నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్న 'ఓపీసీడబ్ల్యూ' | Organisation for the Prohibition of Chemical Weapons gets Nobel Peace Prize | Sakshi
Sakshi News home page

నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్న 'ఓపీసీడబ్ల్యూ'

Published Fri, Oct 11 2013 2:10 PM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

Organisation for the Prohibition of Chemical Weapons gets Nobel Peace Prize

ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ధీరబాలిక మలాలా పేర్లు వినిపించినా వీరికి దక్కలేదు. ఈ ఏడాదికిగాను రసాయనిక ఆయుధాల నిర్మూలన సంస్థ (ఓపీసీడబ్ల్యూ)కు అవార్డు దక్కింది. నార్వేకు చెందిన ఓ టీవీ చానెల్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రసారం చేసిన గంట తర్వాత అదికారిక ప్రకటన వెలువడింది.

ప్రపంచ శాంతికి సవాల్గా మారిన రసాయనిక ఆయుధాల నిర్మూలనకు ఓపీసీడబ్ల్యూ కృషిచేస్తోంది. ఐక్యరాజ్య సమతి ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తోంది. ఓపీసీడబ్ల్యూ అసాధారణ సేవలకుగాను అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ జ్యూరీ పేర్కొంది. సిరియాలో ఇటీవల నెలకొన్నఅంత్యరుద్ధం, భారీ హింస నేపథ్యంలో రసాయనిక ఆయుధాల విధ్వంసానికి ఆ దేశ ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement