old man murdered
-
ముక్కలుగా నరికి.. డ్రమ్ముల్లో కుక్కి
హైదరాబాద్: తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. కుటుంబసభ్యులతో కలిసి వృద్ధతండ్రిని దారుణంగా హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసి ఉంచిన సంఘటన హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏసీపీ సందీప్‌కుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్ ఆదివారం వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన కిషన్ సుతార్ మారుతి(80) రైల్వే విభాగంలో గూడ్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. 20 ఏళ్ల క్రితం మౌలాలి ఆర్టీసీ కాలనీలో స్ధిరపడ్డాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు చాలా ఏళ్ల క్రితమే అదృశ్యమయ్యాడు. పెద్ద కూతురు అనుపమ, భర్తతో కలిసి మారేడ్‌పల్లిలో ఉంటోంది. ఆర్టీసీకాలనీలో సూతార్ మారుతీ, అతని భార్య గయ, కూతురు ప్రపుల్, కుమారుడు కిషన్‌తో కలిసి ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన సుతార్ మారుతీ నిత్యం కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. కుమారుడి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈ నెల 16వ తేదీ రాత్రి పది గంటలకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన సుతార్ మారుతి భార్య, కొడుకు, కూతురుతో గొడవపడ్డాడు. అదేరాత్రి సుతార్ మారుతీ హత్యకు గురయ్యాడు దుర్వాసనతో బయటపడ్డ సంఘటన రెండు రోజులుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు 100 నంబర్‌కు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ మన్మోహన్, ఎస్ఐ సంజీవరెడ్డిలు ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. సుతార్ మారుతీ మృతదేహం ముక్కలు, ముక్కలుగా ఆరు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వేసి ఉండటం చూసి ఖంగుతిన్నారు. సుతార్ మారుతీని పథకం ప్రకారమే హత్య చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యులను తరచూ వేధించడం, కిషన్‌కు ఉద్యోగంలేదని గొడవపడుతుండటంతో సుతార్ మారుతీను హత్య చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పకడ్బందీగా మృతదేహాన్ని తరలించేందుకు కొత్తగా ఆరు ప్లాసిక్ట్ డమ్ములను వాడటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. సంఘటనాస్థలానికి వచ్చిన క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్ శునకం ఇంట్లో నుంచి కొంత దూరం వెళ్లి తిరిగివచ్చింది. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఉద్దేశపూర్వకంగా హత్య చేశారా లేక సుతార్ మారుతీ, కిషన్ గొడ వపడినప్పుడు కిందపడి ప్రమాదవశాత్తు చనిపోతే ఎవరికీ తెలియకుండా ప్లాసిక్ట్ డ్రమ్ముల్లో తరలించడానికి ప్రయత్నించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టుపక్కలవారిని విచారించగా సుతార్ మారుతీ కుటుంబసభ్యులు ఎవరితోనూ ఎక్కువగా కలిసేవారు కాదని తెలిపారు. కుటుంబ కలహాలే కారణం: ఏసీపీ సందీప్ సుతార్ మారుతీ హత్యకు కుటుంబకలహాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని ఏసీపీ సందీప్ తెలిపారు. కొడుకుకు ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తరచూ తండ్రీకొడుకులు గొడవపడేవారన్నారు. -
భూ తగాదాలో వృద్ధుడి హత్య
మోతె ( కోదాడ ) : భూ తగాదాలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని హుస్సేన్‌బాద్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాటెపెల్లి వెంకటయ్య(65) అదే గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మయ్యకు మధ్య భూ తగాదాలు ఉన్నాయి. వెంకటయ్య సోమవారం తన వ్యవసాయ పొలంలో వరాలు చెక్కుతుండగా అదే గ్రామానికి చెందిన కొమ్ము లక్ష్మయ్య గొడ్డలితో కాళ్లు చేతులు నరికి చంపాడు. వెంకటయ్య తన భూమిలోకి వెళ్లేందుకు దారి లేదు. లక్ష్మయ్య కుండబడిన పోరంబోకు భూమి నుంచి మాత్రమే వెళ్లాలి. నాలుగు సంవత్సరాల క్రితం లక్ష్మయ్య తన వ్యవసాయ భూమిలో నుంచి వెంకటయ్య వెళ్లకుండా దారి పూడ్చినాడు. ఇరువురు పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం మేరకు లక్ష్మయ్య కుండబడిన 14 కుంటలు(సర్వే నెం–తెలియదు),20 కుంటల(సర్వేనెం–తెలియదు) పోరంబోకు భూమిని సుమారుగా రూ 3 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇట్టి భూమి విషయంలో రెండు కుటుంబాలకు అనేక సార్లు గొడవలు జరిగాయి.ఇరువురు పెద్దమనుష్యుల సమక్షంలో ఎలాంటి గొడవలకు పాల్పడమని ఒకరికొకరు ఒప్పందమైనారు.ఇటివల గ్రామంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న భూప్రక్షాళన సర్వేలో ఇరువురు దరకాస్తు చేసుకున్నారు.రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఒకరికొకరు ఘర్షణకు దిగారు. 25 రోజుల క్రితం కొమ్ము రమేష్ మృతుడి కుమారుడు కాటెపెల్లి సైదులుపై గొడ్డలితో దాడిచేసి గాయపరిచాడు. కొంత కాలం నుంచి లక్ష్మయ్య వెంకటయ్య కుటుంబంతో గొడవ పడుతూ.. నా భూమి నాకు కావాలని బెదించాడు.వెంకటయ్య కుటుంబం లక్ష్మయ్య మాటలు పట్టించుకోకపోవడంతో లక్ష్మయ్య సోమవారం మధ్యాహ్నం మద్యం సేవించి వెంకటయ్యను గొడ్డలితో నరికి హాత్యచేసి పారిపోయాడు.గాయాలతో పొలంలో పడి ఉన్న వెంకటయ్యను 108 సహాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబానికి న్యాయం చేస్తాం సూర్యాపేట నుంచి వెంకటయ్య మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు భారీ సంఖ్యలో వచ్చి మోతె పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. హత్య చేసిన లక్ష్మయ్యను వెంటనే అరెస్టు చేసి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమాచారంతో కోదాడ డీఎస్పీ రమణారెడ్డి, సూర్యాపేట సీఐ ప్రవీణకుమార్, మునగాల సీఐ శివశంకర్ పోలీస్ బందోబస్తులతో మోతె పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మృతుడి కుమారుడు కాటెపెల్లి సైదులు ఫిర్యాదు మేరకు మునగాల సీఐ శివశంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశ్రయం ఇస్తే ప్రాణం తీశాడు
మద్యం మత్తులో దూషిస్తున్నాడని తలపై రాడ్‌తో కొట్టి వ్యక్తి హత్య భాగ్యనగర్ కాలనీ: తాగి దూషిస్తున్నాడని ఆశ్రయం ఇచ్చిన వ్యక్తినే దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఆనక మృతదేహాన్ని బూత్రూమ్లో దాచి పరారయ్యాడు. కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. కూకట్పల్లి సీఐ పురుషోత్తమ్ యాదవ్ కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన పన్నాలాల్ షా (55) మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డులో నివాసం ఉంటూ స్థానిక చక్రగిరి ట్రాన్స్‌పోర్ట్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లిన పన్నాలాల్ నగరానికి తిరిగి వస్తూ తన వెంట అదే గ్రామానికి చెందిన సంజీవ్ అనే వ్యక్తిని తీసుకొచ్చాడు. అతడిని తన వద్ద అసిస్టెంట్ మెకానిక్‌గా చేర్చుకొని, తన రూమ్‌లోనే వసతి కల్పించాడు. పన్నాలాల్‌కు మద్యం తాగే అలవాటు ఉంది. తాగినప్పుడు అసభ్యకరంగా మాట్లాడుతూ సంజీవ్ని వేధించేవాడు. దీంతో విసుగు చెందిన సంజీవ్... ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న పన్నాలాల్ తలపై ఐరన్ రాడ్‌తో విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని బాత్రూమ్లో దాచి పెట్టి సంజీవ్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తలపై ఐరన్ రాడ్‌తో కొట్టడంతో మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు.