OPCW
-
నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్న 'ఓపీసీడబ్ల్యూ'
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ధీరబాలిక మలాలా పేర్లు వినిపించినా వీరికి దక్కలేదు. ఈ ఏడాదికిగాను రసాయనిక ఆయుధాల నిర్మూలన సంస్థ (ఓపీసీడబ్ల్యూ)కు అవార్డు దక్కింది. నార్వేకు చెందిన ఓ టీవీ చానెల్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రసారం చేసిన గంట తర్వాత అదికారిక ప్రకటన వెలువడింది. ప్రపంచ శాంతికి సవాల్‌గా మారిన రసాయనిక ఆయుధాల నిర్మూలనకు ఓపీసీడబ్ల్యూ కృషిచేస్తోంది. ఐక్యరాజ్య సమతి ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తోంది. ఓపీసీడబ్ల్యూ అసాధారణ సేవలకుగాను అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ జ్యూరీ పేర్కొంది. సిరియాలో ఇటీవల నెలకొన్నఅంత్యరుద్ధం, భారీ హింస నేపథ్యంలో రసాయనిక ఆయుధాల విధ్వంసానికి ఆ దేశ ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. -
మా రసాయన ఆయుధాల వివరాలివే: సిరియా
డమాస్కస్: రసాయన ఆయుధాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని వివరాలను రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (ఓపీసీడబ్ల్యూ)కు అందజేసిన సిరియా.. శనివారం మిగతా వివరాలను కూడా ఆ సంస్థకు సమర్పించింది. ఈ సమాచారాన్ని సాంకేతిక సచివాలయం సమీక్షిస్తోందని ఆ సంస్థ తెలిపింది. సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆగస్టు 21న జరిగిన రసాయన ఆయుధ దాడి అనంతరం.. ఆ దేశంపై దాడిచేస్తామని అమెరికా హెచ్చరించటం.. అనంతర పరిణామాల్లో సిరియాపై దాడిని నివారించేందుకు సిరియా మిత్రదేశమైన రష్యా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవటం తెలిసిందే. ఆ ఒప్పందం ప్రకారం సిరియా తన వద్ద ఉన్న రసాయన ఆయుధాలను మొత్తం ధ్వంసం చేసేందుకు వాటి వివరాలను అంతర్జాతీయ సంస్థ అయిన ఓపీసీడబ్ల్యూకు శనివారంలోగా అప్పగించాల్సి ఉంది.