one year service
-
ధరణికి నేటితో ఏడాది.. సీఎం కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ నేటితో ఏడాది పూర్తి చేసుకుంటోంది. గతేడాది అక్టోబర్ 29న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమైంది. అయితే పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అధికారిక కార్యకలాపాలు మాత్రం నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాదిలో మొత్తం 10.45 లక్షలకు పైగా ధరణి ద్వారా వ్యవసాయ భూముల లావాదేవీలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో భూముల రిజిస్ట్రేషన్లు 75 శాతం ఉండగా, 25 శాతం మేర మ్యుటేషన్లు, పంపకాలు, వారసత్వ హక్కులు, వ్యవసాయేతర భూములుగా మార్చే కార్యకలాపాలు జరిగాయని ధరణి పోర్టల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటివరకు 96 శాతం దరఖాస్తులు పరిష్కారం కాగా, 4 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తమ్మీద ఈ ఏడాది జరిగిన ధరణి పోర్టల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చినట్లు సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. కొంచెం ఇష్టం.. ఇంకొంచెం కష్టం అవినీతికి, ఆలస్యానికి తావు లేకుండా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల లావాదేవీలను పారదర్శకంగా జరపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా, వీలున్నంత త్వరగా లావాదేవీలు పూర్తి చేయడం, ఈ లావాదేవీల ద్వారా రైతు ఇంటికే నేరుగా హక్కు పత్రాలు పంపే విషయంలో ధరణి సమర్థంగానే పనిచేస్తోందనే అభిప్రాయం ఉంది. చదవండి: (కర్నూలు జిల్లా 'మిర్చి' రైతులకు మంచిరోజులు..) అయితే సమన్వయ లోపం, సాంకేతిక సమస్యల కారణంగా రైతాంగం ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దరఖాస్తుల పరిష్కారానికి చాలా సమయం తీసుకుంటోంది. దరఖాస్తుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మూడంచెల వ్యవస్థ, కలెక్టర్ల పని ఒత్తిడి లాంటి అంశాల కారణంగా ఎడతెగని జాప్యం జరుగుతుండటం, ధరణి పోర్టల్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. పోర్టల్ ద్వారా సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకే కట్టబెట్టడం ప్రధాన సమస్యగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద పారదర్శకతను తీసుకొచ్చే క్రమంలో ధరణి వ్యవస్థ ప్రస్తుతానికి బాలారిష్టాలను దాటే దశలో ఉందని, దీనిపై ప్రభుత్వం మరింత దృష్టి సారించి పనిచేస్తే వీలున్నంత త్వరలోనే వ్యవసాయ భూముల లావాదేవీలు మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త చట్టానికీ ఏడాది కాగా, గతంలో ఉన్న చట్టానికి మార్పులు చేసుకుని భూ హక్కులు, పాసుపుస్తకాల చట్టం–2020 (ఆర్వోఆర్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం కూడా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ చట్టాన్ని 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అదే ఏడాది అక్టోబర్ 28న నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకుముందు సెప్టెంబర్ 9న ఈ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సీఎం అభినందనలు ధరణి పోర్టల్ సేవలను ఏడాది కాలంగా విజయవంతంగా అమలు చేస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం, అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. ధరణి పోర్టల్ అందిస్తున్న పారదర్శక, అవాంతరాలు లేని సేవల కారణంగా ప్రజలు, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని గురువారం ఓ ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ధరణి మరిన్ని విజయాలు సాధిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ధరణిని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లు, తహశీల్దార్లను సీఎస్ సోమేశ్ కుమార్ మరొక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
ఎస్...సూపర్ పి...పోలీస్
ఎస్పీ ఏడాది పాలనలో మెరుపులు.. మరకలు మచ్చలేని ఎస్పీగా పేరు మార్కాపురం ఓఎస్డీకి దోపిడీతో సంబంధం ఉండటంతో మచ్చ రికవరీల్లో భేష్.. దొంగతనాల అదుపేదీ? పోలీస్ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి జిల్లా ఎస్పీగా చిరువోలు శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించి గురువారంనాటికి ఏడాది పూర్తవుతోంది. సమర్థ అధికారిగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన విధుల్లో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలూ లేకపోలేదు. జిల్లాలో పలువురు ఎస్సైలను, సీఐలను సస్పెన్షన్లు చేసి చార్జిమెమోలు ఇస్తూ పాలనలో తన పట్టు తగ్గలేదన్నది నిరూపించుకున్నా ఓఎస్డీతోపాటుమరో ముగ్గురు పోలీసులు కోటి రూపాయల దోపిడీ వ్యవహారంలో దొరికిపోవడం శాఖపై మాయని మచ్చ పడింది. ఎస్పీ శ్రీకాంత్ పోలీస్ సంక్షేమంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఏడాది పాలనలో ఎస్పీకి కొన్ని మెరుపులతో పాటు మరకలు అంటుకున్నాయి. సూపర్ కాప్‌గా జిల్లాలో ప్రస్థానం ప్రారంభించిన ఎస్పీ శ్రీకాంత్ రాజకీయ, వ్యవస్థాగత కారణాలతో నెమ్మదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దొంగతనాల రికవరీల్లో మెరిసినా.. జిల్లాలో కొనసాగుతున్న వరుస దొంగతనాలతో తలపట్టుకున్నారు. మొత్తానికి పోలీస్ బాస్‌గా జిల్లాలో మచ్చలేని మనిషిగా అందరి మనసు గెలిచారు. ఒంగోలు : జిల్లాకు ఎస్పీగా చిరువోలు శ్రీకాంత్ వచ్చి నేటితో ఏడాది పూర్తయింది. ఏడాది ఎస్పీ పాలనలో జిల్లాలో కొన్ని మెరుపులు, మరికొన్ని మరకలు పోలీసులు మూటగట్టుకున్నారు. సమర్థత గల అధికారిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ శ్రీకాంత్ కొన్ని పరిణామాలు, మరికొన్ని పరిస్థితులు ఆయనలో కొంత మార్పులు తీసుకొచ్చాయి. వచ్చిన తొలినాళ్లలో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు పోలీస్ విభాగంలో ఆయన ముద్ర బాగానే పడింది. పాలనలో దిట్టగా.. స్టేషన్ల వారీగా ఆకస్మిక తనిఖీలు చేసి సిబ్బందిలో కర్తవ్యదీక్షను రేకెత్తించారు. అయితే రానురాను కొందరు పోలీస్ అధికారుల పిరికితనం.. అధికార పార్టీ అండదండలు ఉన్న సిబ్బంది వెరసి తన టీమ్‌లో పటుత్వాన్ని కోల్పోయారన్న విమర్శలు గుప్పుమన్నాయి. దీనికి నాందిగా రేణంగివరం ఎస్సై విష్ణుగోపాల్ తన పిస్టోల్ మిస్‌ఫైర్ అయి మృతి చెందాడని పోలీస్ పరిభాషలో చెబుతున్నా.. ఆయన ఎస్పీ దెబ్బకు భయపడి తుపాకీతో కాల్చుకున్నాడన్న ప్రచారం జోరుగానే సాగింది. ఎస్పీగా శ్రీకాంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస ఆకస్మిక పోలీస్స్టేషన్ల తనిఖీలు, నెలలో 1, 2 దఫాలుగా సమీక్షలు నిర్వహించి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే రేణంగివరం ఎస్సై ఉదంతం నుంచి ఎస్పీ దూకుడులో కొంత ఊపు తగ్గిందన్న ప్రచారం జోరందుకుంది. జిల్లాలో అవినీతి మరకలు అంటుకున్న ఆరుగురు ఎస్సైలను సస్పెండ్ చేశారు. మరికొంత మంది ఎస్సైలు, సీఐలకు చార్జిమెమోలు కూడా ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీ వైఎస్సార్సీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై టీడీపీ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు వెంకటేష్ తమ అనుయాయులతో సాక్షాత్తు ప్రకాశం భవన్‌లోని సమీక్ష హాలు వద్దే దాడి చేశారు. అప్పట్లో పోలీసులు తూతూమంత్రంగా పలువురిని అదుపులోకి తీసుకొని, అసలు దాడికి కారకులైన టీడీపీ అధినాయకులను ఇంత వరకు పట్టించుకోలేదు. ఒంగోలు నగరంలో జోరుగా దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒంగోలులో ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు 10కిపైగా దొంగతనాలు జరిగాయి. ప్రజలు లక్షల విలువైన ఆభరణాలు, నగదు నష్టపోయారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. రికవరీలు బాగానే ఉన్నా దొంగతనాల అదుపులో సిబ్బందిని అప్రమత్తం చేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొరిశపాడుకు చెందిన కొప్పర్తి సూర్యం మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లి ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ఎన్కౌంటర్లో మృతి చెందారు. అప్పటి వరకు జిల్లాలో మావోయిస్టుల్లేరని నిఘా విభాగాలన్నీ కోడై కూశాయి. చివరకు సూర్యం మృతితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. న పోలీసుల సంక్షేమంలో కూడా ఎస్పీ ప్రధాన పాత్ర పోషించారు. ముందెన్నడూ ఏ ఎస్పీ చేపట్టని సంక్షేమ కార్యక్రమాలను పోలీసులు, పోలీస్ కుటుంబాలకు కల్పించి అందరికీ దగ్గరయ్యారు. పోలీస్ కుటుంబాలు, పోలీస్ పిల్లలకు సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించి ఆయా కుటుంబ సభ్యులతో ఎస్పీ కుటుంబ సభ్యులు కలిసిపోయారు. శాఖాపరంగా మరక.. ఈ ఏడాది మే 14వ తేదీ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ ఉదంతం జిల్లాలో పోలీస్ ప్రతిష్ఠను దెబ్బతీసింది. మార్కాపురం ఓఎస్డీ సి. సమైజాన్‌రావు వద్ద పని చేస్తున్న ముగ్గురు క్యాట్ పార్టీ పోలీసులు కావలికి చెందిన బంగారు వ్యాపారులను బెదిరించి రూ.89 లక్షలు దోపిడీకి పాల్పడ్డారు. నెల్లూరు పోలీసులు వారిని వెంబడించి పట్టుకోవడంతో వారు స్పెషల్ పార్టీ పోలీసులని తేలింది. ఈ బృందానికి ఓఎస్డీ సి.సమైజాన్‌రావు నేతృత్వం వహిస్తున్నాడని వెల్లడైంది. దీంతో జూన్ 15న ఆయన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు డంప్‌లో దొరికిన ఒక తపంచా ఈ స్పెషల్ పార్టీ పోలీసుల వద్ద లభ్యం కావడంతో వీరి అరాచకాలు ఎంతకాలం నుంచి ఎన్ని రకాలుగా సాగాయో.. పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. సాంకేతికంగా మెరుపు పోలీసులను సాంకేతికపరంగా అభివృద్ధి పరచటంతో పాటు జిల్లాలో ఐ-క్లిక్ కేంద్రాల ఏర్పాటుకు ఎస్పీ కృషి చేశారు. ప్రజలకు పోలీస్స్టేషన్లతో పని లేకుండా నేరుగా ఐ-క్లిక్ కేంద్రాల నుంచే ఫిర్యాదు చేసుకునే విధంగా అవకాశం కల్పించిన ఘనత ఎస్పీ శ్రీకాంత్‌కే దక్కింది.