఎన్జీసీలో ఇన్వెస్ట్ చేశాను కూడా. 2016 తరువాత ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని పూర్తిగా తొలగించే అవకాశముంది. ఇందువల్ల ఆయిల్ ధరల పతనం నుంచి బాగా లాభపడేది ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా అని చెప్పొచ్చు. అంచనా వేయలేం దేశీ మార్కెట్లు సాధించబోయే వృద్ధి పట్ల నేను చూపుతున్న ఆశావహ థృక్పథానికి బిగ్బుల్, మ్యాడ్‌బుల్ అని పేరు పెట్టుకున్నా ఫర్వాలేదు. అయితే సైక్లికల్ అప్‌ట్రెండ్‌ను తక్కువగా అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో వ్యవస్థాగత బుల్‌ట్రెండ్ కనిపించనుంది. 2017-18 తరువాత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిని సాధించనుంది. ఇది ఎన్నేళ్లు కొనసాగుతుందన్నది అంచనా వేయలేం. విదేశీ అంశాల ఎఫెక్ట్ తక్కువే కమోడిటీల పతనం, ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు వంటి సమస్యలను ప్రస్తుతం ధనిక దేశాలు ఎదుర్కొంటున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశమెక్కడ ఉంది? ఒకవేళ పెంచినా ఈ ప్రభావం దేశీ మార్కెట్లపై చాలా తక్కువగానే ఉంటుంది. అది కూడా ఒకటి లేదా రెండు వారాలు మాత్రమే. ఇండియా గరిష్ట స్థాయిలో వృద్ధి సాధించనున్న దేశం. ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయ్. సంస్కరణలు పుంజుకుంటే పెట్టుబడుల వెల్లువెత్తుతాయ్. రేర్ ఎంటర్‌ప్రజైస్ సంస్థ ద్వారా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే రాకేష్ గత ఏడాది కాలంలో ఆర్జించిన లాభాలపై ఇటీవల ఒక పత్రిక లెక్కకట్టింది. ట్రేడింగ్ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రతి గంటకూ రాకేష్ రూ. 35 లక్షలు సంపాదించారంటూ పేర్కొంది. -
మార్కెట్లో దీపావళి
-
భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 26,450 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7,885 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. చైనా స్టాక్ మార్కెట్లు కూడా ఉదయం లాభాలతోనే ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ భారీ విజయాలు సాధించడం కూడా భారత స్టాక్ మార్కెట్లకు మంచి సెంటిమెంటుగా మారింది. డీజిల్ ధరల మీద నియంత్రణను పూర్తిగా ఎత్తేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా ఓఎన్జీసీ, హెచ్పీసీసెల్, ఐఓసీ, ఆయిల్ ఇండియా లాంటి ప్రభుత్వరంగ చమురు సంస్థల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఇక రూపాయి కూడా 22 పైసలు లాభపడింది. ప్రస్తుతం డాలర్ విలువ 61.22 రూపాయలుగా ఉంది. -
ఆయిల్ షేర్లలో అమ్మకాలు
టోకు ధరల సూచి 14 నెలల గరిష్టస్థాయికి పెరగడంతో స్టాక్ సూచీలు ఐదో రోజూ తగ్గాయి. ద్రవ్యోల్బణం గరిష్టస్థాయికి చేరినందున వచ్చే రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు కొన్ని బ్లూచిప్ షేర్లను విక్రయించారు. దాంతో సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి మూడువారాల కనిష్టస్థాయి 20,659 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి 14 పాయింట్ల తగ్గుదలతో 6,154 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణపై మంగళ, బుధవారాల్లో జరిగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకోవొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్ల బలహీనతకు కారణమని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. ఇన్ఫీ, విప్రో కౌంటర్లలో లాంగ్ బిల్డప్... అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమేపీ కుదుటపడుతున్న ఫలితంగా ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్లో కూడా మంచి ఫలితాలు వెల్లడించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఇటు దృష్టిసారించడంతో ప్రధాన ఐటీ షేర్లు అత్యంత గరిష్టస్థాయిలో ముగిసాయి. సెప్టెంబర్ క్వార్టర్లో అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించినా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో భారీ లాభాల స్వీకరణ కారణంగా అప్పట్లో ఈ షేర్లు పెరగలేకపోయాయి. ఇప్పుడు అదే విభాగంలో ఇన్ఫోసిస్, విప్రో కౌంటర్లలో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. ఇన్ఫోసిస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 66 వేల షేర్లు (1.88 శాతం), విప్రో కాంట్రాక్టులో 2.38 లక్షల షేర్ల (2.6 శాతం) చొప్పున యాడ్ అయ్యాయి. ఇన్ఫోసిస్ రూ. 3,400 స్ట్రయిక్ వద్ద కాల్కవరింగ్, పుట్ రైటింగ్ జరగడంతో ఈ స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 60 వేల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 1.30 లక్షల షేర్ల మేర యాడ్ అయ్యాయి. అలాగే విప్రో రూ. 510 స్ట్రయిక్ వద్ద పుట్ బిల్డప్ జరగడంతో 42 వేల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 23 వేల షేర్లు కట్ అయ్యాయి. ఇన్ఫోసిస్ రూ. 3,400పైన, విప్రో రూ. 510పైన స్థిరపడితే రానున్న రోజుల్లో ఇవి మరింత పెరగవచ్చని, ఆయా స్థాయిల దిగువకు క్షీణిస్తే క్రమేపీ బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది.