online regestration
-
దశల వారీగా ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: దేశంలో ఈ–ఎఫ్ఐఆర్ల (ఎల్రక్టానిక్ ప్రాథమిక సమాచార నివేదిక) రిజి్రస్టేషన్ ప్రక్రియను దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని లా కమిషన్ సూచించింది. ఈ మేరకు తన నివేదికను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. తొలుత మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే నేరాల్లో ఈ–ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని వెల్లడించింది. ఈ–ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్ కోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత జాతీయ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది. -
కోవిన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్‌కు తీవ్ర ఇక్కట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్రమణకు ముకుతాడు వేసేందుకు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్ మూడోదశకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్‌కు అనుమతించగా... రద్దీ కారణంగా నమోదు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు ఒక్కసారిగా ప్రయత్నించడంతో కోవిన్ పోర్టల్ క్రాష్ అయ్యింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్‌లోనూ ప్రజలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. కోవిన్ సైట్ నిమిషానికి దాదాపు 27 లక్షల హిట్లు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారీ ట్రాఫిక్ కారణంగా రిజిస్ట్రేషన్‌కు ప్రజలు ఇక్కట్లు పడ్డారు. రాష్ట్రాలు, ప్రైవేటు టీకా కేంద్రాలు అందుబాటులో ఉంచిన స్లాట్ల ఆధారంగా టీకా సమయాన్ని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. అయితే కొద్దిగంటల తర్వాత కోవిన్ పోర్టల్‌పై లోడ్ తగ్గిన అనంతరం ప్రజలు తమపేరు నమోదు చేసుకోగలిగారు. అయినప్పటికీ వారి ప్రాంతం ఆధారంగా స్లాట్ బుకింగ్‌కు మాత్రం అవకాశం ఇంకా ఇవ్వలేదు. టీకాల లభ్యత ఉంటేనే... వ్యాక్సిన్ వేయించుకోవాలనుకొనే 18 ఏళ్లు నిండిన వారికి ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ కేంద్రాలు అందుబాటులో ఉంచే స్లాట్ల లభ్యత ఆధారంగా మాత్రమే అపాయింట్మెంట్లు లభిస్తాయి. అంటే వ్యాక్సిన్లు లభ్యంగా ఉండి... మే 1 నుంచి టీకాలు వేయడానికి సిద్ధం గా ఉన్న కేంద్రాల ఆధారంగా మాత్రమే ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు. ఆర్డర్లు పెట్టి నా సరే.. పలు రాష్ట్రాలు, ప్రైవే టు ఆసుపత్రులకు టీకాలు అందడానికి సమయం పడుతుందని ఫార్మారం గ నిపుణులు అంటున్నారు. మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టీకాల లభ్యత లేనందున మే 1 నుంచి 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయడం సాధ్యం కాదనే చెబుతున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన అనేకమంది సోషల్‌మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. కోవిన్ పోర్టల్ స్పందించడం లేదని కొందరు, సైట్ క్రాష్ అయ్యిందని మరికొందరు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. అయితే కోవిన్ పోర్టల్ పనిచేస్తోందని, సాయంత్రం 4 గంటలకు సైట్లో వచ్చిన చిన్న లోపం పరిష్కారం అయ్యిందని ఆరోగ్య సేతు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సాయంత్రం 4.35 గంటలకు ఒక ట్వీట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలు వ్యాక్సినేషన్ సెషన్లను షెడ్యూల్ చేసిన తర్వాత 18+ వారికి వ్యాక్సిన్ అపాయింట్మెంట్లు సాధ్యమవుతాయని సాయం త్రం 4.54 గంటలకు ఆరోగ్యసేతు యాప్ నుంచి ట్వీట్ వచ్చింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలే అందుబాటులో ఉన్నాయి. కేంద్రం ఇటీవలే రష్యాకు చెందిన స్పుత్ని క్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించి విషయం తెలిసిందే. మరికొద్ది వారాల్లో స్పుత్నిక్ కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇతర విదేశీ వ్యాక్సిన్లకు కూడా అత్యవసర వినియోగానికి వేగంగా అనుమతులు ఇచ్చే ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది. సాఫీగానే జరిగాయి: ఆరోగ్యశాఖ ప్రజలు సోషల్‌మీడియాలో చేసిన ఫిర్యాదులు, మీడియా రిపోర్టులపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం రాత్రి వివరణ ఇచ్చింది. రిజిస్ట్రేషన్లు సాఫీగానే జరిగాయని తెలిపింది. తొలిరోజు బుధవారం 4 నుంచి 7 గంటల మధ్యలో 80 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది. ఆరంభంలో నిమిషానికి 27 లక్షల హిట్లు వచ్చాయని... తర్వాత ప్రతిసెకనుకు 55 వేల హిట్లు వస్తున్నాయని, కోవిన్ పోర్టల్ సాఫీగా, సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ల వివరాలను కోవిన్ పోర్టల్‌లో పెడతామని పేర్కొంది. -
ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్న కేసీఆర్
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ వ్యాప్తంగా ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు కీలక సంస్కరణల్లో భాగంగా గ్రామ స్థాయి నుంచి నివాస వివరాలను గ్రామ అధికారులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తులను నమోదు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆస్తుల వివరాలను శనివారం సీఎం స్వయంగా వెల్లడించారు. గృహ వివరాలతో పాటు వ్యవసాయేతర వివరాలను ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్‌కు తెలియజేశారు. తనకున్న ఆస్తి వివరాల పత్రాలను చూపెట్టి ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. సాధారణ పౌరుడిగానే అంగు ఆర్భాటాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులను వివరించారు. ఈనెల 15లోపు ప్రతిఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు. (వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ, పుర ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకే ఈ కార్యక్రమం. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద ప్రయత్నం. సాగుభూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తాం’’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రత కల్పించేందుకు వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం స్థిరాస్తుల వివరాలను విధిగా నమోదు చేసుకోవాలన్నారు. ఆస్తుల నమోదు అనేది దేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రయత్నమని చెప్పారు. సాగు భూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరోవైపు దసరా నాటికి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం కార్డ్ విధానంలో అమలవుతున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని ధరణి పోర్టల్‌లోకి మార్చే ప్రక్రియలో సబ్ రిజిస్ట్రార్లు బిజీగా ఉన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సర్వే నంబర్, ఇంటి నంబర్లవారీగా భూములు, ఆస్తుల విలువలను వాటి ఎదుటి కాలమ్‌లో నమోదు చేస్తున్నారు. రెండు వారాల క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి కానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక సంస్థలు కూడా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల నమోదు ప్రక్రియను ‘ధరణి’లోకి అప్లోడ్ చేసే ప్రక్రియను సమాంతరంగా చేపడుతున్నాయి. -
‘భగీరథ’ వివరాలు ఇకపై ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సురేందర్ రెడ్డి ఆదేశించారు. ఆన్లైన్ నివేదికలను మాత్రమే ఇకపై ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అన్ని జిల్లాల మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మరింత పారదర్శకత కోసమే భగీరథ పనులన్నింటినీ ఆన్లైన్ చేశామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగం గుర్తించిన సంస్థల నుంచే ఎయిర్ వాల్వ్, ఫ్లో కంట్రోల్ వాల్వ్‌తో పాటు ఇతర పరికరాలు కొనుగోలు చేసేలా వర్క్ ఏజెన్సీలను పర్యవేక్షించాలన్నారు. డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు నీళ్లివ్వాలంటే ఇంతకు రెట్టింపు ఫలితాలను సాధించాలని ఆదేశించారు. -
హజ్‌యాత్రకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : హజ్ యాత్రకు వెళ్లేవారు ఈ నెల 24 లోపు ఉర్దూ అకాడమీ కంప్యూటర్ కేంద్రాలలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ జమీర్‌అహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం, కదిరి, తాడిపత్రి ఉర్దూ అకాడమీ కేంద్రాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. ఠీఠీఠీ.జ్చ్జిఛిౌఝఝజ్టీ్ట్ఛ్ఛ.జౌఠి.జీn వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. స్వీయ దరఖాస్తు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌బుక్, బ్లడ్ గ్రూప్, రూ.300 చలానా(ఎస్బీఐ, యూబీఐలలో తీసిన)లతో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 85199 62155(అనంతపురం), 94411 78900(కదిరి), 94902 50133(తాడిపత్రి) నెంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఆర్మీ ర్యాలీలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జలంధర్: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలకు నిరుద్యోగులు పోటెత్తుతుండడంతో ఇకపై ఈ నియామకాలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్ణయించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ర్యాలీలకు వచ్చే అభ్యర్థులు ముందుగా సైన్యానికి చెందిన రిక్రూట్మెంట్ వెబ్సైట్ joinindianarmy.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సైనిక నియామకాల డీజీ లెఫ్ట్టినెంట్ జనరల్ ఆర్ఎన్ నాయర్ బుధవారం కపుర్తలలో తెలిపారు. ఆర్మీ ర్యాలీలకు అభ్యర్థులు పెద్ద ఎత్తున వస్తుండటంతో లాఠీచార్జి చేయాల్సి వస్తోందని, ఇబ్బందులను నివారించేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులనే పరిమిత సంఖ్యలో ఆయా తేదీల్లో నియామకాలకు పిలుస్తామన్నారు.