open plot
-
రియల్ ఎస్టేట్: ఫ్లాటా.. ప్లాటా.. ఏది బెటర్?
ఓపెన్ ప్లాట్ (Open plot), అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ (Real estate) పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్స్తోనే అధిక రాబడి వస్తుందని హౌసింగ్.కామ్ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగళూరు నగరాల్లోని నివాస ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే ఫ్లాట్లు కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసికంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ గా ఉంది. 2018–24 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది.2018–24 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
లంచమడుగుతున్రు.. ఏం జేయాలె సచ్చిపోతున్న: మల్లన్న సాగర్ నిర్వాసితుడు
గజ్వేల్/గజ్వేల్ రూరల్: ‘న్యాయంగా దక్కాల్సిన ఓపెన్ ప్లాట్ ఇవ్వాలని అడిగితే లంచమడుగుతున్నరు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన. ఇక సచ్చిపోతున్న’ అంటూ తల్లికి ఫోన్లో చెప్పి మల్లన్నసాగర్ ముంపు బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం ఈ విషాద సంఘటన జరిగింది. రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి తిరిగి.. తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గొడుగు కిష్టయ్యకు ముగ్గురు కుమారులు రాజబాబు, దేవదాసు, రాజు ఉన్నారు. గ్రామంలో తండ్రితో పాటు ముగ్గురికి సంబంధించిన 1.18 ఎకరాల భూమి, ఇతర ఆస్తులను మల్లన్నసాగర్ కింద కోల్పోయారు. పరిహారం కింద అందరికీ కలిపి రూ.48.74 లక్షలు అందాయి. గ్రామం ఖాళీ అయ్యాక తండ్రి కిష్టయ్యకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాగా ఆయన ఆర్అండ్ఆర్ కాలనీలో ఉంటున్నాడు. ముగ్గురిలో రాజబాబు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. రెండో కుమారుడు దేవదాసు.. ఇటీవల అప్పు చేసి పట్టణంలో సుమారు 60 గజాల స్థలంలో చిన్నపాటి ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నాడు. తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి సిద్దిపేట ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. శుక్రవారమూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు దళారులు రూ.3 లక్షలు లంచమిస్తే పనవుతుందని.. లేదంటే ప్లాట్ రాకుండా చేస్తామని బెదిరించారు. దీంతో ప్లాట్ రాదేమోనని మనస్తాపం చెందాడు. ఇప్పుడే వస్తానని భార్యకు చెప్పి.. వెంటనే వస్తానని భార్య స్వప్నకు చెప్పి శుక్రవారం రాత్రి దేవదాసు బయటకు వెళ్లాడు. రాత్రి 11 దాటినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో స్వప్న కుటుంబీకులకు చెప్పింది. ఆ సమయంలో దేవదాసు తన తల్లికి ఫోన్ చేసి ‘ప్లాట్ కోసం ఎంత తిరుగుతున్నా వస్తలేదు.. బ్రోకర్లు లంచమడుగుతున్రు. ఇగ నేను సచ్చిపోతా’నని ఫోన్ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు. తెల్లవారుజామున రాజిరెడ్డిపల్లి మార్గంలో ఓ చెట్టుకు ఉరేసుకొని శవమై కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దేవదాసు ఆత్మహత్యకు దళారులే కారణమంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఆర్డీవో వచ్చే వరకు కదిలేది లేదని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డిని వివరణ కోరగా దేవదాసుకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.7.5 లక్షలు, ఇల్లుకు సంబంధించిన రూ. 5. 04 లక్షలు అందించామని, ఓపెన్ ప్లాటు వ్యవహారం పెండింగ్‌లో ఉందని తెలిపారు. దేవదాసు చాలా కాలంగా స్థానికంగా ఉండకపోవడం వల్లే ప్లాటు పెండింగ్‌లో పడిందన్నారు. -
ఫ్లాట్ కంటే.. ప్లాటే బెటర్..? ప్రతియేడు ఇంత పెరుగుదలా!
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్‌మెంట్సే ఎక్కువ రాబడి వస్తుందని హౌసింగ్.కామ్ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి ఏటా స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తుందని పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని నివాస ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. స్థలాల కొరతే కారణం... పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంట్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు. కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ-ఎన్సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవటమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. 13-21 శాతం పెరిగిన ధరలు... హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13-21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2-6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసికాలలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేశారు. హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ.. ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్పేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. (చదవండి: ఉద్యోగుల కోసం వేల కోట్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన గూగుల్..!) -
డబ్బులు జేబులో పెట్టుకొని సామాను సర్దుకోమన్నారు.. కిందకు వంగడంతో..
లింగాలఘణపురం (ములుగు): లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన కిరాణ వ్యాపారిని తనిఖీ చేస్తున్నట్లు చేసి రూ.2 లక్షలు మాయం చేసి ఉడాయించారు. ఈ ఘటన వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై జెర్సీ పాలకేంద్రం సమీపంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. ఘటనకు సంబంధించి బాధితుడు కొడితాల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. జెర్సీ పాలకేంద్రం సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో శేఖర్ బంధువు ప్లాటు కొనుగోలు చేయగా అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలతో పాటు కిరాణం సామాను కోసం మరో రూ.7వేలు తీసుకుని ఎక్సెల్ వాహనంపై జనగామకు బయలు దేరాడు. (చదవండి: వైరల్: యమ ‘స్పీడ్’గా వెళ్తున్న కామారెడ్డి కలెక్టర్ వాహనం.. ఏకంగా రూ.27,580 చలాన్లు!) నెల్లుట్ల బైపాస్ నుంచి సదరు వెంచర్ వద్దకు వెళ్లేందుకు యశ్వంతాపూర్ సమీపంలో ఉన్న బస్టాప్ వద్ద ఆగి బంధువుకు ఫోన్ చేశాడు. అతను కూడా వస్తున్నానని చెప్పడంతో వెంచర్ వద్దకు వెళ్తున్నాడు. అప్పటికే బస్టాప్ వద్ద బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని ముందుకు వెళ్లి అడ్డంగా బైక్ ఆపారు. వెంటనే ఒకరు దిగి ఫోన్ తీసుకుని, ఎక్సెల్ తాళం చెవి తీసుకున్నాడు. పెట్రోల్ పంపులో ఎవరిని కలిశావు.. ఏదో ఇచ్చావంటూ బుకాయించారు. నేను బంక్‌లోకి వెళ్లలేదని, ఎవరిని కలువలేదని చెబుతుండగానే సంచిలో ఏం ఉన్నాయి బయటకు తీయాలని ఆదేశించారు. సంచి తీయగానే జేబులో ఏం ఉన్నాయని గద్దించారు. డబ్బులు ఉన్నాయని చెప్పి చూపించగా డబ్బులు జేబులో పెట్టుకొని సంచిలో సామాను సర్దుకోమని చెప్పారు. వంగి సామాను సర్దుకుంటుండగానే జేబులోని డబ్బులు మాయం చేసి ఎక్సెల్ తాళం చెవితో బైక్‌పై పరారయ్యారు. సంచి సర్దుకుని జేబులో డబ్బులు చూసుకోగానే లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. అప్పటికే తన బంధువు అక్కడికి రావడంతో ఇద్దరూ కలిసి సదరు వ్యక్తులను వెంబడించే ప్రయత్నం చేశారు. నిడిగొండ వరకు వెళ్లి రఘునాథపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిధి తమకు లేదని, జనగామకు వెళ్లాలని సూచించగా అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ బాలాజీవరప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. (చదవండి: కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి) -
ఇంటితో పాటు ఖాళీ స్థలముంటే ఓకే..
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): భూక్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా సొమ్ము చెల్లింపు కేటగిరి (జీఓ 59)లో ఇంటితోపాటు ఓపెన్ ప్లాటు ఉన్నట్లయితే ఆ దరఖాస్తులను కూడా క్రమబద్ధీకరించడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం తాజాగా నివేదిక సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయితే అనర్హతలో ఉన్న 50 పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలగనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా అదనపు ఆదాయం వస్తుందని ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారిని తరలించటం కష్టంగా ఉంటుందన్న అభిప్రాయంతో అధికార యంత్రాంగం ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాలో ఈ కేటగిరి కింద 942 దరఖాస్తులు రాగా, 357 దరఖాస్తులు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత సాధించాయి. రంగారెడ్డి జిల్లాలో జీవో 59 కింద 11,744 దరఖాస్తులు రాగా, 2,758 దరఖాస్తులు అర్హత సాధించినట్లు రెవెన్యూ యంత్రాంగం నిర్ధారించింది. అర్హత లేనివిగా తిరస్కరించిన దరఖాస్తుల్లో హైదరాబాద్ జిల్లాలో 585 కాగా, రంగారెడ్డి జిల్లాలో 8,986 ఉన్నాయి.