Olympiad
-
‘భాషా’..! ఒక్క ప్రశ్న కాదు.. వందైనా ఓకే!
కేవలం 250 మంది మాట్లాడే భాష పేరు చెప్పగలరా? దాని నిర్మాణం ఏమిటి? ఎలా మాట్లాడుతారు, ఎలా రాస్తారో చెప్పగలరా? కొన్ని గంటల్లోనే ఆ భాషను అనువదించగలరా? ‘కష్టం’ అనేవాళ్లే ఎక్కువ. కాని కొందరు ఇష్టంగా ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. మన దేశం తరఫున ఈ పోటీలో పాల్గొన్న లక్ష్మీ, అనిమికా దత్తాలు పతకాలు గెలుచుకున్నారు...ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, భాషాశాస్త్ర నిపుణులను ఒకచోట చేర్చే అంతర్జాతీయ పోటీ. 2003లో ఇది మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల వ్యాకరణం, నిర్మాణం, సంస్కృతి, చరిత్రను విశ్లేషించడానికి, పజిల్స్‌ను సాల్వ్ చేయడం ద్వారా భాష సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ పోటీ అవకాశం కల్పిస్తుంది. సృజనాత్మకత, ఊహాశక్తిని మెరుగుపరచడానికి ఈ పోటీ ఉపకరిస్తుంది. భవిష్యత్తు భాషాశాస్త్ర నిపుణులను తయారుచేస్తుంది.‘భాష లేదా భాషాశాస్త్రంపై లోతైన పరిజ్ఞానం అవసరం లేదు. అత్యంత సవాలుతో కూడిన సమస్యలకు కూడా తార్కిక సామర్థ్యంతో, ఓపికతో పరిష్కారం కనుక్కోవచ్చు’ అంటుంది ఐవోఎల్. పోటీలో పాల్గొన్న వారికి ఇన్‌ఫుట్స్ ఇస్తారు. వాటి ఆధారంగా పజిల్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది.ఈ సంవత్సరం ‘ఐవోఎల్’కు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ పోటీలో 38 దేశాల నుంచి 51 టీమ్‌లు పాల్గొన్నాయి. బ్రెజిల్ రాజధాని బ్రజిలియాలో జరిగిన 2024 ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్(ఐవోఎల్)లో మన దేశానికి చెందిన అనిమికా దత్తా ధర్, శ్రీలక్ష్మీ వెంకట్రామన్, ఫరాజ్ సిద్దిఖీ, అనన్య అగర్వాల్‌లు అద్బుత ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించారు.‘ఐవోఎల్ వెబ్సైట్లో గత ఒలింపియాడ్‌లో వచ్చిన ్రపాబ్లమ్స్ను సాల్వ్ చేస్తూ ్రపాక్టీస్ చేశాను’ అంటుంది పద్నాలుగు సంవత్సరాల శ్రీలక్ష్మీ. బెంగళూరులోని జైగోపాల్ రాష్ట్రీయ విద్యాకేంద్రలో చదువుతున్న శ్రీలక్ష్మీ ఐఐటీ కాన్పూర్ విద్యార్థి ఫరాజ్ సిద్దిఖీతో కలిసి కాంస్య పతకం సాధించింది. పదిహేడు సంవత్సరాల అనిమికా దత్తా ఈ ఒలింపియాడ్‌లో రజత పతకం గెలుచుకుంది. అనిమిక చెన్నై మ్యాథమెటికల్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి. తృటిలో పతకం చేజార్చుకున్న అనన్య పతకం సొంతం చేసుకోకపోయినా బోలెడు ప్రశంసలు అందుకుంది.ఈ ఒలింపియాడ్‌లో పాల్గొన్న మన బృందానికి మైండ్–బ్లోయింగ్ వర్డ్ పజిల్స్ సవాలు విసిరాయి. ఇచ్చిన వ్యవధి ఆరు గంటలు. కొరియాక్(రష్యా), హడ్జా(టాంజానియా), కొమ్టో(పపువా న్యూ గినియా), దావ్ (బ్రెజిల్), యానువ్యవా(ఆస్ట్రేలియా)లాంటి మారుమూల భాషలకు సంబంధించిన పజిల్స్ ఇచ్చారు. ‘భాష నుంచి చారిత్రక సందర్భాలను నిర్వచించవచ్చు’ అంటున్న అనిమిక పపువా న్యూ గినియాకు చెందిన ఎన్డు భాషతో పాటు చారిత్రక విషయాల గురించి కూడా మాట్లాడగలదు. భాషాశాస్త్రం లోతుపాతుల గురించి పెద్దగా తెలియని అనిమిక ఆ శాస్తంపై ఆసక్తి పెంచుకోవడానికి పజిల్స్ కారణం.‘లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొనడం వల్ల కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యం పెరుగుతుంది’ అంటుంది శ్రీలక్ష్మి. ‘నా సాంస్కృతిక నేపథ్యమే నాకు స్ఫూర్తి’ అంటుంది అనన్య అగర్వాల్. ‘ఐవోఎల్’ బ్రెయిన్టీజర్ ఫీచర్లు సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆ సంస్కృతి తెలియకపోతే పజిల్స్ పరిష్కరించడం కష్టం. ఉదాహరణకు ఈ సంవత్సరం ఫ్యామిలీ ట్రీ ఇచ్చారు. ఫరెమ్ ప్రజల గురించి తెలియకపోతే ఆ సమస్య పరిష్కరించలేము. ఫరెమ్ అనేవాళ్లు కొమ్జో భాష మాట్లాడే ప్రజలు. వివాహనికి సంబంధించిన వీరి ఆచారవ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి. ‘ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రవేశం అనేది సూక్ష్మస్థాయిలో విశ్లేషణకు, సృజనాత్మకంగా ఆలోచించడానికి ఉపకరిస్తుంది’ అనే విషయాన్ని ‘ఐవోఎల్’ పోటీలు చెప్పకనే చెబుతున్నాయి. బహు భాషలపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రేరణను ఇస్తున్నాయి.మరింత సులువుగా...ఒక భాషకు సంబంధించిన వాక్యనిర్మాణం, వ్యాకరణం, ధ్వనులు... మొదలైన వాటిపై భాషాశాస్త్రం పనిచేస్తుంది. భాషాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తి ఊపందుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రధాన కారణం. జీపీటి–4, క్లాడ్, జెమినిలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) ఇందుకు ఉదాహరణ. మనిషి ఇచ్చే ఇన్పుట్స్, కమాండ్స్‌కు మెషిన్ అర్థం చేసుకోవడానికి మధ్య అంతరాన్ని పూడ్చడానికి నేచురల్ లాంగ్వేజ్ ్రపాసెసింగ్ సిస్టమ్స్ (ఎన్ఎల్పీ) అవసరం. ఎక్కువ సంఖ్యలో భాషాశాస్త్రవేత్తలు ‘ఎన్ఎల్పీ’ రిసెర్చ్‌లో భాగం అయితే సహజత్వ ప్రక్రియ మరింత సులువు అవుతుంది.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
చెస్ బోర్డు మాదిరి బ్రిడ్జ్... ఎక్కడుందో తెలుసా!: వీడియో వైరల్
చెన్నై: 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్ బ్రిడ్జ్‌కి చెస్ బోర్డులా పేయింట్ వేశారు. ఈ బ్రిడ్జ్ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది ఈ ఒలింపియాడ్ ఈవెంట్‌కి సుమారు 2 వేల మంది దాక క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ బ్రిడ్జ్ తాలుకా వీడియోని పోస్ట్ చేస్తూ...భారతదేశానికి చెందిన చెస్ రాజధాని చెన్నై గగ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఐకానిక్ నేపియర్ బ్రిడ్జ్‌గా చెస్ బోర్డులా అలంకరిచండబడిందని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు వావ్ వాటే స్పీరిట్ నమ్మా చెన్నై అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Chennai the Chess Capital of India is all set to host the grand, Chess Olympiad 2022.The iconic Napier Bridge is decked up like a Chess Board.Check it out 😊 #ChessOlympiad2022 #ChessOlympiad #Chennai pic.twitter.com/wEsUfGHMlU — Supriya Sahu IAS (@supriyasahuias) July 16, 2022 (చదవండి: కరోనాతో ఆస్పత్రిలో చేరిన పన్నీర్‌సెల్వం) -
జిష్ణుకు బంగారు పతకం
చిత్తూరు ఎడ్యుకేషన్ : జిల్లాలోని పుత్తూరు పరిధి రాచపాళెం గ్రామానికి చెందిన బసవరాజు జిష్ణు(18) అంతర్జాతీయ స్థాయి ఒలంపియాడ్లో బంగారు పతకం సాధించాడు. ఈ నెల 19 నుంచి 29 వరకు యూరప్‌లోని చెక్ రిపబ్లిక్, స్లోవేకియా దేశాల్లో నిర్వహించిన 50వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలంపియాడ్ పరీక్షల్లో ప్రతిభ చాటా డు. ఈ పరీక్షల్లో 85 దేశాలకు చెందిన విద్యార్థులు పోటీపడ్డారు. అందులో జిల్లాకు చెందిన జిష్ణు రసాయన శాస్త్రంలో నిర్వహించిన రాతపరీక్ష, ప్రయోగ పరీక్షలో ప్రతిభ చాటి బంగారుపతకం కైవసం చేసుకున్నాడు. అనంతరం ఈ విద్యార్థి ప్రాగ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారతదేశం తరఫున బహుమతి పొందాడు. జిష్ణు ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒలంపియాడ్ పోటీలు మూడంచెల ఎంపిక పరీక్ష విధానంలో జరిపారని చెప్పారు. మన దేశం నుంచి తనతో పాటు ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. తన తల్లిదండ్రులు చెంగల్రాజు, భారతి ప్రభుత్వ ఉపాధ్యాయులని, వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ బహుమతి సాధించగలిగానన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు, పోటీపరీక్షలు రాసి దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే తన ఆశయమన్నారు. -
గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్నాం
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత క్రీడాకారులు గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్నారని గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అన్నాడు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ఈ టోర్నీలో బాలుర బృందం నాలుగో స్థానంలో, బాలికల జట్టు ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. స్వదేశానికి చేరుకున్న అతను టోర్నీ ఫలితాల్ని విశ్లేషించాడు. ఈ ఈవెంట్లో భారత జట్లు ఓవరాల్‌గా చక్కని ఆటతీరునే కనబర్చాయని చెప్పిన అతను పతకం దక్కకపోవడానికి కొన్ని గేముల ఫలితాలే కారణమన్నాడు. ‘కొందరు ఆటగాళ్లు మంచి ఎత్తులతో ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని కనబరిచారు. గెలవాల్సిన ఆ మ్యాచ్‌ల్ని డ్రాతో ముగించడం వల్లే పతకాన్ని మూల్యంగా చెల్లించుకున్నాం’ అని హరి వివరించాడు. ప్రపంచ 15వ ర్యాంకర్ హరికృష్ణ ఈ టోర్నీలో చక్కని పోరాటంతో ఆకట్టుకున్నాడు. ప్రపంచ 9వ ర్యాంకర్ సెర్గెయ్ కర్జాకిన్ (రష్యా), మమెద్యరోవ్ (అజర్బైజాన్)లను కంగుతినిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ సంచలనం ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గేమును డ్రా చేసుకున్నాడు. -
ఒలింపియాడ్‌లో ఎంపీఎస్ విద్యార్థుల ప్రతిభ
మెుదటి ర్యాంకర్ శ్రీమహాలక్ష్మికి స్వర్ణపతకం సాయిభార్గవికి 7, హర్షిత్‌కు 10 ర్యాంకులు మండపేట : సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో గత ఫిబ్రవరిలో జరిగిన ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులు పలు పతకాలు అందుకున్నట్టు పట్టణానికి చెందిన మండపేట పబ్లిక్ స్కూల్ (ఎంపీఎస్) కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు తెలిపారు. 9వ తరగతి విద్యార్థిని ఎ.శ్రీమహాలక్ష్మి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిందన్నారు. గురువారం నెల్లూరు టౌన్‌హాలు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీడా రవిచంద్ర, నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్‌ల చేతుల మీదుగా బంగారు పతకం, నగదు బహుమతి అందుకున్నట్టు తెలిపారు. 5వ తరగతి చదువుతున్న డి.వీరసాయి భార్గవి రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు, 8వ తరగతి విద్యార్థి సీహెచ్ హర్షిత్ 10వ ర్యాంకు సాధించి, బహుమతులు అందుకున్నారన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను చిన్నారావు, స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు. -
దేశాభివృద్ధిలో స్టాటిస్టిక్స్ పాత్ర కీలకం
సెంట్రల్ యూనివర్సిటీ: దేశాభివృద్ధిలో గ ణాంకాల (స్టాటిస్టిక్స్) పాత్ర కీలకమని ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీలోని సీఆర్. రావు స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఆదివారం 8వ స్టాటిస్టిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా సి.రంగరాజన్ మాట్లాడుతూ సాంకేతిక శాస్త్రాన్ని, ఆధునిక టెక్నాలజీలో విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. దేశానికి సాంకేతిక శాస్త్రవేత్తల అవసరం ఉందన్నారు. స్టాటిస్టిక్స్‌కు భారత్ మూలమని, సిఆర్. రావు లాంటి వ్యక్తులు ఈ రంగంలో ఖ్యాతి గడించారని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జగన్నాథరావు మాట్లాడుతూ న్యాయ సమస్యలను పరిష్కరించడంలో గణాంకాలు కీలకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని పలు పెండింగ్ వివాదాలను గణాంకాల ఆధారంగా పరిష్కరించిన ఘటనలను గుర్తుచేశారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాభివృద్ధి జరగాలని సూచించారు. అప్పుడే దేశాభివృద్ది సాధ్యమన్నారు. స్టాటిస్టికల్ ఒలింపియాడ్‌లో విజేతలైన పలు పాఠశాలల విద్యార్థులకు రంగరాజన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ అరుణాచలం, హెచ్‌సీయూ వైస్‌ఛాన్సలర్ హరిబాబు, సీఆర్ రావు ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ అల్లం అప్పారావు, ప్రొఫెసర్ యుగేందర్, ఎస్‌బీరావు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల్లోని నైపుణ్యం వెలికితీయాలి
సాక్షి, సిటీబ్యూరో: యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలు, యూనిఫైడ్ సైబర్ ఒలింపియాడ్, యూనిఫైడ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ విజేతలకు ఆవార్డులు ప్రదానం చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షలో రాష్ట్రానికి చెందిన 130 మంది విద్యార్థులు అవార్డును దక్కించుకున్నారు. విజేతలుగా నిలిచిన వీరితో పాటు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి, ఉత్తమ పనితీరు కనబర్చిన పాఠశాలలకు ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సెం టర్ ఫర్ సెల్యూలర్ అండ్ మానిక్యూలర్ బయోలాజి (సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌బాబు అవార్డులు అందజేసి సత్కరించారు. యూనిఫైడ్ కౌన్సిల్ డెరైక్టర్ కల్లూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ .. సంస్థ ఆరంభించిన తొలినాళ్ల నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయిలో నాణ్యమైన విద్యా సంబంధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల నైపుణ్యం వెలికి తీసేలా పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. ఈ పరీక్షకు ఇండోనేషియా, రష్యా, కువైట్, బ్రిటన్ తదితర దేశాల నుంచి ఏడు లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ బీవీ పట్టాభిరామ్, క్యాట్‌నవ్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మోడల్ ప్రశ్నపత్రాల పంపిణీ
ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 3 నుంచి 10వ త రగతి వరకు చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు మోడల్ ప్రశ్నపత్రాలను పంపిణీ చేయనున్నట్లు లిటిల్ చాంప్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ గౌరవాధ్యక్షుడు భవనాసి సుబ్రహ్మణ్యం, డైరక్టర్ నాగలక్ష్మి బుధవారం తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఒలంపియాడ్లో పాల్గొనే విద్యార్థులకు మోడల్ ప్రశ్నపత్రాలు ఉచితంగా పంపిణీ చే స్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంతపేట పశువుల ఆస్పత్రి ఎదురుగా ఉన్న తమ సంస్థ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు పొందవచ్చని చెప్పారు. 2013కు గాను లిటిల్చాంప్ అకాడమీ అవార్డుల దరఖాస్తు గడువును నవంబరు 30వ తేదీ వరకు పొడిగించామన్నారు. రాష్ట్రస్థాయి ఒలంపియాడ్లో పాల్గొనే విద్యార్థుల వివరాలను సంబంధిత విద్యాసంస్థలు నవంబరు 10వ తేదీలోగా లిటిల్చాంప్స్ అకాడమీ, ఇంటి నం 58-7-41/1, సంతపేట, ఒంగోలు-1 చిరునామాకు పంపాలని కోరారు. వివ రాలకు 96183 43805ను సంప్రదించాలని సూచించారు.