Older woman
-
డైట్ కోక్‌తో ఇన్నేళ్లు బతికా..
లండన్ : డైట్ కోక్‌తో బరువెక్కుతారని, డయాబెటిస్ ముప్పు పొంచిఉందని పరిశోధకులు హెచ్చరిస్తుంటే...మిచిగాన్కు చెందిన 104 ఏళ్ల థెరెసా రౌలీ మాత్రం తన ఆరోగ్యానికి డైట్ కోక్ కారణమని చెబుతున్నారు. ఆమె ఇప్పటికీ రోజుకో డైట్ కోక్ తీసుకుంటానని అంటున్నారు. రోజూ డైట్ కోక్ తాగడం వల్లే తాను ఇన్నేళ్లు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నానన్నారు. జనవరి 1న థెరిసా రౌలీ కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తనకు వందేళ్లు రాగానే 104 ఏళ్లు బతుకుతానని అనుకోలేదని..ఆ తర్వాత 101 ఇప్పుడిలా 104 సంవత్సరంలోకి అడుగుపెట్టానన్నారు. తాను రోజుకి ఒక క్యాన్ సోడా తీసుకుంటానని చెప్పారు. డైట్ కోక్ అంటే తనకు ఇష్టమని అందుకే దాన్ని సేవిస్తానన్నారు. తన దగ్గర ఇప్పుడు ఖాళీ డైట్ కోక్ క్యాన్లున్నాయని, వాటిని ఇచ్చేసి మరికొన్ని కోక్‌లు తెచ్చుకుంటానని చెబుతున్నారు. రౌలీకి 68 ఏళ్లున్నప్పుడు అమెరికాలో 1982లో డైట్ కోక్ లాంఛ్ అయింది. అప్పటి నుంచి ఆమె రోజూ డైట్ కోక్ తీసుకుంటుఆన్నరు. అయితే డైట్ కోక్ వల్లే ఆమె ఇన్నేళ్లు బతికిందనే వాదనలను శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. డైట్ సోడాతో ఒబెసిటీ, డయాబెటిస్, స్ట్రోక్ ముప్పులు ఎదురవుతాయని పలు అథ్యయనాల్లో వెల్లడైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
కరీంనగర్ (సుల్తానాబాద్) : సుల్తానాబాద్ కూరగాయల మార్కెట్ వద్ద కాసర్ల మల్లమ్మ(80) అనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. వృద్ధురాలు గట్టిగా అరిచినా దగ్గర ఎవరూ లేకపోవడంతో లాభం లేకపోయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ కల్లు దొరకక ఆత్మహత్య
జడ్చర్ల (మహబూబ్‌నగర్) : కల్తీ కల్లు దొరకక ఓ వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కుమ్మరి లక్ష్మమ్మ(65) కల్తీ కల్లుకు బానిసైంది. ఈ క్రమంలో కల్తీ కల్లు లభించకపోవడంతో.. గత నాలుగు రోజులుగా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తోంది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించినా లాభం లేకపోయింది. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలు మృతి
తాడిపత్రి (అనంతపురం జిల్లా) : అనుమానాస్పదస్థితిలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బోడాయిపల్లి గ్రామానికి చెందిన శివరామమ్మ(77)కు ముగ్గురు కుమారులు. గ్రామ సమీపంలోని తోటలో ఉన్న ఇంటిలో ఆమె నివాసముంటుంది. కాగా గురువారం తోట దగ్గరకు వెళ్లిన కొడుకు తల్లి మరణించడం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే శివరామమ్మ గొంతుపై ఉన్న గుర్తుల ఆధారంగా గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
కారు ఢీకొని వృద్ధురాలు మృతి
చోడవరం (విశాఖ జిల్లా) : రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన విశాఖజిల్లా చోడవరం పీహెచ్సీ ఎదురుగా శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని దుడ్డుపాలెం గ్రామానికి చెందిన పరదేసమ్మ(54) అనే వృద్ధురాలు మార్కెట్‌కు వెళ్లి వస్తున్న సమయంలో.. చోడవరం నుంచి గవరవరం వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలిపై హత్యాయత్నం
ఆలమూరు(తూర్పుగోదావరి జిల్లా) : డబ్బు కోసం చెత్త ఏరుకునే వ్యక్తి ఓ వృద్ధురాలిపై హత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చింతలూరు గ్రామానికి చెందిన పద్మ(60) భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. కాగా గ్రామంలో చెత్త ఏరుకునే వెంకన్న సోమవారం ఆమెపై దాడి చేశాడు. తలపై సీసాతో బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని ఆదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. -
కరుణలేని నిబంధన... చేయి కోల్పోయిన వృద్ధురాలి వేదన
కర్నూలు (ఆత్మకూరు రూరల్) : సాంకేతిక అభివృద్ధి మనిషిని సౌకర్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడాలి కానీ వారిని మరింత కష్టాల పాలు చేయడానికి కాదు. అక్రమాల నిరోధానికంటూ ప్రవేశ పెట్టిన ఆధార్ ఎందరి ఆధారాలనో పోగొట్టిందో అందరికి తెలిసిందే. అలాంటి కోవలోనిదే పౌరసరఫరాలలో అక్రమాలను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పద్ధతి. లబ్దిదారుల వేలి ముద్రలను స్కానింగ్ చేసి భధ్రపరచి వారు స్వయంగా వేలి ముద్రలు వేసిన తరువాత సరిచూసే ఈ పద్ధతి ఓ వృద్దురాలిని కడుపు కాలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దూదేకుల హుసేనమ్మ భర్త ఇటీవలే మృతిచెందాడు. ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఉన్న కష్టాలు చాలవన్నట్లు చేతి వేళ్ళకు అయిన చిన్నపాటి గాయం పెరిగి పెద్దదై గాంగ్రిన్‌గా మారి చేతిని కుళ్ళ జేసింది. దీంతో సంవత్సరం క్రిందట అనివార్యంగా ఆమె ఎడమ చేతిని వైద్యులు ముంజేతి వరకు తొలగించారు. దీంతో ఆమె రేషన్ కార్డుకు రావాల్సిన వెచ్చాలను తీసుకోవడానికి రేషన్ షాపుకు వెళ్తే.. తన ఎడమ చేతి బొటన వ్రేలి ముద్ర వేయలేని కారణంగా డీలరు ఆమెకు రేషన్ ఇవ్వడానికి నిరాకరించాడు. భర్తను కోల్పోయి , మోచేతి వరకు చేతిని కోల్పోయిన హుసేనమ్మకు న్యాయంగా రావాల్సిన రేషన్ వేలి ముద్ర వేయలేని కారణంగా ఏడాదిగా ఇవ్వకపోవడం ప్రభుత్వ సాంకేతికత డొల్లతనాన్ని సూచిస్తోంది. తనకు రేషన్ ఇప్పించండంటూ ఆమె ఆత్మకూరు తహశీల్దార్ రాజశేఖరబాబుకు గురువారం మొరపెట్టుకుంది.