డైట్‌ కోక్‌తో ఇన్నేళ్లు బతికా.. | diet coke is the secret of rowlys energy | Sakshi
Sakshi News home page

డైట్‌ కోక్‌తో ఇన్నేళ్లు బతికా..

Published Fri, Jan 5 2018 7:03 PM | Last Updated on Fri, Jan 5 2018 7:03 PM

 diet coke is the secret of rowlys energy - Sakshi

లండన్‌ : డైట్‌ కోక్‌తో బరువెక్కుతారని, డయాబెటిస్‌ ముప్పు పొంచిఉందని పరిశోధకులు హెచ్చరిస్తుంటే...మిచిగాన్‌కు చెందిన 104 ఏళ్ల థెరెసా రౌలీ మాత్రం తన ఆరోగ్యానికి డైట్‌ కోక్‌ కారణమని చెబుతున్నారు. ఆమె ఇప్పటికీ రోజుకో డైట్‌ కోక్‌ తీసుకుంటానని అంటున్నారు. రోజూ డైట్‌ కోక్‌ తాగడం వల్లే తాను ఇన్నేళ్లు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నానన్నారు. జనవరి 1న థెరిసా రౌలీ కేక్‌ కట్‌ చేసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తనకు వందేళ్లు రాగానే 104 ఏళ్లు బతుకుతానని అనుకోలేదని..ఆ తర్వాత 101 ఇప్పుడిలా 104 సంవత్సరంలోకి అడుగుపెట్టానన్నారు.

తాను రోజుకి ఒక క్యాన్‌ సోడా తీసుకుంటానని చెప్పారు. డైట్‌ కోక్‌ అంటే తనకు ఇష్టమని అందుకే దాన్ని సేవిస్తానన్నారు. తన దగ్గర ఇప్పుడు ఖాళీ డైట్‌ కోక్‌ క్యాన్‌లున్నాయని, వాటిని ఇచ్చేసి మరికొన్ని కోక్‌లు తెచ్చుకుంటానని చెబుతున్నారు. రౌలీకి 68 ఏళ్లున్నప్పుడు అమెరికాలో 1982లో డైట్‌ కోక్‌ లాంఛ్‌ అయింది. అప్పటి నుంచి ఆమె రోజూ డైట్‌ కోక్‌ తీసుకుంటుఆన్నరు.

అయితే డైట్‌ కోక్‌ వల్లే ఆమె ఇన్నేళ్లు బతికిందనే వాదనలను శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. డైట్‌ సోడాతో ఒబెసిటీ, డయాబెటిస్‌, స్ట్రోక్‌ ముప్పులు ఎదురవుతాయని పలు అథ్యయనాల్లో వెల్లడైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement