Old criminals arrested
-
ఘరానా దొంగల ఆటకట్టు
కుషాయిగూడ: దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.68 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వివరాలు వెల్లడించారు. దమ్మాయిగూడ, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సనగాల శ్రీకాంత్, కాప్రా, వంపుగూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఆసిఫ్ పాత నేరస్తులు. ఇద్దరూ కలిసి చాలా కాలంగా దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డారు. వారు చోరీ సొత్తును అదే ప్రాంతానికి చెందిన చెందిన సనగాల సాయికుమార్ సహాయంతో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. వారిపై జవహర్‌నగర్ పీఎస్‌లో 6, కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదై ఉన్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోకుండా చోరీలకు పాల్పడుతున్నారు. పగటి వేళల్లో కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకునే వీరు రాత్రి పూట పంజా విసిరేవారు. గురువారం ముగ్గురు కలిసి చోరీ చేసిన బైక్‌పై వెళుతుండగా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ ఎక్స్‌రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వారి నుంచి 5.4 తులాల బంగారు ఆభరణాలు, 1.63 కిలోల వెండి, రెండు బైక్‌లు, 2 ల్యాప్‌టాప్‌లు, నికాన్ కెమెరా, నోకియా సెల్‌ఫోన్, హెడ్‌ఫోన్, జియో వైఫై మోడెమ్, 4240 అమెరికన్ డాలర్లు, 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో సనగాల శ్రీకాంత్, మహ్మద్ అబ్దుల్ ఆసిఫ్‌లపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. పోలీసులు చేపడుతున్న వాహన తనిఖీలు సత్పలితాలిస్తున్నాయని, నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులను అభినందించారు. సమావేశంలో రాచకొండ క్రైం డీసీపీ యాదగిరి, ఇన్స్పెక్టర్లు లింగయ్య, బాలుచౌహన్, జవహర్‌నగర్ డీఐ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు పాత నేరస్తుల అరెస్టు
విజయవాడ : నగరంలో దొంగతనాలకు పాల్పడే నలుగురు పాత నేరస్తులను సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.74 లక్షలు విలువ చేసే బంగారు గొలుసు, రెండు ద్విచక్ర వాహనాలు, 6 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసులకు సంబంధించి బందర్ రోడ్డులోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ బి. రాజకుమారి వివరాలను వెల్లడించారు. సీసీఎస్ పోలీసులు కంకిపాడు మండలం పునాదిపాడులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న నలుగురు పట్టుబడ్డారు. వారిని సీసీఎస్ సిబ్బంది విచారించారు. గతంలో వారు పాత నేరస్తులుగా గుర్తించారు. మొత్తం ఏడుగురు బృందంగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిలో సత్యనారాయణపురానికి చెందిన తుమ్మల మనోజ్‌కుమార్, తుమ్మల రాజేశ్, అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన గోవిందరాజులు అలియాస్ రాజాసాయి, రామవరప్పాడుకు చెందిన తుమ్మల విఘ్నేశ్వరరావులుగా గుర్తించి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి స్నేహితులైన షేక్ బాషా, రెహమతుల్లా అలిĶæహహ్ అక్తర్, అఫ్జల్ పరారీలో ఉన్నారు. వీరందరు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులు ఓ ముఠాగా ఏర్పడి విశాఖపట్నం, నర్సీపట్నం దగ్గర మారుమూల గ్రామంలో గంజాయి కొని విజయవాడకు తీసుకువచ్చి చుట్టపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. నిందితులు కంకిపాడు పోలీసు స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, సత్యనారాయణపురం ఏరియా మధురానగర్‌లో మరొక గొలుసు దొంగతనం, అజిత్ సింగ్‌నగర్ ఏరియాలో ఒక మోటారు సైకిల్, నూజివీడు ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లిలో ఒక చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు క్రైం డీసీపీ రాజకుమారి చెప్పారు. ఈ కేసును సీసీఎస్ ఏసీపీ కె. ప్రకాశరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బి. బాలమురళీ, ఎస్ఐ మోహన్‌కుమార్, కంకిపాడు ఎస్ఐ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐదుగురు పాత నేరస్తుల అరెస్టు
విజయవాడ : వేర్వేరు కేసులో ఐదుగురు పాత నేరస్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి లక్షలాది రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేస్తున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను బందర్ రోడ్డులోని కంట్రోల్ కమాండ్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ రాజకుమారి వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. సీసీఎస్ పోలీసులకు అందిన సమాచారం మేరకు బీసెంట్ రోడ్డు పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో పలు దొంగతనం కేసుల్లో పాత నేరస్తులైన ఇద్దరు నిందితులు రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకుని పక్కనే ఉన్న వ్యక్తులు ఏమరుపాటులో ఉండగా బ్యాగులు కత్తిరించటం, పర్సులు అపహరించటం చేస్తుంటారు. వీరు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన దేవర శాంతకుమారి, దేవర సువార్త పాత నేరస్తులుగా గుర్తించారు. వీరి నుంచి 19 కేసులకు సంబంధించి రూ.7 లక్షల విలువగల బంగారు ఆభరణలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6, టూ టౌన్ ఏరియాలో 1, గవర్నర్‌పేటలో 1, సత్యనారాయణపురం ఏరియాలో 4, కృష్ణలంక పరిధిలో 4, నున్న పోలీస్ స్టేషన్ ఏరియాలో 1, పటమట ఏరియాలో 1, ఉయ్యూరులో 1.. మొత్తం 19 నేరాలకు పాల్పడినట్లు డీసీపీ వివరించారు. పైకేసుల్లో నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఇంటి దొంగతనాలకుపాల్పడిన ఇద్దరు అరెస్టు.. కాగా, వేర్వేరు కేసుల్లో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన కేసుల్లో ఇద్దరు నిందితులను సీసీఎస్ సిబ్బంది అరెస్టు చేశారని ఆమె చెప్పారు. సోమవారం మాచవరం, గవర్నర్‌పేట ఏరియాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. విజయవాడ గిరిపురానికి చెందిన సత్తా సుధాకర్, తోట శివనాగరాజులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రెండు కేసులకు సంబంధించి రూ.3.24 లక్షలు విలువగల 122 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీలు మక్చుల్, వర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు. మరో పాత నేరస్తురాలి అరెస్టు.. ఇదిలా ఉండగా నగరంలోని పలు ప్రాంతాల్లో బస్సులు, ఆటోల్లో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తోటి ప్రయాణీకుల బ్యాగులు కోసి బంగారు ఆభరణలు అపహరించిన ఓ మహిళా పాత నేరస్తురాలిని సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి ఏడు కేసుల్లో రూ.6 లక్షల విలువ చేసే 164 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీదు మండలం శివాపురం గ్రామానికి చెందిన ద్వారకాచర్ల గిరిజాకుమారి అనే పాత నేరస్తురాలు నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా సీసీఎస్ పోలీసులు పట్టుకుని విచారించారు. ఆమె నగరంలోని వన్ టౌన్, గవర్నర్‌పేట, కృష్ణలంక ఏరియాల్లో 7 దొంగతనాలకు పాల్పడింది. ఈ కేసుల్లో రూ.6 లక్షల విలువ గల బంగారు ఆభరణలను స్వాధీనం చేసుకున్నారు. -
తుపాకులతో సెటిల్మెంట్లు.. అరెస్ట్
-
తుపాకులతో సెటిల్మెంట్లు.. అరెస్ట్
సిరిసిల్ల: మారణాయుధాలతో సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సిరిసిల్ల పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ సుధాకర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సెటిల్మెంట్లు చేస్తున్న పాత నేరస్తులు నాగార్జున, తిరుపతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరిపై గతంలో అనేక కేసులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు.