రూ. 62 లక్షల పాతనోట్లు స్వాధీనం
భువనగిరి: రద్దైన పెద్ద నోట్లను తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 62 లక్షల విలువైన పాత రూ. 500, వెయ్యి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు పెద్ద నోట్లు తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఈ రోజు భువనగిరి డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ తరుణ్‌జోషి వివరాలు వెల్లడించారు.