ద్యుతీకి మరో స్వర్ణం
ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
తావోయుయాన్ సిటీ(తైవాన్): ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ రెండో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇక్కడ జరుగుతున్న ఈ పోటీల 200 మీటర్ల విభాగంలో 23.52 సెకన్లతో ద్యుతీ అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన శ్రావణి నందా (23.55 సె.), జ్యోతి (23.93 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
తన అత్యుత్తమ టైమింగ్ (23.34 సె.) ను అందుకోవడంలో కూడా విఫలమైన ద్యుతీ... ఇంకా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. మహిళల 4ఁ100 మీ. రిలే జట్టు బ్యాటన్‌ను అందుకోవడంలో చేసిన పొరపాటుతో అనర్హతకు గురైంది.