ongole cattle
-
Ongole Cattle: పౌరుషాల గిత్తకు ఊపిరి!
నడకలో రాజసం.. పోటీల్లో పౌరుషం.. రూపంలో భారీ కాయం.. ఇదే ఒంగోలు గిత్త తేజసం. ప్రకాశం జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఒంగోలు జాతి పశువుల అభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటు చేసిన చదలవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రం లక్ష్యం దిశగా అడుగులేస్తోంది. మూడేళ్ల ముందు వరకు నిర్వీర్యమైన ఈ క్షేత్రం క్రమేపీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. మేలైన పశువుల ఉత్పత్తిని పెంచి, సంరక్షించే దిశగా అడుగులేస్తోంది. ఇందు కోసం సెమన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. నేరుగా పిండాలను (యాంబ్రియో) ఉత్పత్తి చేసేలా సాంకేతికతను వినియోగిస్తున్నారు. పశు ఉత్పత్తి క్షేత్రంలో అన్ని మౌలిక వసతులు సమకూరుతున్నాయి. నాగులుప్పలపాడు: చదలవాడలో 198 ఎకరాల్లో మూడు దశాబ్దాల క్రితం ఒంగోలు జాతి పశుఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చీమకుర్తికి గ్రానైట్ పరిశ్రమ వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి క్షేత్రం ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయ భూములను కొనుగోలు చేసి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి పేరుకు క్షేత్రం నడిచినా.., పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం నుంచి సహకారం లభించడం, అధికారులు అంకితభావంతో పనిచేస్తుండడంతో ఆ ఫలాలు కనిపిస్తున్నాయి. రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు: క్షేత్రంలో గడచిన రెండు మూడేళ్లలో సుమారు రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. పశువుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రూ.2 కోట్లతో 4 నూతన షెడ్లు ఏర్పాటు చేశారు. పాలన అవసరాల కోసం రూ.70 లక్షలతో నూతన పరిపాలన భవనం నిర్మించారు. వీటితో పాటు మరో రూ.40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల ఏర్పాటుతో పాటు క్షేత్రం మొత్తం రూ.10 లక్షలతో సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇంతే కాకుండా గోచార్ పథకంలో క్షేత్రంలో భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.52 లక్షలు కేటాయించారని, వీటిని త్వరలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన పశువుల ఉత్పత్తి: క్షేత్రంలో 292 పశువులుండగా, వీటిలో పాలిచ్చే ఆవులు 72, చూడివి 54, ఒట్టి ఆవులు 24, మిగిలినవి మూడేళ్లలోపు లేగదూడలున్నాయి. గతంలో ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో జాతి ఆవులే అయినా..నాణ్యత తక్కువగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా వస్తున్న లేగదూడలు ఒకింత ఆరోగ్యంగా పెరుగుతుండడంతో క్రమేపీ ఆవుల్లో నాణ్యత పెరుగుతోంది. నాణ్యత తక్కువ ఉన్న పశువులు వేలం ద్వారా విక్రయిస్తుండడంతో మరింత నాణ్యమైన పశువులను క్షేత్రంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు జాతి ఆవుల నుంచి వచ్చే కోడెదూడలను ఆరు నెలల వరకు పెంచి రైతుల కోసం వేలం వేసి ఇస్తారు. గ్రాసం కొరతను అధిగమించి... మూడేళ్ల క్రితం క్షేత్రానికి గ్రాసం కొరత తీవ్రంగా ఉండేది. దాదాపు 200 ఎకరాల నాణ్యమైన భూమి ఉన్నప్పటికీ సరిగా వినియోగించుకోలేకపోయేవారు. ప్రస్తుతం ఆ కొరతను క్షేత్రం అధిగమించింది. బహువార్షిక గ్రాసాలు ఏడాది పొడవునా క్షేత్రంలో సాగు చేస్తున్నారు. దీనికి తోడు మాగుడు గడ్డి నిల్వకు ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి ముందుగానే నిల్వ ఉంచుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 1600 టన్నుల సైలేజ్ గడ్డిని అందించింది. దీంతో క్షేత్రం గ్రాసం కొరతను అధిగమించింది. సమకూరిన వసతులు: నిన్నమొన్నటి వరకు మౌలిక వసతులు లేక కునారిల్లిన క్షేత్రంలో ఇప్పుడు భవనాల సమస్య తీరింది. పాలన భవనం కొత్త హంగులతో ఆహ్లాదంగా సిద్ధమైంది. అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా గతంలో ఉన్న డ్రైవర్ క్వార్టర్లను అభివృద్ధి చేసి సిబ్బందికి అందుబాటులో ఉంచారు. క్షేత్రంలో అంతర్గత రహదారులు, ప్రహరీ నిర్మాణం పూర్తయ్యింది. ఇక మేలైన ఆవుల నుంచి అండాల సేకరణ కోసం గుజరాత్ నుంచి ప్రత్యేకంగా మిషన్‌ను కూడా తీసుకొచ్చారు. సేకరించిన అండాలను నిల్వ చేసేందుకు ల్యాబ్‌ను అభివృద్ధి చేశారు. పశువుల బరువును కూడా ప్రతి వారం తీసుకొని రికార్డులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ లాం ఫాం నుంచి తీసుకొచ్చిన సెమన్‌ను రైతుల కోసం అందుబాటులో ఉంచగా, భవిష్యత్‌లో నేరుగా పిండాలను (యాబ్రియో) కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవుపాలు పాలు, గోమూత్రంను నామమాత్రపు రుసుంతో రైతుల అవసరాల కోసం అందిస్తున్నారు. ఇంకా మిగిలిన సమస్యలివే... ఆవుల నాణ్యతను పెంచినప్పటికీ, కనీసం ఒక జత ఒంగోలు గిత్తలను ప్రదర్శన కోసమైన పెంచాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఎద్దు ఒక్కటి కూడా లేదు. భవిష్యత్‌లో దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. క్షేత్రంలో భూగర్భ జలంలో ఫ్లోరైడ్ అధికంగా ఉంటోంది. దీన్ని అధిగమించేందుకు క్షేత్రంలోనే రెండు చెరువుల ద్వారా పశువులకు తాగునీరు అందిస్తున్నారు. అయితే ఆవులు బయటకు వెళ్లకపోతే ఫ్లోరైడ్ నీటితోనే వాటి దాహం తీర్చాల్సి వస్తోంది. దీంతో పశువుల నాణ్యతపై ప్రభావం పడుతోంది. త్వరలో ఉన్నతమైన ఫాంను చూస్తాం ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే పశుక్షేత్రంలో చాలా మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికి తోడు సిబ్బంది పనితీరుతో పశువుల నాణ్యత కూడా పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పశువుల నాణ్యత పరిశీలన కోసం ఇప్పటికే ప్రతి పశువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటికి సంబంధిత రికార్డులు తయారు చేస్తున్నాం. ఇలాగే త్వరలో మన ఖ్యాతిని పెంచే ఒంగోలు జాతి సంపదతో కూడిన అత్యున్నతమైన ఫాంను తయారు చేయడానికి కృషి చేస్తున్నాం. – బి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్, పశుక్షేత్రం -
ఫలించిన ఒంగోలు ఎంపీ వైవీ కృషి
ఒంగోలు జాతి పశుసంపద పరిరక్షణకు బ్రెజిల్ సంసిద్ధత ఒంగోలు టూటౌన్: ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. పశుసంపద వృద్ధికి ఎంతోకాలంగా బ్రెజిల్ అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఇచ్చేందుకు ఆ దేశం అంగీకరించింది. అందులో భాగంగా బ్రెజిల్లో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు జరిగే ‘ఎపోజెబ్ ఎక్స్పో’కు హాజరవ్వాలంటూ ఎంపీ వైవీకి ఆహ్వానమందింది. ఆహ్వాన పత్రికను బ్రెజిల్ దేశ ప్రతినిధి డాక్టర్ జోస్ ఓటాలియా లెవ్రోస్ గురువారం హైదరాబాద్‌లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలసి అందజేశారు. ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి బ్రెజిల్ శాస్త్రవేత్తలు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అందించాలని గతేడాది నవంబర్ 14న ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రిని న్యూఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ‘ఎపోజెబ్ ఎక్స్పో’కు హాజరవ్వాలని ఎంపీ వైవీకి బ్రెజిల్ ఆహ్వానం పంపింది. పశుసంపద అభివృద్ధికి బ్రెజిల్ వినియోగించే శాస్త్ర సాంకేతిక పరికరాల్ని ఎక్స్‌పోలో ప్రదర్శిస్తారు. ఈ ఎక్స్‌పోలోనే భారత ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకునేందుకు బ్రెజిల్ సిద్ధంగా ఉందని ఎంపీ తెలిపారు. ఎక్స్‌పోకు కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావును కూడా ఆహ్వానించారన్నారు. -
మసకబారుతున్న 'రాజసం'
బ్రిటీషు వారు భారత్‌లో పాగా వేశారుదొరికినవన్నీ దోచుకుపోయూరు..విలువైన కోహినూర్, నెమలి సింహాసనాన్నీ విడవలేదు.. ... చలి దేశాల్లో ఉండే తెల్లదొరసానులు మళ్లీ భారత్‌వైపు చూశారు సరోగసీ.. అంటూ బేరాలు ఆడుతున్నారు విదేశీయుల కణాలను మన మహిళల గర్భాల్లో దాచి పిల్లలను ఎత్తుకుపోతున్నారు దీని వెనుక పెద్ద మాఫియూ కూడా నడిచేలా చేస్తున్నారు.. ... ఇప్పుడు మనుషులనే కాదు.. పశువులనూ వదలడంలేదు! ఎంతో విశిష్ట లక్షణాలున్న ఒంగోలు జాతి పశుసంపదపై కన్నేశారు ఈ జాతి కృత్రిమ పిండాలను ఎత్తుకెళ్లే పథకం రచించారు దీనికి భారత్‌తో బ్రెజిల్ ఒప్పందం చేసుకుంది.. మరి మనకు ఒంగోలు జాతి పశువులు అవసరంలేదా?..ఇంకా అవి కనిపించవా? ప్రపంచ వ్యాప్తంగా జిల్లాకు గుర్తింపు తెచ్చిన ఒంగోలు జాతి పశుసంపద అంతరించే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ విధానాల వల్ల నాటి ‘రాజసా’నికి గ్రహణం పట్టే గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నారుు. ఒంగోలు జాతి గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్‌కు ఎగుమతి చేసే ఒప్పందం జరగడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని పరిరక్షించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల పార్లమెంట్లో ప్రస్తావించారు. శనివారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిసి కృత్రిమ పిండాలను బ్రెజిల్‌కు ఎగుమతి చేయవద్దని కోరారు. దేశవాళీ గేదెల ప్రోత్సాహంతో.. పశుసంవర్థక శాఖ ముర్రా జాతి దున్నలతో దేశవాళీ గేదెల అభివృద్ధిని ప్రోత్సహించింది. 1975లో జిల్లాలో పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటలు పెరిగాక పశుగ్రాసం సమస్య పెరిగింది. కొన్నేళ్లుగా పశుపోషణ వైపు రైతులు మొగ్గు చూపుతున్నప్పటికీ ఒంగోలు జాతి ఆవుల పోషణ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఒంగోలు జాతి గేదెల అభివృద్ధికి భారత పరిశోధనా మండలి, గుంటూరు లాం ఫారం, కేంద్రంగా 1987లో అనుబంధ పరీక్షా పథకం ఏర్పాటు చేశారు. రామతీర్థం (ప్రకాశం), చింతలదేవి (నెల్లూరు), మహానంది (కర్నూలు) ఈ పరిశోధనా కేంద్రానికి అనుబంధంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 1980లో ప్రారంభించిన రామతీర్థం క్షేత్రాన్ని చదలవాడకు మార్చారు. ఎగుమతులు ఎప్పుడో ఆరంభం.. కేవలం పాలు, వ్యవసాయ పనులకే కాదు.. చూడ్డానికి కూడా ఒంగోలు జాతి పశువులు ఎంతో అందంగా ఉంటారుు. 1875లో బ్రెజిల్ దేశస్తులు మొట్టమొదటిసారిగా కొన్ని పశువులను తీసుకెళ్లారు. 1900 నుంచి 1920 వరకు రెండు వేల పశువులను దిగుమతి చేసుకుంది. 1921లో పశువులకు పారుడు వ్యాధి రావడంతో 1930 వరకు దిగుమతి నిలిపివేశారు. 1962 నుంచి బ్రెజిల్.. భారత్ నుంచి 6 వేల వరకు ఒంగోలు జాతి పశువులను దిగుమతి చేసుకున్నారు. వీటి మాంసాన్ని విదేశీయులు ఇష్టపడేవాళ్లు. అమెరికా, మెక్సికో, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ పశు సంపద ఉంది. ఒంగోలు సమీపంలోని కరవదికి చెందిన ఎద్దు అఖిల భారత పశు ప్రదర్శనలో తొలిసారిగా షో ఛాంపియన్‌గా ఎన్నికైంది. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ ఎద్దుల యజమానిని సత్కరించారు. బ్రెజిల్ దేశస్తులు రైతుకు లక్ష రూపాయలు ఇచ్చి తమ దేశానికి తీసుకెళ్లారు. అలా వాటి ఎగుమతి ప్రారంభమైంది. 1994లో గుంటూరు లాంఫారంలో రాష్ట్రస్థాయి పశు ప్రదర్శన ప్రారంభమైంది. పర్చూరు మండలం బోడవాడ రైతు ముప్పాళ్ల వెంకటేశ్వర్లుకు చెందిన ఆంబోతుకు ‘షో’ ఛాంపియన్ దక్కింది. ఇతర రాష్ట్రాల్లో కూడా మన కోడెలు సత్తా చాటారుు. ఇక్కడ ఆదరణ తగ్గినా బ్రెజిల్ దేశీయులు అధునాతన పద్ధతుల్లో పోషించి రికార్డులు సృష్టిస్తున్నారు. వారసత్వ సంపద ఒంగోలు జాతి గిత్తలు సేద్యానికి.. ఆవులు అధికపాల దిగుబడికి ప్రసిద్ధిగాంచాయి. నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పశువులు తెలుగు ప్రజల సంస్కృతీ వారసత్వ జీవనాన్ని ప్రతిబింబించాయి. మహారాజు ఠీవీ.. హుందాతనం, పౌరుషం ఉట్టిపడతూ రైతులకు కల్పతరువుగా సేవలందించారుు. బరువులు మోయడంలో ఏ జాతి పశువులు పోటీపడలేవు. ఒకప్పుడు టంగుటూరు మండలంలోని నాయుడుపాలెం చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ఇంటిలో చూసినా ఒంగోలు జాతి పశువులు కనపడేవి. కాలక్రమంలో కనుమరుగయ్యూరుు. బరువు చూస్తే దిమ్మతిరగాలి.. 1997లో ఒంగోలు దూడ ఏడాది వయసులోనే 645 కిలోల బరువుతో రికార్డు సృష్టించింది. ఒంగోలు ఆబోతు 52 నెలల సమయంలో 1325 కిలోల బరువుతో మరో రికార్డు సాధించింది. ఆవు 39 నెలలప్పుడు 858 కిలోల బరువు తూగి బ్రెజిల్లో జాతీయ రికార్డు సాధించింది. ఇన్ని రికార్డులున్న పశు సంపదను.. ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడంలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలి. నాటి మద్రాసుకు పాల భాండాగారంగా.. 1950 దశకంలో మద్రాసు నగరానికి పాలు అందించడంలో ఒంగోలు జాతి ఆవులు కీలకపాత్ర పోషించాయి. ఒక్కో ఆవు రోజుకు 7 నుంచి 8 లీటర్ల పాలు అందించేవి. 1966 నాటికి ఒక్కో ఈతకు పది నెలల్లో రెండువేల లీటర్ల పాలిచ్చే ఆవులుండేవని చెబుతారు. ఆ తరువాత ఒంగోలు జాతి పశువుల పోషణ భారమైంది. 1970 తరువాత పాల ఉత్పత్తుల్లో కొత్త శకం ఆరంభమైంది. వెన్న శాతం బట్టి ధర ఇవ్వడం మొదలుపెట్టాక పాల దిగుబడి ఎక్కువగా ఇచ్చే గేదెలు రావడంతో ఆవులను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒంగోలు గిత్త అంటే ప్రకాశం జిల్లాకే అంతర్జాతీయ గుర్తింపు. ఉట్టిపడిన రాజసం ... నడిస్తే ఠీవీ, గంభీరత, పౌరుషం కలిగలిపితే రంకెవేసే నిలువెత్తు గిత్త. విశిష్ట లక్షణాలతో వెలుగొందే ఒంగోలు పశు జాతి అంతరించనుందా? ప్రభుత్వాల విధానాలు, ఆ జాతి పట్ల చూపిస్తున్న నిర్లిప్తత చూస్తే అవుననే చెబుతున్నాయి. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల పార్లమెంట్లో కూడా తన వాణి వినిపించారు. శనివారం కూడా ఆయన కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్‌కు ఎగుమతి చేయవద్దని కోరారు. బ్రెజిల్ వ్యవసాయ శాఖా మంత్రిని అభ్యర్థించారు.