Operation Polo
-
జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్
సాక్షి, హైదరాబాద్: ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 13 నెలలు గడుస్తోంది. దక్షిణ భారతంలో కీలకమైన హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యే ప్రసక్తే లేదని మొండికేస్తోంది. అంతేకాదు పాకిస్థాన్‌కు అనుకూలంగా మారుతోంది. విలీనం కోసం భారత్ ఒత్తిడి తెస్తే పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలంటూ హైదరాబాద్ నుంచి రేడియో సందేశాలు వెళ్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ సంస్థానం రజాకార్లు, నిజాం సైన్యం అకృత్యాలతో అట్టుడుకుతోంది. ఇక కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందే’.. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ మదిలో ఇదే ఆలోచన. అదును దొరికితే చాలని వేచి ఉన్నారు. దేశ విభజనకు కారణమైన పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబరు 11న మృతి చెందారు. ఇంకేం అదును దొరికింది. ఆ సమయంలో కాశ్మీర్లో ఉన్న సర్దార్ పటేల్.. తుపాకీ చూపి నిజాంను దారికి తెచ్చేందుకు ఆ చల్లని వాతావరణంలో వేడివేడి వ్యూహాలను సిద్ధం చేశారు. సైనిక చర్యకు దిగితే ఎలా ఉంటుందో నిజాంకు తెలిసేలా కబురు పంపారు. లొంగిపోవాలా.. ఎదిరించాలా? భారత ప్రభుత్వం తరఫున మేజర్ జనరల్‌గా ఉన్న మున్షీ హైదరాబాద్‌కు వచ్చి నిజాంతో మాట్లాడి, పరిస్థితిని వివరించారు. భారత్ సైనిక చర్యకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. దీంతో తాను భారత సైన్యాన్ని ఎదురించనని, విలీనానికి సహకరిస్తానని నిజాం సంకేతాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రజాకార్లకు, నిజాం సైన్యానికి చెప్పలేదు. లొంగిపోయాక తనపై సైనిక విచారణ, శిక్ష లేకుండా చూసుకోవడం, రాజభరణం, ఇతర సదుపాయాలు అందుకోవడంపైనే దృష్టిపెట్టారు. హైదరాబాద్ సంస్థానం మంత్రి వర్గాన్ని అత్యవసరంగా సమావేశపర్చి.. అందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. అందరూ రాజీనామా చేసి, నిజాం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. నిజాం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలిపి, సైన్యాన్ని ఎదురించబోనని మాటిచ్చారు. ప్రతిగా విలీనం తర్వాత తనకు ప్రాధాన్యమున్న హోదా ఇవ్వాలని, 200 కోట్ల నగదు ఇవ్వాలని, తన బిరుదులను కొనసాగించాలని, తన ఆస్తులు తనకే దక్కాలని కోరారు.ఇవి తెలియని రజాకార్ల బృందాలు, నిజాం సైన్యం.. భారత సైన్యం దాడి మొదలుపెట్టినప్పుడు ప్రతిఘటించాయి. కీసర సరిహద్దులో భీకర దాడితో.. నిజాం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో.. భారత సైన్యాలను ఎదుర్కొనే విషయంగా నిజాం సైన్యం దీటుగా వ్యవహరించలేకపోయింది. కొద్దిపాటి ప్రతిఘటనతోనే లొంగిపోవడమో, పారిపోవడమో జరుగుతూ వచ్చింది. ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉన్న కీసర ప్రాంతంలో మాత్రం భీకర దాడి జరిగింది. కీసర వద్ద నిజాం ఔట్‌పోస్టు వద్దకు భారీగా రజాకార్ల దండు చేరుకుని.. భారత సైన్యంపై దాడికి దిగింది. చాలాసేపు పోరాడాక భారత సైన్యం యుద్ధ ట్యాంకుతో దాడి చేస్తే.. నిజాం ఔట్‌పోస్టు నామరూపాల్లేకుండా పోయింది. ఇలాగే ఖమ్మం వద్ద కూడా దాడి జరిగింది. వందల మంది చనిపోతుండటంతో నిజాం సైన్యం వెనకడుగు వేసింది. కాశీం రజ్వీ దీన్ని తట్టుకోలేక నిజాంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌పై దాడి చేసి తమకు సహకరించాలని పాకిస్తాన్‌ను కోరాడు. పాకిస్తాన్ స్పందించలేదు. నిజాం లొంగిపోగా హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) అక్రమంగా విమానం ద్వారా ఆయుధాలు ఆస్ట్రియా వ్యాపారి కాటన్ ద్వారా నిజాం రాజు అక్రమంగా ఆయుధా లు సమకూర్చుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్తున్న విమానంగా చూపి, కారుణ్య సహాయం పేరుతో విమానాన్ని బీదర్ ఎయిర్‌పోర్టులో దింపేవారు. అక్కడి విమాన స్ట్రిప్‌లో ఆయుధాలను అన్లోడ్ చేసేవారు. ఇది బయటపడడంతో బీదర్ బదులు వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి మకాం మార్చారు. లంకాస్టర్ అనే 4 ఇంజిన్లుండే ఈ విమానం ద్వారా 1948 మే నుంచి జూన్ 20 వరకు నిరాటంకంగా ఈ అక్రమ వ్యవహారం సాగింది. భారత ప్రభుత్వం వినతితో బ్రిటిష్ వారి జోక్యంతో తర్వాత ఆగిపోయింది. (క్లిక్ చేయండి: ‘కొరియర్’గా.. వారియర్‌గా!) -
నలువైపులా ముట్టడి.. హైదరాబాద్‌పై ఐదు రోజుల ‘ఆపరేషన్’
సాక్షి, హైదరాబాద్: స్ట్రైక్.. స్మాష్.. కిల్.. వీర్.. ఇవి కేవలం నాలుగు పదాలు కాదు.. భారత సైన్యాన్ని హైదరాబాద్ సంస్థానంపైకి నడిపించిన నాలుగు సైనిక దళాల పేర్లు అవి.. సంస్థానాన్ని నలువైపుల నుంచీ ముట్టడించి నిజాం సైన్యాలను తరిమికొట్టిన దళాలు అవి.. నాటి భారత సైన్యం దక్షిణ మండల ప్రధానాధికారి గొడాల్ట్ వ్యూహ రచన మేరకు ‘ఆపరేషన్ పోలో’పేరిట జరిగిన సైనిక చర్యలో.. హైదరాబాద్ సంస్థానంపై నలుదిక్కుల నుంచీ దాడులు జరిగాయి. నల్దుర్గ్ నుంచి నార్కట్‌పల్లి.. ఔరంగాబాద్ నుంచి హోమ్నాబాద్ వరకు జరిగిన ఈ దాడుల వివరాలన్నీ భారత సైన్యానికి చెందిన అధికార పత్రాల్లో ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్ పోలో గురించి ఒక్కొక్కరు ఒక్కో కథనం వినిపిస్తుండగా.. కొందరు చరిత్రకారులు భారత సైన్యం అధికారిక పత్రాల్లో పేర్కొన్న అంశాలను వివరిస్తున్నారు. ఆ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12న మొదలు.. మద్రాసు, ముంబై రాష్ట్రంలోని సేనలు హైదరాబాద్ సంస్థానం వైపు కదలాలని 1948 సెపె్టంబర్ 12న భారత సైన్యం అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నల్దుర్గ్ ప్రాంతంలో నిజాం సైన్యం ఏర్పాటు చేసుకున్న శిబిరం తమ వశమైందని సెపె్టంబర్ 13న ఉదయం భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఆ రోజునే సైనిక చర్య ప్రారంభమైందని కూడా ప్రకటించింది. తొలుత సైనిక చర్యకు ‘ఆపరేషన్ కాటర్ పిల్లర్’అనే పేరు పెట్టినా.. తర్వాత ‘ఆపరేషన్ పోలో’పేరుతో కొనసాగించారు. నాలుగు వైపుల నుంచీ.. హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం దాడి నలువైపులా ఒకేసారి ప్రారంభమైందని చరిత్రకారులు చెప్తున్నారు. షోలాపూర్–హైదరాబాద్ మార్గంలో పశ్చిమ దిశ నుంచి మేజర్ జనరల్ జయంత్‌నాథ్ చౌదరి నాయకత్వంలోని దళం.. విజయవాడ– హైదరాబాద్ మార్గంలో తూర్పు దిశ నుంచి మేజర్ జనరల్ ఏఏ రుద్ర నాయకత్వంలోని దళం ముందుకు నడిచాయి. ఈ దళాల దాడి సాగుతుండగానే రైల్వే మార్గాల రక్షణతోపాటు నిజాం సైన్యం, రజాకార్లు పారిపోకుండా ఉండేందుకు దక్షిణాన కర్నూలు వైపు నుంచి మరో దళం కదిలింది. ఉత్తర దిశలోని జాల్నా వైపు నుంచి ఇంకో దళం దాడి మొదలుపెట్టింది. ఈ నాలుగు దళాలకు స్ట్రైక్, స్మాష్, కిల్, వీర్ ఫోర్స్లుగా నామకరణం చేశారు. 9వ డొగ్రా బెటాలియన్, 1వ ఆర్మర్డ్ బ్రిగేడ్, 7వ, 9వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్లు, భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఐదు రోజుల పాటు సాగి.. సైన్యం ప్రకటన మేరకు 1948 సెపె్టంబర్ 13న ఉదయం ప్రారంభమైన ‘ఆపరేషన్ పోలో’ఐదు రోజుల పాటు కొనసాగింది. ఈ ఐదు రోజుల పాటు ఏ రోజు ఏం జరిగిందో సైనిక పత్రాల్లో రాసి ఉంది. నల్దుర్గ్ కోట పతనం, బోరీ నది మీద వంతెన కూలగొట్టడం వంటి విధ్వంసాలనూ పత్రాల్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేటను జల్లెడ పట్టాం, సూర్యాపేట పతనమైంది, నార్కట్‌పల్లి పతనమైంది, చిట్యాల దగ్గర ఉన్నాం, కాప్చరింగ్ జాల్నా, ఔరాంగాబాద్, హోమ్నాబాద్ అంటూ.. యుద్ధంలో ప్రాంతాలను, స్థావరాలను స్వాధీనం చేసుకున్న తరహాలో భాషనే ఇందులో ఉపయోగించారు. నాటి పత్రికల్లో కూడా.. అధికారిక సైన్య పత్రాలతోపాటు నాటి పత్రికలు కూడా అప్పట్లో జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ కథనాలు రాశాయి. మెర్జర్, అనెక్సేషన్, యాక్సెషన్, అటాక్, యాక్షన్, మిలిటరీ ఆపరేషన్, ఎండ్ ఆఫ్ అసఫ్‌జాహీ రూల్, హైదరాబాద్ పతనం, విలీనం, ఆక్రమణ అనే పదాలు తప్ప సమకాలీనంగా ఇతర మాటలు అప్పట్లో వాడలేదు. నాటి సమకాలీన పత్రికలన్నీ ఈ దాడిని ‘ఇండియా ఇన్వేడ్స్’ అని రాశాయి. స్వయంగా భారత ప్రభుత్వం దీనిని సైనిక చర్యగానే పేర్కొంది. రూ.3.5 కోట్ల ఖర్చుతో.. ‘ఆపరేషన్ పోలో’దాడికి రూ.3.5 కోట్లు ఖర్చయిందని సైనిక పత్రాల్లో పేర్కొన్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. మొత్తం 66 మంది ఇండియన్ యూనియన్ సైనికులు చనిపోగా, 97 మంది గాయపడ్డారని, 490 మంది నిజాం సైన్యం చనిపోగా, 122 మంది గాయపడ్డారని వివరిస్తున్నారు. సైనిక చర్యలో జరిగిన నష్టాలపైనా అప్పటి పత్రికలు కథనాలు రాశాయి. హైదరాబాద్‌పై విజయం సాధించడంపై నాటి సైనిక చర్యకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ రాజేంద్ర సింహ్జీకి బంగారు ఖడ్గంతోపాటు భగవద్గీత గ్రంథాన్ని బహూకరించాలని తూర్పు పంజాబ్ విశ్వవిద్యాలయ హిందూ రక్షణార్థి విద్యార్థులు తీర్మానించారు. వారు దక్షిణ భారత మిలటరీ శాఖను అభినందించారని నాటి పత్రికల్లో రాశారు. ఇదీ చదవండి: Operation Polo: నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్ పటేల్ -
నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్ పటేల్
ఒక అంచనా ప్రకారం నిజాం వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం నాటికి 30 వేల మంది సైనికులున్నారు. వీరితో పాటు మూడు ఆర్మర్ రెజిమెంట్లు, అశ్విక దళం, 11 ఇన్ఫాన్ట్రీ బెటాలియన్లు, ఒక ఆర్టిలరీకి తోడుగా ఇంకా పది వరకు సైనిక రెజిమెంట్లు ఉన్నాయి. వీరికి తోడుగా దాదాపు 2 లక్షల మంది రజాకార్లున్నారు. వీరిలో 50వేల మంది దగ్గర తుపాకులు, తల్వార్ల లాంటి ఆయుధాలున్నాయి. దీనికి తోడుగా విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అప్పటికే నిజాం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఆపరేషన్ పోలోకు నెలరోజుల ముందు భారతసైన్యం తమపై దాడిచేస్తే ఎంతకాలం ప్రతిఘటించగలమని నిజాం తన సైన్యాధ్యక్షుడు ఇద్రూస్‌ను ప్రశ్నించాడు. ఒక్కరోజు కూడా కష్టమే అని ఇద్రూస్ సమాధానం చెప్పాడు. దీంతో సైన్యానికి తోడుగా రజాకార్ల సంఖ్యను పెంచాలని నిజాం ఆదేశాలు జారీచేశాడు. అయితే నిజాం సైన్యం భారత సైన్యం ముందు ఏమాత్రం నిలుస్తుందన్నదానిపై శతకోటి అనుమానాలు. సెప్టెంబర్ 13 తెల్లవారుజామున భారత్ సైన్యం ఐదు వైపుల నుంచీ హైదరాబాద్ సంస్థానంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో నిజాం సంస్థానంలోకి పెద్ద ఎత్తున ట్యాంకులతో భారత సైన్యం ప్రవేశించింది. మరో మార్గంలో అటు షోలాపూర్ నుంచి జెఎన్ చౌదరి ఆధ్వర్యంలో భారత బలగాలు హైదరాబాద్ వైపు దూసుకు వచ్చాయి. భారత సైన్యంలో స్ట్రైక్ ఫోర్స్, స్మాష్ ఫోర్స్, కిల్ ఫోర్స్, వీర్ ఫోర్స్ పేరుతో నాలుగు రకాల బలగాలున్నాయి. ముందుగా భారత్ యుద్ధ విమానాలు హైదరాబాద్ సంస్థానంలోని ఉస్మానాబాద్, వరంగల్‌తో పాటు ఇతర విమానాశ్రయాలపై బాంబులు కురిపించింది. దీంతో నిజాం విమానాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ముందుగా యుద్ధ ట్యాంకులతో నిజాం సైనిక పోస్టులపై దాడులు చేసిన భారత బలగాలు ఆ తరువాత వేగంగా నిజాం సంస్థానంలోకి చొచ్చుకు వచ్చాయి. చదవండి: (హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?) ఇక భారత తొలి బుల్లెట్ ఉస్మానాబాద్ జైలు బయట ఉన్న నిజాం సెంట్రీకి తగిలింది దీంతో అతను అక్కడే కుప్ప కూలాడు. ఇదే సమయంలో భారత సైన్యం దాడి గురించి విస్తృతంగా ప్రచారం జరిగింది. నిజాం సైన్యం భారత సైన్యాన్ని ఎదుర్కోలేక తోక ముడిచింది. అయితే భారత సైన్యం ఒక్కో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా.. నిజాం మాత్రం తప్పుడు వార్తలు ప్రసారం చేయించాడు. నిజాం సైన్యం గెలుస్తుందంటూ వదంతులు వ్యాపింపజేశాడు. చివరికి సెప్టెంబర్-17న జెఎన్ చౌదరి ఆధ్వర్యంలోని భారత బలగాలు హైదరాబాద్ శివారులోని పటాన్చెరువు చేరుకున్నారు. దీంతో నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్ లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిందనే వార్త తెలియగానే నిజాం తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇక నిజాం ఎవరిని నమ్మే స్థితిలో కనిపించలేదు. వెంటనే భారత రాయబారి మున్షిని పిలిపించి తాను లొంగిపోతున్నట్లు తెలిపాడు. దీంతో నిజాం లొంగుబాటు విషయాన్ని హోంమంత్రి పటేల్‌కు మున్షి తెలిపారు. నిజాం లొంగుబాటు ప్రక్రియలో పటేల్ చాలా తెలివిగా వ్యవహరించారు. ముఖ్యంగా సెప్టెంబర్-18వ తేదీన ఐక్యరాజ్యసమితిలో నిజాం భారత్‌కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. ఈ విచారణ జరగడానికి ముందుగానే నిజాం లొంగిపోయాడనే విషయాన్ని అంతార్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలనేది పటేల్ ఆలోచన. అందుకే హైదరాబాద్‌లో భారత రాయబారి మున్షి సహాయంతో నిజాం ద్వారా దక్కన్ రేడియోలో లొంగుబాటు ప్రకటన చేయించారు పటేల్. ఈ ప్రకటనలో నిజాం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చదవండి: (తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?) నిజాం లొంగుబాటు ప్రకటనతో ఐక్యరాజ్యసమితిలో హైదరాబాద్ సంస్థానం వేసిన పిటిషన్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. నిజాం తన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నానని దక్కన్ రేడియోలో చేసిన ప్రకటన బీబీసీ రేడియోలోనూ ప్రసారం అయింది. ఆ తరువాత ఈ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెట్టారు. 1979వరకు ఈ పిటిషన్ ఐక్యరాజ్యసమితి వద్ద పెండింగ్‌లోనే ఉంది. ఆ తరువాత ఈ పిటిషన్‌ను కొట్టివేశారు. ఇక లొంగిపోయిన నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్‌ను భారత సైన్యాలు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించాయి. ఇక ఖాసీం రజ్వీని అరెస్టు చేసి జైలుకు పంపారు. తరువాతి కాలంలో రిజ్వీ పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. ఇక భారత సైన్యాలకు లొంగిపోయిన నిజాం తనకు రజాకార్లకు సంబంధం లేదని ప్రకటించాడు. లొంగిపోయిన నిజాంను ఏంచేయాలనే విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా చర్చించింది. ప్రస్తుతానికి నిజాం రాజు పేరు పైనే పరిపాలన సాగించాలని.. పౌరప్రభుత్వాన్ని భారత సైన్యం ఏర్పాటు చేస్తుందని పటేల్ నిర్ణయించారు. జనరల్ జెఎన్ చౌదరిని సైనిక గవర్నర్‌గా నియమించి పాలనను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ఆపరేషన్ పోలో పూర్తయిన సెప్టెంబర్-17 నుంచి హైదరాబాద్ సంస్థానంలో భారత చట్టాలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా త్రివర్ణ పతాకం సగర్వంగా తెలంగాణా గడ్డపై రెపరెపలాండింది. తరువాతి కాలంలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్‌ప్రముఖ్‌గా నిజాంను నియమించింది. ఆయన చనిపోయే వరకు ఆ పదవిలో కొనసాగాడు. -
హైదరాబాద్‌పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?
హైదరాబాద్‌లో ఖాసీం రిజ్వీ అరాచాకాలు పెరుగుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉందని నిఘావర్గాలు భారత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. చాలా సున్నితమైన హైదరాబాద్ సంస్థానం విలీనం అంశంపై నెహ్రూ-పటేల్‌లు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో ఓ వైపు సైన్యం సిద్ధమవుతున్నా హైదరాబాద్‌పై సైనిక చర్య జరుగుతుందా లేదా అనే విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి సెప్టెంబర్‌లో హైదరాబాద్ సంస్థానంలోకి భారతసైన్యం అడుగుపెట్టడానికి పటేల్ ఓకే అన్నారు. దీనికి ఆపరేషన్ పోలో అని నామకరణం చేశారు. హైదరాబాద్‌లోని పోలో గ్రౌండ్స్ వల్లే సైనికచర్యకు పోలో అనే పేరుపెట్టారని కొందరు చరిత్రకారులు అంటారు. ఇక హైదరాబాద్‌లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీసు చర్యగా పిలవాలని నిర్ణయించారు. సైనిక చర్య అంటే మళ్లీ అంతర్జాతీయంగా వివాదం రేగే ప్రమాదం ఉంటుందని.. పోలీసుచర్య అంతర్గత వ్యవహారంగా ఉంటుందనేది పటేల్ భావన. అయితే తరువాతి కాలంలో ఆపరేషన్ పోలోను ఆపరేషన్ క్యాటర్ పిల్లర్‌గా మార్చారు. ఇక అటు భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతుందనే సమాచారం నిజాం చెవినపడింది. దీంతో ఎలాగైనా యుద్ధం చేయాలని నిజాం నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన మంత్రి లాయక్ అలీని లండన్‌కు పంపి అక్కడ భారీగా అయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఇక సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ద విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. దీంతో ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమయినా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ నిశ్చయించుకున్నారు. ఒకవేళ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ ఆందోళన చెందారు. నిజాం రాజుకు దేశవ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి వల్ల ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఉక్కుమనిషి ముందే ఊహించారు. దీంతోపాటు యుద్ధం ఆలస్యం అయితే ఇదే అదనుగా పాకిస్తాన్ కాశ్మీర్లో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే పటేల్ సైనిక చర్యను వేగంగా ముగించాలని పట్టుదల ప్రదర్శించారు. సెప్టెంబర్ 13న సైనికచర్యకు అన్ని రకాలుగా రంగం సిద్ధమయింది. సరిగ్గా రెండు రోజుల ముందు పాకిస్తాన్లో జిన్నా సెప్టెంబర్-11న చనిపోయాడు. భారత ఆర్మీకి జిన్నా మృతి రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దీంతో 13వ తేదీన సైనికచర్య ప్రారంభిస్తే పాకిస్థాన్ అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదని పటేల్ భావించారు. సెప్టెంబర్-13 తెల్లవారు జామున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. అయితే ఆపరేషన్ పోలో ప్రారంభం విషయం ప్రధాని నెహ్రూకు తెలియదని పటేల్ నెహ్రూకు చెప్పకుండానే ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇటు హైదరాబాద్‌పై పోలీసు చర్య ప్రారంభం కాగానే అప్పటి పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భారత్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఉన్న భారత సైన్యంపై పాకిస్తాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలున్నాయా అని తన సైన్యాన్ని ప్రశ్నించారు. పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా ఉన్న ఎలవర్థీ.. హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే అవకాశం లేదని స్పష్టంచేశారు.. దీంతో ఢిల్లీ పైన పాకిస్థాన్ బాంబులు వేసే అవకాశం ఉందా? అని లియాఖత్ అలీఖాన్ మరో ప్రశ్నవేశారు. దీనికి సమాధానంగా ఎలవర్దీ పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం నాలుగు యుద్ధ విమానాలే ఉన్నాయని.. అందులో రెండు పనిచేయడం లేదన్నాడు. తమ వద్ద ఉన్న రెండు విమానాల్లో ఒకటి మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని.. అయితే అది తిరిగివచ్చే గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు. దీంతో హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పాకిస్థాన్ నిర్ణయించింది. -
తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్ 17.. అసలేం జరిగింది?
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా? నిజాం రాజు పాలన ఎలా అంతమయ్యింది? సాయుధ పోరాటం ఏమేరకు నిజాంను గద్దె దించగలిగింది? హైదరాబాద్‌పై పోలీస్ యాక్షన్ పేరుతో జరిగింది ఏంటి? నిజాంపై యుద్ధం చేయడంలో నెహ్రూ-పటేల్ పాత్ర ఏంటి? అసలు సెప్టెంబర్-17న ఏంజరిగింది? సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. శతాబ్దాల బానిస సంకెళ్లను తుంచేసిన ఉద్విగ్న సందర్భం. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణం. రాజరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామం. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. నా దేశం భారతదేశం అని గర్వంగా ప్రతీ తెలంగాణా పౌరుడు నినదించిన తారీఖు సెప్టెంబర్-17. అందుకే తెలంగాణా చరిత్రలో ఈ తేదీ సువర్ణాక్షర లిఖితం. సెప్టెంబర్ -17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందా లేక తెలంగాణా ప్రజలకు నిజాం కబంధ హస్తాల నుంచి విమోచనం లభించిందా అనే అంశంపై భిన్న వాదనలున్నాయి. దీనిపై వాదించేవారు ఎవరైనా తమకు అనుకూలమైన వాదనలనే తెరమీదికి తీసుకువస్తారు. 1948 సెప్టెంబర్-17న పోలీసు చర్యతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. దీంతో తెలంగాణా ప్రాంతం భారతదేశంలో విలీనమైనపోయినట్లేనని చాలా మంది వాదన. అందుకే సెప్టెంబర్-17ను విలీన దినోత్సవంగా జరపాలంటారు. అయితే సెప్టెంబర్-17న తెలంగాణా పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదనేది కూడా అంతే వాస్తవం. సాంకేతికంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు తెలంగాణా నిజాం పాలనలోనే ఉంది. అయితే పేరుకే నిజాం ప్రభువు అయినప్పటికీ ఇక్కడ పౌరప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో నిజాం దుష్టపాలన నుంచి ఖాసీం రజ్వీలాంటి రజాకార్ నాయకుల నుంచి తెలంగాణా ప్రజలు విముక్తి పొందారు. అందుకే సెప్టెంబర్-17ను విమోచన దినంగా పరిగణించాలని మరికొందరివాదన. సెప్టెంబర్-17న తెలంగాణా విలీనం జరిగిందా లేక విమోచన జరిగిందా అనే చర్చ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే 1948 సెప్టెంబర్-13 నుంచి 17వ తేదీ వరకు జరిగిన పోలీసు చర్య వల్లే తెలంగాణా నిజాం పాలన నుంచి విముక్తి పొందిందనేది అందరూ అంగీకరించే వాస్తవం. హైదరాబాద్ సంస్థానంను చుట్టుముట్టిన భారత సైన్యం హైదరాబాద్ నగరానికి చేరుకుని నిజాంను లొంగదీసుకున్న ఆపరేషన్ పోలో తెలంగాణా చరిత్ర గతిని మార్చేసింది. తెలంగాణా ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించింది. ఇంతటి కీలక పరిణామాలకు కేంద్రబిందువైన ఆపరేషన్ పోలోకు ముందు చాలా తతంగమే నడిచింది. అయితే ఆపరేషన్ పోలో 5 రోజుల్లో ముగిసిపోయినా సైనిక చర్య తప్పదనే సంకేతాలు 13 నెలల ముందే అంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే కనిపించాయి. -
Telangana Vimochana Dinotsavam: గంగాపూర్ ఘటనతో స్పీడ్ పెంచిన సర్దార్
భారత్‌లో విలీనం కావడం ముందు నుంచి నిజాంకు ఇష్టం లేదు. భారత స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే తాను భారత్‌లో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉందా అని నిజాం తన సలహాదారు సర్ వాల్టర్ మాంగ్టన్‌ను అడిగాడు. అయితే వాల్టర్ మాంగ్టన్ భారత్ మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉండేందుకు అవకాశం లేదని పాకిస్థాన్‌లో విలీనం కావడం అసాధ్యమని స్పష్టం చేశాడు. అయినా ఏదో విధంగా స్వతంత్రంగా ఉండాలనేదే నిజాం అభిలాష. మరోవైపు మజ్లిస్ పార్టీ అధ్యక్షుడైన ఖాసీం రజ్వీ ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ సంస్థానం విలీనం చేయకూడదంటూ నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. రజాకార్ల పేరుతో ఖాసీం రజ్వీ ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం అప్పటికే తెలంగాణాలో అరాచాకాలు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో సభ పెట్టి తాము ఎర్రకోటపై నిజాం జెండా ఎగరేస్తామని ఖాసీం రజ్వి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రారంభించాడు. హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్యకు సంబంధించి నెహ్రూ-పటేల్ మధ్య వైరుధ్యం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోడానికి సైనికచర్య చివరి ప్రత్యామ్నాయం కావాలని నెహ్రూ భావించారు..పటేల్ మాత్రం తాత్సారం చేయకూడదనే ఆలోచనతో ఉన్నారు. దీనికోసం ఆపరేషన్ పోలో పేరుతో ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఈ ఆపరేషన్ అత్యంత వేగంగా పూర్తవ్వాలనేది పటేల్ వ్యూహం. గంగాపూర్ రైల్వేస్టేషన్లో రజాకార్లు చేసిన దాడి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీంతో అప్పటి వరకు సహనంతో ఉన్న పటేల్ వెంటనే హైదరాబాద్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వెంటనే కాశ్మీర్లో ఉన్న సైన్యాధ్యక్షుడు కరియప్పను ఢిల్లీకి పిలిపించిన పటేల్.. హైదరాబాద్‌పై చర్యకు సిద్ధం కావాలని ఆదేశించారు. దీంతో సైనికాధికారులు అత్యంత వేగంగా సైనిక చర్య పూర్తి చేసే విధంగా వ్యూహాలు రూపొందించారు. ఒకవేళ హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం చర్యకు దిగితే పాకిస్థాన్ ఏదైనా ప్రతీకార దాడులు చేస్తుందా అనే కోణంలోనూ పటేల్ వ్యూహాలు సిద్ధం చేశారు. దీనికోసం నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పడు సమాచారం సేకరించి పాకిస్థాన్ ఎత్తుగడలపై సమీక్షలు జరిపారు. ఇక భారత్ సైనిక చర్యను నిజాం సైన్యం ఎంతకాలం ఎదుర్కోగలదనే విషయంపై ప్రాథమికంగా కొంత గందరగోళం ఉండింది. ముఖ్యంగా నిజాం యుద్ధవిమానాలు కొనుగోలు చేస్తున్నాడని కొంతమంది సైనిక జనరల్స్ సమాచారం ఇచ్చారు. దీంతో సైనిక చర్యకు దిగాలా.. వద్దా అనే మీమాంస ఎదురైంది. -
చరిత్ర పైనా రాజకీయమేనా?
భారత దేశంలోనే కాక ప్రపంచ విప్లవోద్యమాల్లోనే పేరెన్నికగన్నది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. దేశంలో మిగతా చోట్ల బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా అహింసా యుత స్వాతంత్య్ర పోరాటం జరిగితే... తెలంగాణలో బ్రిటిష్‌వారి మిత్రుడైన నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. ఇంగ్లిష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రోద్యమం జరిగిన సమయంలో... ఇక్కడ తెలంగాణలో నిజాం పాలనకు చరమగీతం పాడుతూ విప్లవకారులు అనేక గ్రామాలను విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తూ ముందుకు పోతున్నారు. అటువంటి సమయంలో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై ‘సైనిక చర్య’ చేపట్టింది. నిజాం భారత హోంమంత్రికి అధికారికంగా లొంగిపోయి, తన రాజ్యాన్ని భారత్‌లో కలిపివేశాడు. అయితే ఈ చారిత్రక ఘట్టాన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్వప్రయోజనాలకోసం వాడుకోజూడటమే విషాదం! ఇది దురాక్రమణ దినం తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17న జరిగింది ఏమిటో నేటికీ మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకార్ల, దేశ్‌ముఖ్‌ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు. మరి ఆ రోజు జరిగిందేమిటి? విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణా? వాస్తవంగా చెప్పాలంటే ఆనాటి ఇండియా పాలక వర్గం వల్లభాయి పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణను దురాక్రమణ చేసింది. చెరపలేని చరిత్రను, గత చారిత్రక సత్యాన్ని వివాదాస్పదం చేసి ప్రజల మన్నలను పొందాలని పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆనాటి పాలక పార్టీ కాంగ్రెస్ విలీనమనీ, మత కోణంలో లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ విమోచననీ, ప్రజల ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న కమ్యూనిస్టులు ముమ్మాటికీ విద్రోహమనీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నిజాం నిరంకుశ పాలనలో... దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాముల పెత్తనం, వెట్టి చాకిరీ లాంటి ఆగడాలపై ఎర్రజెండా అండతో ఎదురు తిరిగిన హైదారాబాద్ రాష్ట్ర ప్రజలు పోరాటాన్ని ఉధృతం చేసి నైజాం పాలనను అంతమొందించే స్థాయికి వచ్చారు. దొరలు గడీలు విడిచి హైదరాబాద్ పారిపోయేలా చేశారు. వేలాదిమంది మాన ప్రాణాలను దోచుకున్న ఊర్లలోని దొరలే కాదు నిజాంకూడా గద్దె దిగే పరిస్థితిని రైతాంగ పోరాటం కలిగించింది. నలువైపుల నుండి వస్తున్న పోరాట వార్తలు నిజాంను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీన్ని గమనించిన నిజాం ఆనాటి నెహ్రూ ప్రభు త్వంతో కుమ్ముక్కయి ‘ఆపరేషన్ పోలో‘ నిర్వ హించడానికి వచ్చిన భారత సైన్యానికి లొంగిపోయాడు. నిజాం లొంగిపోయినా వెనుదిరిగి వెళ్ళకుండా తెలంగా ణను దురాక్రమణ చేశాయి యూనియన్ సైన్యాలు. ప్రజల వైపున పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులను మట్టుపెట్టేందుకు నెహ్రూ సేనలు పూనుకున్నాయి. ప్రజల పోరాటాలకు జడిసి పట్టణాలకు పారిపోయిన దొరలు, భూస్వాములు పల్లెలకు వచ్చారు. 1948 వరకు పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో 400 మంది మరణిస్తే... 1948 నుండి 1950 వరకు సైన్యం జరిపిన హత్యాకాండలో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారనేది ఒక లెక్క. నిజానికి కర్ణాటక, మరాట్వాడ ప్రాంతాల్లో మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద ఎత్తున ఊచ కోతకు గురయ్యారు. ముస్లింల నెత్తురు కాల్వలు కట్టింది. మొత్తం సంస్థానంలో 40 వేల వరకు హతులైనట్లు సుందర్‌లాల్ కమిటీ నివేదిక పేర్కొనగా, ఈ మృతుల సంఖ్య రెండు లక్షలు ఉండవచ్చని ఉద్యమ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఏజెన్సీ గిరిజన గ్రామాలు భస్మీపటల మయ్యాయి. గిరిజన మృతుల సంఖ్య వెలుగులోకి రాలేదు. దురాక్రమణ చేసి ప్రజల మాన ప్రాణాలను హరించివేసిన సైనిక చర్యను కాంగ్రెస్ విలీనం అంటోంది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా జరిగే ప్రక్రియను విలీనం అనాలి. దీన్నెలా అంటారు? ముస్లిం పాలన పోయి హిందూ పాలన వచ్చినందున ఇది విమోచన అంటుంది బీజేపీ. ఎవరినుండి ఎవరికి విమోచన వచ్చినట్లు? ప్రజల నుండి నిజాం పాలకులకు విమోచన కలిగింది. ప్రజల నుండి దొరలు, భూస్వాములకు విమోచన కలిగింది. దీన్ని ఎలా విమోచన అంటారో ఉత్సవాలు చేసుకునే బీజేపీ చెప్పాలి. కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటున్నారు. ద్రోహం చేయాలంటే ముందు విశ్వాసం కల్పించాలి. ఆ విశ్వాసానికి విరుద్ధంగా వ్యవహరిస్తే అది విద్రోహం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అలాంటి విశ్వాసం కల్పించలేదు. అది నేరుగా దురాక్రమణకే తెగబడింది. అందువల్ల కమ్యూని స్టులు చెపుతున్నట్లు ఇది విద్రోహ దినం కాదు. సెప్టెంబర్ 17 విషయంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటివరకూ కిమ్మనకుండా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈసారి కొత్త రాగం అందుకుంది. సెప్టెంబర్ 17ను ’తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని అందుకోసం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. దీని వెనుక ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయనేది సుస్పష్టం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా తెలంగాణ గోసను, చరిత్రను రాజకీయాలకు వాడుకోవడం ఆపి తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు వేయాలి. లేకపోతే మరోపోరాటం తలెత్తవచ్చు! సాయిని నరేందర్ (వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు) మొబైల్: 97019 16091 సాయుధ చరిత్రకు ప్రాధాన్యమివ్వాలి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి తెలంగాణ ప్రజలంతా కలిసి కూకటి వేళ్ళతో నిజాం రాచరికా నికి వ్యతిరేకంగా మహత్తర సాయుధ పోరాటం జరుపుతున్నారు. అనేక గ్రామాలు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో స్వయంపాలిత విముక్త గ్రామాలుగా ప్రకటితమయ్యాయి. అప్పటివరకూ తెలంగాణ ప్రజలు చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా దుర్భర బానిసత్వాన్ని అనుభవించారు. నిజాం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లోనే కాకుండా భాషాసంస్కృతుల్లో కూడా పరాయీకర ణకూ, అవమానాలకూ గురయ్యారు. దీనికి వ్యతి రేకంగా తెలంగాణ తొలితరం విద్యావంతులైన మాడపాటి హన్మంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు వంటి వారు 1921లో ‘ఆంధ్ర జన సంఘం’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అది 1923లో ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం’గా, 1930లో ‘నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ’గా మారుతూ తన కార్యకలా పాలను విస్తృతంగా నిర్వహించింది. 1942 నుండి కమ్యూనిస్టుల చేరికతో ఆంధ్రమహాసభ భాషా సంస్కృతుల పరిధి దాటి వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం, ‘దున్నేవానికి భూమి’ వంటి పోరాటా లను నిర్వహించింది. 1944 భువనగిరి ఆంధ్ర మహాసభ నాటికి రావి నారాయణ రెడ్డి నాయ కత్వంలో పూర్తి స్థాయిలో విప్లవ సంస్థగా మారి దొరల, రజకార్ల, నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పోరాటాలను ప్రారంభించింది. 1940–42ల మధ్య బందగి సాహెబ్ సాహస మరణం, 1944–1945 లో పాలకుర్తి అయిలమ్మ భూపోరాటం, 1946లో దొడ్డి కొమురయ్య వీర మరణం, తదనంతరం భీంరెడ్డి, దేవులపల్లి, షోయ బుల్లాఖాన్, ముఖ్ధూం మోహియుద్దీన్, సర్వదేవ భట్ల రామనాథం, ఆరుట్ల దంపతులు, మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, నల్లా నర్సింహులు, సుద్దాల హన్మంతు, రాజబహుదూర్ గౌర్ల వంటి నాయకులు సాయుధ పోరాటం సాగించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం ముందుకు పోవ టాన్ని చూసి యూనియ న్లో చేరమని బ్రిటిష్ వారు నిజాంకు సలహా ఇచ్చారు. పోరాటకారులు హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది గ్రామాలను విముక్త ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరం కమ్యూనిస్టుల స్వాధీన మయ్యే అవకాశం ఉందని గ్రహించిన లార్డ్ మౌంట్‌బాటెన్ నిజాంను యూనియన్‌లో చేరమని ఒత్తిడి చేశాడు. స్వతంత్ర దేశంగా ఉంటానన్న నిజాంకు దేశీయంగా, అంతర్జాతీయంగా మద్దతు కరవయింది. నిజాంకు సమాంతరంగా ఎదుగు తున్న మతోన్మాద నాయకుడు ఖాసిం రజ్వీ యూని యన్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజ లపై తీవ్ర హింసాకాండకు దిగాడు. ఐక్యరాజ్య సమితిలో నిజాంకు మద్దతు తెలుపుతూ వస్తున్న పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మహ్మద్ అలీజిన్నా ఆకస్మికంగా మరణించారు. ఈ పరిస్థితులలో నిజాంసైన్యాలు, రజాకారులు స్థైర్యాన్ని కోల్పోయి గందరగోళంలో పడి బలహీన స్థితికి చేరుకున్నాయి. 1947 సెప్టెంబర్ 29న నిజాం, నెహ్రూ సర్కార్లు ‘యథాతథ ఒడం బడిక’ను చేసుకున్నాయి. సెప్టెంబర్ 13, 1948 వరకు అమలైన ఈ ఒడంబడిక కాలంలో వల్ల భాయ్ పటేల్, రాజగోపాలాచారి సంస్థానంలోని విప్లవ వెల్లువను అణచి వేయడానికి నిజాంకు ఆయుధాలను సరఫరా చేశారు. మద్రాస్, హైదరా బాద్ రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ ప్రజా గెరిల్లాలు నిజాం సైన్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీసి పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు. కమ్యూనిస్టులపై తీవ్ర విద్వేషంతో ఉన్న కేంద్ర హోంమంత్రి ఇదే సమయంలో హైదరాబాద్‌పై ‘సైనిక చర్య’కు ఆదేశించాడు. యూనియన్ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమైంది. నిరంకుశ నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులనూ, వారి వెంట నడుస్తున్న లక్షలాది మంది ప్రజలనూ యూనియన్ సేనలు నిర్బంధించాయి. ఇప్పుడు ఆ చారిత్రిక ఇతిహాసాన్ని ‘సమైక్యతా ఉత్సవం’గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం ముదావహం. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధంలేని మతోన్మాద సంస్థల వారసులు చరిత్రను ఇప్పుడు వక్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరం. సాయుధ పోరాటానికి వేదికలైన కడవెండి, బైరాన్‌పల్లి వంటి చోట్ల స్మారక చిహ్నాలను నిర్మించాలి. అమరుల త్యాగాలు ప్రజల హృదయాలలో ఉండేట్లు కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించాలి. అస్నాల శ్రీనివాస్ (వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు) -
భరతమాత తొలి వెలుగులకు దూరమైన తెలంగాణ
1600 సంవత్సరంలో భారత గడ్డపై వ్యాపార నిమిత్తం కాలు మోపి, ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, భారతీయుల, పాలకుల అమాయకత్వాన్ని తమకు అనువుగా మలచుకొంటూ సాగిన ఈస్ట్ ఇండియా కంపెనీ జైత్రయాత్ర ప్లాసీ యుద్ధం అనంతరం మరింతగా విస్తరించి, బెంగాల్ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. భారతదేశ స్వయం సిద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రకృతిని కాపాడుకుంటూ సాగే జీవన విధానం, విద్యా వ్యవస్థ మరియు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచే ధార్మిక మూలాలు, వాటి విశిష్టతని అర్థం చేసుకున్న కంపెనీ పాలకులు, వారి వ్యాపార విస్తరణకు అడ్డుగా ఉంటుందన్న భావనతో దేశం మొత్తాన్ని ముందుగా తమ చేతుల్లోకి తీసుకుంది. అనంతరం భారతీయ మూలాల్ని పెకిలించే కంపెనీ ప్రక్రియ యథేఛ్చగా సాగడం వల్ల దేశ ప్రజల్లో రాజుకున్న స్వతంత్ర కాంక్ష 1857 లో సిపాయి రెబెల్లియన్గా ,తొలి స్వాతంత్య్ర పోరాటంగా మారడం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం, అఖండ భారత పాలన కేవలం కంపెనీతో సాధ్య పడదని తెలుసుకుని నేరుగా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. భారతీయులకి ఈ స్థితి నేరుగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది. మెల్లిమెల్లిగా రాజుకుంటున్న స్వాతంత్ర కాంక్షని ముందుగానే అంచనా వేసిన బ్రిటిష్ ప్రభుత్వం 1861, 1892, 1909, 1919 లలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ రూపంలో దేశ ప్రజలకి ఎంగిలి మెతుకుల్ని విదిల్చినట్టు అధికారంలో, పాలనలో తమకు అడ్డు రాకుండా కొద్దిపాటి భాగ స్వామ్యాన్ని కల్పించింది. అరకొరగా ఇచ్చిన పాలనా భాగస్వామ్యం ప్రజల్లో పెరుగుతున్న స్వాతంత్య్ర భావనని తగ్గించక పోగా మరింత తీవ్రరూపం దాల్చడంతో ఇండియన్ యాక్ట్ 1935 రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి పూర్తి పాలన స్వేఛ్చని ఇచ్చినట్లు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యంత దారుణమైన స్థితి ఏంటంటే తమ సోదరులు, మిగిలిన భారతీయులు తమ స్వాతంత్య్రాన్ని చాటుతూ ముందుకు సాగుతుంటే, తెలంగాణ, మరట్వాడ మరియు కల్యాణ కర్ణాటక (ఉత్తర కర్ణాటక ) ప్రాంత వాసులు మాత్రం, 1724 లో మొగలు రాజుల నుండి సొంత జెండా ఎగరవేసిన అసిఫ్ జాహి నిజాం పాలకుల కబంధ హస్తాల్లోకి వెళ్లి, విద్యకి ,వైద్యానికి, చివరికి తమ సంస్కృతి సాంప్రదాయాల్ని, మత స్వేచ్ఛని కోల్పోయి మానవ సమాజంపై జరిగే దాడి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో మునిగి పోయారు.15 ఆగష్టు, 1947, దేశం పూర్తి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకునే సమయంలో హైదరాబాద్ సంస్థానం మాత్రం రజాకార్ల రూపంలో ఉన్న మానవ మృగాల పైశాచిక దాడిని ఎదుర్కొంటూ, తమను తాము రక్షించేకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. విలాసాలు , వినోదాలతో సాగిన నిజాం పాలన ప్రజల కనీస హక్కులు కాలరాస్తూ సాగి, చివరకి అప్పు కట్టలేక తన రాజ్యాన్ని కొద్ది కొద్దిగా ముక్కలు చేస్తూ, కంపెనీకి , బ్రిటిష్ పాలకులకు అప్పగించే స్థితి దాపురించింది . 1768లో మచిలీపట్టణం సంధి ద్వారా కోస్తా ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించిన నిజాం, 1903 లో బేరార్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకులకి అప్పజెప్పాడు. ఇదే క్రమంలో సీడెడ్ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. జులై 4 1946 వరంగల్ జిల్లాలోని కడవేని గ్రామంలో దొడ్డ కొమరయ్య అనే రైతు హత్య ఘటన, నిజాం అనుచరులైన దొరలపై రైతుల తిరుగుబాటుకి దారి తీసింది. రజాకార్ల పైన ఆత్మ రక్షణ యుద్ధంలో తెలంగాణ ప్రజలంతా ఏకమై, కుల సంఘాలు, వామపక్షాలు, రైతులు, విద్యావంతులు గెరిల్లా యుద్దాన్ని చేబట్టారు. గోండు జాతిని రక్షించే బాధ్యత, 1900-1949 సమయంలో కొమరం భీంపై పడి, జమిందార్ లక్ష్మణ్ రావు దాష్టికాలపై, నిజాంపై 1900-1949 మధ్య కాలంలో సాగిన అస్తిత్వ పోరాటం..‘జల్, జంగిల్ జమీన్’ నినాదంతో సాగి 1940 లో భీం ప్రాణాలని హరించింది. విసునూరు రామ చంద్రా రెడ్డి విశృంఖల దౌర్జన్యానికి, నిజాం దోపిడీ విధానానికి వ్యతిరేకంగా సాగిన చాకలి ఐలమ్మ పోరాటం మనకి సదా ప్రాతఃస్మరణీయం. ఈ హైదరాబాద్ సంస్థాన వాసుల దయానీయ స్థితిని గమనించిన భారత ప్రభుత్వం, మన ప్రథమ హోం శాఖామాత్యులు, స్వర్గీయ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సాగించిన పోలీస్ ఆక్షన్ 13 సెప్టెంబర్ 1948 లో మొదలై 17 సెప్టెంబర్ 1948న నైజాం దాస్య శృంకలాల నుంచి స్వేఛ్చ వాయువుల్ని పీల్చుకునే వరకు సాగింది. దేశం ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ స్వాతంత్రం, ఆ మధురమైన అమృత ఘడియలు, ఆ అద్భుత మైన అనుభూతికి దూరంగా, హైదరాబాద్ సంస్థాన వాసులు మాత్రం తీర్చలేని వెలితితో భరతమాత తొలి వెలుగులకు దూరంగా ఉండిపోయింది. దొర్లి పోయిన కాలంలో గాయపడ్డ తెలంగాణ మరకలు అలాగే మిగిలి పోయాయి. -వేముల శ్రీకర్, ఐఆర్ఎస్, కమిషనర్, ఇన్‌కంటాక్స్ -
‘ఆపరేషన్ పోలో’కు నేటితో 68 ఏళ్లు
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆపరేషన్ పోలో’... సరిగ్గా 68 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం నిజాం రాజ్యంపై చేసిన పోలీసు చర్య పేరిది. అప్పట్లో దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నా... హైదరాబాద్ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పదఘట్టనల కింద నలిగిపోతున్నారు. రజాకార్ల అకృత్యాలు... రాక్షసకాండ మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ పేరుతో పోలీసు చర్యకు దిగింది. నిజాం నియంతృత్వ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. హైదరాబాద్ సంస్థానంలోనూ స్వేచ్ఛా వాయువులు వీచాయి. ఇదంతా ఒకవైపు... మరోవైపు నియంతృత్వ పాలన సాగించిన ఉస్మాన్ అలీఖాన్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధికి సైతం బలమైన పునాదులు పడ్డాయి. విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, తదితర రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కనిపించింది. ఎన్నో చారిత్రక కట్టడాలు వెలిశాయి. రహదారులు, జలాశయాలు నిర్మించారు. నిజాం కాలంలో నియంతృత్వం ఎంత కఠోరమైన వాస్తవమో... అభివృద్ధీ అంతే. సెప్టెంబర్ 17వ తేదీన ఆయన భారత ప్రభుత్వానికి లొంగిపోవడంతో నిజాం శకం అంతమైంది. భయానకం హైదరాబాద్ రాజ్యంలో ఎన్నో అరాచకాలు... అకృత్యాలు... రక్తపాతం సృష్టించిన రజాకార్లు నగరంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతికేవారు. ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోననే భయం. రాత్రివేళల్లో మహిళలు కారంపొడి దగ్గర ఉంచుకొనే వారు. కాంగ్రెస్ సారథ్యంలో వెలువడిన ‘ఇమ్రోజ్’ పత్రికలో మజ్లిస్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు, వార్తలు విరివిగా వచ్చేవి. వాటిని ఖాసీం రజ్వీ జీర్ణించుకోలేకపోయాడు. ‘తమకు వ్యతిరేకంగా వార్తలు రాసేవాళ్ల చేతులు నరికేస్తామని’ తీవ్రంగా హెచ్చరించాడు. ఆ తరువాత వారం రోజులకే ఓ అర్ధరాత్రి షోయబ్ చేతులు నరికి, పిస్తోలుతో కాల్చి చంపారు రజాకార్లు. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పరిపాలనలో ఈ దాడులు చీకటి అధ్యాయం. రాచరిక నియంతృత్వ వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ దిశగా రాజకీయ రంగం పరిణామం చెందింది కూడా ఈ కాలంలోనే కావడం గమనార్హం. ముగిసిన శకం.. హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య 1948 సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్టినెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నాలుగు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి... ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ.రుద్ర విజయవాడ వైపు నుంచి... బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. భారత ఎయిర్ మార్షల్ ముఖర్జీ తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. 1948 సెప్టెంబర్ 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాలలో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్ 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల పాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్, తదితర ప్రాంతాల్లో మందుపాతర లు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించారు. ‘ఆపరేషన్ పోలో’ పూర్తయింది ప్రగతికి బాటలు చారిత్రక, రాజకీయ, సామాజిక రంగాల్లో నియంతృత్వం రాజ్యమేలుతున్న సమయంలోనే హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధికీ బలమైన పునాదులు పడ్డాయి. విద్య, వైద్య, రవాణా, పారిశ్రామిక రంగాల్లో అద్భుతమైన ప్రగతి కనిపించింది. పారిశ్రామిక రంగంలో 1929 గొప్ప మైలురాయి. ప్రభుత్వం రూ.కోటితో ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ (ఐటీఎఫ్)ను ఏర్పాటు చేసింది. పెద్ద పరిశ్రమలకు అప్పులు ఇచ్చి వాటిపై వచ్చే ఆదాయంతో చిన్న పరిశ్రమలను ప్రోత్సహించింది. నిజాం రాజ్య గ్యారెంటీడ్ రైల్వే ఆధ్వర్యంలో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. 1932 నాటికి నిజాం రోడ్డు రవాణా సంస్థ, 1938లో దక్కన్ విమానయాన సంస్థ ఏర్పాటయ్యాయి. 1885లోనే టెలిఫోన్ అందుబాటులోకి వచ్చింది. 1938–39లో నిజాం ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా 20 మిలియన్ కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఒక మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. ఈ అభివృద్ధి అప్పట్లో హైదరాబాద్‌ను అత్యధిక సంపన్నమైన సంస్థానంగా నిలిపింది. ►1874 జూలై 14న గుల్బర్గా నుంచి సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్ ప్రారంభమైంది. ►మహ్మద్‌కులీ కుతుబ్‌షా మూసీ నది ఒడ్డున దాదార్మహల్ (న్యాయ మందిరం) కట్టించారు. ఆ ప్రాంగణంలోనే 1920 ఏప్రిల్ 20న నిజాం హైకోర్టును ప్రారంభించారు. ►1921లో రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన సిటీ కాలేజ్ హిందూ ముస్లిం వాస్తుకళల మేలు కలయిక. ►బ్రిటిష్ రాణి విక్టోరియా జ్ఞాపకార్థం 1906లో మూసీనది ఒడ్డున జజ్గీఖానా నిర్మించారు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు ఆస్పత్రి చాలా వరకు కొట్టుకుపోయింది.1911లో ఉస్మాన్అలీ ఖాన్ దీనిని పునర్నిర్మించారు. ►మక్కా మసీదుకు ఎదురుగా, చార్మినార్‌కు ఆగ్నేయ దిశలో 1928లో నిర్మించిన యునాని ఆస్పత్రి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ►రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1936లో మూసీ తీరాన నిర్మించారు. ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషల్లోని అనేక గ్రంథాలు, చేతిరాత గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. ►బెల్జియంకు చెందిన రూపశిల్పి మాన్సియర్ జాస్పర్ ఆర్ట్స్ కళాశాలకు రూపకల్పన చేశారు. 1939 నాటికి ఈ కళాశాల పూర్తయింది. ►1925లో ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించారు. -
‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా..
* సైనిక చర్యకు తలవంచిన ఏడో నిజాం * రజాకార్ల ఆగడాలు అంతమైన రోజు * స్వేచ్ఛావాయువులు పీల్చిన హైదరాబాదీలుభారత్ వశమైన హైదరాబాద్ సంస్థానం * ‘సెప్టెంబర్ 17’ ప్రత్యేకం సాక్షి, సిటీబ్యూరో: 1947లో దేశానికి స్వాతంత్య్ర వచ్చినా హైదరాబాదీలు మాత్రం రజాకార్ల ఆగడాలకు బలయ్యారు. వారి వేధింపు లను భరించలేక విసిగి వేసారి పోయారు. విముక్తి కోసం కలలుగన్నారు. వారు అనుకున్నట్టుగానే 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు లొంగుబాటుతో ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చారు. భారత సైన్యం నలువైపుల నుంచి హైదరాబాద్‌ను ముట్టడించడంతో ఎట్టకేలకు ఏడో నిజాం వెన్నుచూపాడు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంతో జనమంతా పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. మువ్వన్నెల జెండాలతో పరుగులు తీశారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున ‘ఆపరేషన్ పోలో’ పేరిట సైనిక చర్యకు దిగింది. అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లబ్భాయి పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం నాలుగు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ.రుద్ర మద్రాస్ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. అయినా చివరి క్షణం వరకు నిజాం ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగించింది. సెప్టెంబర్ 14న: దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్ , వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ దాడిని ఎదిరించలేక నిజాం సైనికులు పరుగులు తీశారు. కనిపించిన రోడ్లను, వంతెనలను ధ్వంసం చేశారు. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఆకాశంలో తిరుగుతున్న భారత యుద్ధ విమానాలకు తమ ఉనికి తెలిస్తే బాంబులు వేస్తారనే భయంతో రజాకార్లు ఇళ్లల్లో లైట్లు ఆర్పేయాలని హెచ్చరించారు. సెప్టెంబర్ 16న: ఆ రోజు రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల వశమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. కానీ సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న: ఆ రోజు సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించడంతో నగర వాసుల్లో ఉత్సాహం ఉరకలేసింది. అడుగడుగునా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు భారత సైన్యం కవాతు చేసింది. అదే రోజు సాయంత్రం రేడియో ప్రసంగంతో.. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రసంగించారు. ‘నా ప్రియమైన ప్రజలారా!.. నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. ఈ పని ఇదివరకే చేయాల్సింది. ఆలస్యమైనందుకు విచారిస్తున్నా. యుద్ధం నుంచి నా సైన్యాన్ని విరమించుకుంటున్నా. ఐక్యరాజ్యసమితిలో పెట్టిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నా’ అని ప్రకటించారు. ఆ మరుసటి రోజు ఆయన గవర్నర్ జనరల్ రాజగోపాలాచారిని క లిశారు.