ఎయిర్పోర్ట్లో కిలోన్నర బంగారం స్వాధీనం
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన ప్రయాణీకుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఓ లగేజీలో అధిక మొత్తంలో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దాంతో సదరు లగేజీ ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకీ తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.