online website
-
అరచేతిలో పుస్తక విప్లవం
ఆన్లైన్లో తక్కువ ధరకే పుస్తకాలు అమ్మడానికి, దానం చేయడానికి కూడా అందుబాటులో వెబ్సైట్లుసమాచార, సాంకేతిక రంగంసమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఇటీవలి కాలంలో అన్ని రంగాలనూ శాసిస్తోన్న సాంకేతికత విద్యా రంగాన్ని కూడా ఏలుతోంది. మనకు అవసరమైన పుస్తకాలు కావాలంటే బుక్స్టాల్స్ఆర్డర్ ఇవ్వడం, అవి వచ్చే వరకూఎదురు చూడడం ఇక చరిత్రగామిగిలిపోనుంది. అన్ని రకాల పుస్తకాలు నేడు ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులోకి వస్తున్నాయి. మరికొన్ని పుస్తకాలు ఒక్క క్లిక్‌తో తక్కువ ధరకే అంటే సుమారు 50 శాతం వరకూ తగ్గింపు ధరతో గుమ్మం ముందు వాలిపోతున్నాయి. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : నేడు సివిల్స్, ఐఐటీ. నీట్, జేఈఈ, గ్రూప్స్, స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఇలా ఎటువంటి ఉన్నత విద్యకు అవసరమైన పుస్తకం కావాలన్నా ఆన్లైన్లో అందుబాటులో ఉంటోంది. అలాగే ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏలతో పాటు చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఎకనామిక్స్, గణితం, ఇంగ్లిష్, సైన్స్, సాహిత్యం వంటి పుస్తకాలు కూడా ఆన్లైన్ సోధనతో వివరాలు క్షణాల్లో మనముందు ప్రత్యక్షమైపోతున్నాయి. కేజీ టు పీజీ.. కేవలం ఉన్నత చదువులకే వెబ్సైట్లు పరిమితం కాలేదు. ఆయా వెబ్సైట్లు కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థుల వరకూ అవసరమైన పుస్తకాలను తమలో నిక్షిప్తం చేసుకున్నాయి. ఆఖరికి ప్రీ కేజీ, ప్రీ స్కూల్ చిన్నారులకు కూడా అవసరమైన పుస్తకాలు, కేవలం పాఠ్య పుస్తకాలే కాక వారిలో వివిధ అంశాల్లో చైతన్యం తీసుకువచ్చే సామెతలు, పొడుపు కథలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, ఉన్నత స్థానాలు అధిరోహించిన వ్యక్తుల వైఫల్యాలు, విజయగాథలు, వ్యిక్తిత్వ వికాస పుస్తకాలు, ఆర్ట్స్, క్రాఫ్టŠస్ నేర్పే పుస్తకాలు ఆయా వెబ్సైట్లలో దొరుకుతున్నాయి. దేనికైనా రెడీ.. వివిధ కోర్సులు చదివే విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఎటువంటి సేవ చేయడానికైనా సిద్ధంగా ఉంటోంది. వారికి కావాల్సిన పుస్తకాలను అందచేయడానికే కాక వారి వద్ద ఉన్న పుస్తకాలను అమ్ముకోవడానికి, ఇతరులు చదివి మిగిలిపోయిన పుస్తకాలను సగం ధరకే అందచేయడానికి, ఇతరుల వద్ద ఉన్న పుస్తకాలను తమకు, తమ వద్ద ఉన్న పుస్తకాలను ఇతరులకు మార్చుకోవడానికి (ఎక్సేంజ్), బాగా ఎక్కువ ధర ఉన్న పుస్తకాలు అద్దెకు తీసుకోవడానికి అవసరమైన సౌకర్యాలను అందిస్తోంది. దీనితో పాటు తాము చదివి తమ వద్ద వృథాగా ఉన్న పుస్తకాలను దానం చేయాలన్నా కూడా ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లు పనిచేస్తున్నాయి. ఆన్లైన్లో పుస్తకాలు అందించే కొన్ని వెబ్సైట్లు.. తమకు కావాల్సిన పుస్తకాలను ఆన్లైన్లో వెతకడానికి కొన్ని వెబ్సైట్ల వివరాలు ఇవి. అమెజాన్ యూజ్డ్ బుక్ స్టోర్స్, బకెట్ బోల్ట్, యువర్ బుక్ స్టాల్, యో బుక్స్, సెల్ బై బుక్, ఆల్ బుక్స్ ఆన్లైన్, బుక్ అడ్డా, మై కాలేజ్ అడ్డా, బుక్స్ నెటవర్క్, స్టూడెంట్ డెస్క్, శ్వాప్ ద బుక్, బుక్ మై బుక్, బుక్ సెల్ బై, కితాబి వంటి వెబ్ సైట్ల కొన్ని మాత్రమే ఇవి కాక సెకండ్ హ్యాండ్ పుస్తకాల కోసం సెకండ్ హ్యాండ్ బుక్స్ ఇండియా వెబ్సైట్లో శోధించవచ్చు. తమ వద్ద ఉన్న పుస్తకాలను దానం చేయడానికి బడ్జెట్ రీడ్స్, బుక్ చోర్ వెబ్సైట్లను సంప్రదించవచ్చు. తమ వద్ద ఉన్న పుస్తకాలను విక్రయించడానికి బుక్ సెల్లింగ్ హౌస్, పుస్తకాలు అద్దెకు కావాలంటే పుస్తక్ ఖోష్ వంటి వెబ్సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. -
వెబ్సైట్ తెరుచుకోనంటోంది...!
‘ఓటు హక్కుకు అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి...అర్హత ఉంటే క్షణాల్లో ఓటు హక్కు కల్పిస్తాం..., ఇందుకు ఆన్లైన్లో, బూత్ స్థాయిలో కూడా నమోదుకు అధికారులు ఉంటారు...’ ఇవన్నీ ఎన్నికల అధికారులు కొద్ది నెలలుగా చెబుతున్న మాటలు. వారి మాటలు నమ్మి అర్హత కలిగిన వారంతా ముందుకొచ్చారు. ఓటరు నమోదుకు దరఖాస్తులు ఇచ్చారు. కాని ఆ దరఖాస్తులన్నీ ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలోనే మగ్గిపోతున్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. చీపురుపల్లి: ఓటరు నమోదుకు అవసరమైన ఈఆర్ఎమ్ఎస్ అనే వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. నిన్న కాదు మొన్న కాదు గత ఏడాది డిసెంబరు 1 నుంచి ఈ వెబ్సైట్ తెరుచుకోలేదు. దీంతో ఓటరు నమోదు లేదు, నమోదైన వారికి గుర్తింపు కార్డులు రావడం లేదు. మరో 24 గంటల్లో జాతీయ ఓటర్లు దినోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతుంటే అదే సమయంలో ఓటరు నమోదుకు అవసరమైన వెబ్సైట్ తెరుచుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎన్నికల కమిషన్ వెబ్సైట్ తెరుచుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఓటరు నమోదుపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన తరువాత ఇలా వెబ్సైట్లు పని చేయకుండా చేస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు సైతం అవస్థలు పడాల్సి వస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేల ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ కాకపోతే వారంతా తమను నిలదీస్తారనే ఆందోళనలో అధికారులు ఉన్నారు. అంతేకాకుండా 2017 జూన్ నెల తరువాత కొన్ని ఓటరు నమోదు దరఖాస్తులు ఆన్లైన్ చేశారు. అయితే జాబితాల్లోకి వారి ఓటు హక్కు వచ్చినప్పటికీ గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నా వెబ్సైట్ పని చేయకపోవడంతో వారంతా గుర్తింపు కార్డులకు దూరమవుతున్నారు. డిసెంబరు 1 నుంచి వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో ఒక్క చీపురుపల్లి మండలంలోనే 700 దరఖాస్తులు ఆన్లైన్ చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్క మండలంలోనే వందల సంఖ్యలో దరఖాస్తులు ఇలా ఉంటే జిల్లాలో ఇంకెన్ని దరఖాస్తులు ఉండిపోయి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వెబ్సైట్ తెరుచుకోవడం లేదు... ఓటరు నమోదుకు సంబంధించిన ఈఆర్ఎమ్ఎస్ వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. గత ఏడాది డిసెంబరు 1 నుంచి అదే పరిస్థితి నెలకొంది. చీపురుపల్లి మండలంలోనే 700 దరఖాస్తులు వరకు నమోదుకు సిద్ధంగా ఉన్నాయి. వెబ్సైట్ తెరుచుకుంటే తక్షణమే ఆన్లైన్ చేస్తాం. –రమణమ్మ, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్, చీపురుపల్లి -
ఆన్లైన్ మోసానికి బలయ్యాడు
-
ఇక నేరుగా పాఠశాలలకే సన్నబియ్యం
భువనగిరి: విద్యార్థులకు అందజేసే సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పాఠశాలలకే బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంలో నల్లగొండ జిల్లాలో తొలిసారిగా ఈ విధానాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్ వెబ్సైట్ రూపొందించి విద్యార్థుల సంఖ్య, వారికి అవసరమైన బియ్యం వివరాలు తెలుసుకుని దానికి అనుగుణంగా సరఫరా చేస్తారు.