Opera
-
9 మంది మహిళలతో సింగర్ బాగోతం
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒపెరా’ ప్రపంచంలో కూడా ‘మీటూ’ ఉద్యమం ప్రారంభమైంది. వాషింగ్టన్ ఒపెరా, లాస్ ఏంజెలిస్ ఒపెరాలను నిర్వహిస్తూ గాయకుడిగా, కంపోజర్‌గా ఏకంగా 14 గ్రామీ అవార్డులు అందుకున్న సుప్రసిద్ధుడు ప్లాసిడో డొమింగో (78)పై తొమ్మిది మంది మహిళలు ఆరోపణలు చేశారు. గడచిన మూడు దశాబ్దాల కాలంలో తమపై డొమింగో లైంగిక నేరాలకు పాల్పడినట్లు వారు వెల్లడించారు. ఈ మహిళలు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని డొమింగో ఒపెరాతో అనుబంధం ఉన్న 40 మంది మహిళలు చెప్పారు. ఉపాధి పేరిట బలవంతంగా తమను లొంగదీసుకున్నారని తొమ్మిది మంది మహిళలు తెలిపారు. నిరాకరించిన వారిని చేదు అనుభవాలు ఎదురయ్యాయని వారిలో ఏడుగురు మహిళలు చెప్పారు. అలా లైంగిక వేధింపులకు గురైన మహిళల్లో గాయకులు, డ్యాన్సర్లు, సంగీతవేత్తలు, వాయిస్ టీచర్లు, ఇతర స్టేజి కళాకారులు ఉన్నారు. అయితే వీరిలో ఒక్కరు మాత్రమే తన పేరును వెల్లడిస్తూ బయటకు వచ్చారు. మిగతా ఎనిమిది మంది పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. రిటైర్డ్ గాయకురాలు పట్రీసియా వూల్ఫ్ మాత్రమే పేరు వెల్లడించారు. డ్రెసింగ్ రూముల్లోకి, హోటల్ రూముల్లోకి వచ్చి బలవంతంగా ముద్దులు పెట్టుకునే వాడని తొమ్మిది మంది కాకుండా మరో ముగ్గురు మహిళలు ఆరోపించారు. 1990 దశకంలో ఆయనతో పాడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాక వరుసగా తనను ఇష్టం లేకున్నా విహార యాత్రకు తీసుకెళ్లే వాడని ఓ గాయకురాలు తెలిపారు. ఈ తాజా ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని, తాను ఇంత వరకు ఎవరిని లైంగికంగా వేధించలేదని, అందరు ఇష్టపూర్వకంగానే తనతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని ప్లాసిడో డొమింగో చెబుతున్నారు. డొమింగోకు ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. తన కళను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తారని చెబుతారు. నాలుగువేల ప్రదర్శనల్లో 150 పాత్రలకు పాటలు పాడిన ఒపెరా రికార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. -
గూగుల్ క్రోమ్‌తో ల్యాప్‌టాప్ బ్యాటరీ డెడ్!
ల్యాప్‌టాప్ బ్యాటరీ తొందరగా డెడ్ అవుతోందా.. దానికి కేవలం మీ లాప్టాప్ తయారీ సంస్థను మాత్రమే నిందించాల్సిన అవసరం లేదు. అందులో మీరు వాడే బ్రౌజర్లు కూడా.. బ్యాటరీ ఎంత వేగంగా ఖర్చవుతుంది అనే విషయాన్ని నిర్ణయిస్తాయని మైక్రోసాఫ్ట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడే ల్యాప్‌టాప్‌లలో బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందని నిర్థారించారు. ఇందులో భాగంగా గూగుల్ క్రోమ్, మొజిల్లా, ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లాంటి వివిధ బ్రౌజర్లతో ఉన్న ఒకే తరహా ల్యాప్‌టాప్‌లను లైవ్ వీడియో స్ట్రీమింగ్ ద్వారా పరీక్షించగా.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డెడ్ అవటం గమనించారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న ల్యాప్‌టాప్ బ్యాటరీ అతి తక్కువ సమయం 4:19 గంటలు పనిచేయగా.. మొజిల్లా 5:09 గంటలు, ఒపేరా 6:18 గంటలు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కలిగిఉన్న ల్యాప్‌టాప్ అత్యధికంగా 7:22 నిమిషాలు పనిచేసినట్లు గుర్తించారు. అయితే బ్యాటరీ సేవింగ్ విషయంలో ఇటీవలి కాలంలో గూగుల్ క్రోమ్ ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆ కంపెనీ ప్రతినిథి తెలిపారు. -
60 వసంతాల వేడుకల్లో 'ఒపేరా'
-
రూ.2 వేలకే సెల్కాన్ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ రంగ సంస్థ సెల్కాన్ ‘క్యాంపస్ నోవా ఏ352ఈ’ పేరుతో చవకైన స్మార్ట్‌ఫోన్‌ను బుధవారమిక్కడ ఆవి ష్కరించింది. ఒపేరా మినీ మొబైల్ బ్రౌజర్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేశారు. ఇందుకోసం ఒపేరా సాఫ్ట్‌వేర్‌తో ఒప్పం దం చేసుకుంది. ఆన్‌డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ను 3.5 అంగుళాల స్క్రీన్, 256 ర్యామ్, 512 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, 1 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 2 ఎంపీ కెమెరా, జీపీఆర్ఎస్, ఎడ్జ్, వైఫై వంటి ఫీచర్లతో రూపొందించారు. ధర రూ.2 వేలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి ఫీచర్లతో ప్రపంచంలోకెల్లా చౌక స్మార్ట్‌ఫోన్ ఇదేనని సెల్కాన్ ఈడీ మురళి రేతినేని ఈ సందర్భంగా చెప్పారు. తొలుత ఆన్లైన్లో స్నాప్‌డీల్ ద్వారా, దీపావళి నుంచి దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లోకి తీసుకొస్తామని తెలిపారు. లక్ష ఫోన్లు విక్రయించే అవకాశం ఉందన్నారు. దీపావళికి విండోస్ ఫోన్లు..: విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను దీపావళికి ప్రవేశపెట్టనున్నట్టు సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. 4 అంగుళాల స్క్రీన్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీతో తీసుకొస్తున్నట్టు చెప్పారు. రూ.6 వేలలోపు ధర ఉంటుందన్నారు. డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీతో కూడిన ట్యాబ్లెట్ పీసీ సైతం రానుందని చెప్పారు. కాగా, ఒపేరా బ్రౌజర్ ప్రీ-ఇన్స్టాల్ చేసిన నోకియా ఫోన్లు 2015 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని ఒపేరా సాఫ్ట్వేర్ దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ సునీల్ కామత్ వెల్లడించారు. నోకియా భవిష్యత్ ఫోన్లు తమ కంపెనీ బ్రౌజర్‌తో రానున్నాయన్నారు. ఒపేరా మినీ బ్రౌజర్ వాడకం భారత్‌లో 2013 నుంచి 24% వృద్ధి చెందిందని చెప్పారు. భారత్‌కు చెందిన 16 మొబైల్ కంపెనీలు ఆపెరాతో చేతులు కలిపాయి. -
లావా 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ @ రూ.8,499
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ లావా... 3జీ కాలింగ్ ట్యాబ్లెట్ ‘ఐవరీ ఎస్’ను విడుదల చేసింది. దీని ధర రూ.8.499. 7 అంగుళాల స్క్రీన్ సైజు, డ్యూయల్ సిమ్ కలిగిఉన్న ఈ ట్యాబె ్లట్ బరువు 300 గ్రాములుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. మీడియాటెక్ 1.3 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత మెమరీ(32 జీబీ ఎక్స్‌పాండబుల్) వంటి కీలక సాంకేతికాంశాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌కు వెనుకవైపున 3.2 మెగాపిక్సెల్స్ కెమెరా, ముందువైపున వీజీఏ కెమేరా(3జీ వీడియో కాలింగ్), 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం తదితర ఫీచర్లు ఉన్నట్లు లావా ఇంటర్నేషనల్ సహవ్యవస్థాపకుడు, డెరైక్టర్ ఎస్ఎన్ రాయ్ వివరించారు. యువత, యువ ప్రొఫెషనల్స్‌ను ఆకట్టుకునే లక్ష్యంగా ఒపేరా, హంగామా మ్యూజిక్, వాట్స్‌యాప్, పేటీఎం, ఈఏ గేమ్స్ తదితర ప్రీలోడెడ్ యాప్స్, గేమ్స్‌ను ఇందులో పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.