opposing
-
జబ్బులే రాని, మరణమే లేని బిడ్డ కావాలా? సాధ్యమేనా?
మనిషి తన సుఖ, సంతోషాల కోసం చేస్తున్న ప్రయోగాలు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నాయో పట్టించుకోవడంలేదు. ఒక శతాబ్ద కాలంలోనే భూగోళంలో వేల సంవత్సరాలకు సరిపడా విధ్వంసం సృష్టించాడు. సహజసిద్ధమైన ప్రక్రియకు భిన్నంగా డిజైనర్ బేబీస్‌ను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని ఈ ప్రయోగాలు ప్రపంచానికి మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిజైనర్ బేబీస్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంట్లో వాడుకునే వాషింగ్ మెషిన్ లేదా ఫ్రిజ్ కొనాలంటే షోరూమ్‌కి వెళ్ళి రకరకాల కంపెనీలకు చెందినవాటిని పరిశీలించి దేనిలో ఉత్తమమైన ఫీచర్స్ ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకుని ఇంటికి తెచ్చుకుంటాం. రెండు మూడు దశాబ్దాలు తర్వాత చంటిబిడ్డల్ని తయారు చేసే కంపెనీలు పుట్టుకొస్తాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బిడ్డలు కావాలనుకున్న దంపతులు ఆ కంపెనీకి వెళ్ళి వారు తయారు చేస్తున్న బిడ్డలకు సంబంధించిన బ్రోచర్స్ చూసి తమకు కావాల్సిన లక్షణాలున్న బిడ్డల్ని లేదంటే రకరకాల కాంబినేషన్లతో కూడిన బిడ్డల్ని తయారు చేయాలని కంపెనీని కోరే పరిస్థితులు వస్తాయంటున్నారు. నవ మాసాలు మోసి బిడ్డల్ని కనాల్సిన అవసరం లేదు. ఇప్పటిలాగా సరోగసి వివాదాలు కూడా ఉండవు. మనకు కావాల్సిన బేబీని నచ్చినట్లు డిజైన్ చేసుకుని తయారు చేయించుకోవచ్చు. అయితే ఇటువంటి అభివృద్ధి సమాజానికి మంచిదేనా? అసలు ఇటువంటి ప్రయోగాలు నిజంగా సాధ్యమవుతాయా? మానవ శరీర నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనది. లేబొరేటరీలో వైరస్‌లను సృష్టించినంత తేలికగా...మనిషి జన్యువులను మనకు కావాల్సిన విధంగా ఎడిటింగ్ చేసుకోవడం కుదిరే పనేనా? అంటూ అనేక ప్రశ్నలు మేధావులు, సామాజిక వేత్తలు, సైంటిస్టుల నుంచి వినిపిస్తున్నాయి. అసలిటువంటి ప్రయోగాలు నైతికమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొక్కలకు సంబంధించి జన్యుపరమైన మార్పులతో మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతున్నాం. అయితే మనుషుల విషయానికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్లుగా జన్యువుల్లో మార్పులు చేయడం అంత తేలికైన విషయం కాదంటున్నారు అనేక మంది సైంటిస్టులు. ఒక వ్యక్తికి తల్లి దండ్రులనుంచి..తరతరాలుగా వస్తున్న మానసిక, ఆరోగ్య లక్షణాలు, అందమూ, తెలివితేటలు, రంగు, పొడుగు విషయాల్లో మార్పులు చేయడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనిషికి సంబంధించిన ప్రతి లక్షణానికీ కొన్ని వందలు లేదా వేల జన్యువులు కారణమవుతాయి. మనిషి ఎత్తుని ప్రభావితం చేసే జన్యు వైవిధ్యాలు 93 వేల వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనల్లో 93 వేలలో 697 జన్యువులను మాత్రమే గుర్తించగలిగారు. జన్యు పరివర్తన ఎంత సంక్లిష్టమైన వ్యవహారమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డిజైనర్ బేబీస్ అన్న మాట ప్రస్తుతానికి సైన్స్ ఫిక్షన్‌కే పరిమితం అని తేల్చేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకూ మనం జీన్ ఎడిటింగ్ ద్వారా జన్యువుని సవరించగలుగుతున్నామే కానీ..దాన్ని మెరుగుపరచడం గురించి మనకేమీ తెలియదంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ తయారు చేయడానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎంతో కసరత్తు చేస్తారు. డజన్ల మంది ఎన్నో వందల గంటలు శ్రమిస్తారు. ఎన్నో అధ్యయనాలు, వాటికి ఫుట్ నోట్స్‌లు తయారు చేసుకుంటారు. ఇవన్నీ చేస్తేనే గాని ఒక ప్రోగ్రాం తయారు కాదు. అదేవిధంగా ఒక జన్యువును ఎడిట్ చేయాలంటే ఇంతకంటే ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ అవసరం అవుతుంది. ఇక జన్యువును ఉన్నదానికంటే మెరుగుపర్చడం అంటే ఇప్పట్లో సాధ్యమయ్యేదే కాదంటున్నారు. మనిషిలోని లక్షణాలు మార్చి మనకిష్టం వచ్చినట్లుగా బేబీస్‌ను తయారు చేసుకోవడం అనేది అత్యాశే అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. చైనా శాస్త్రవేత్త కేవలం ఒక జన్యువును తొలగించే ప్రక్రియ మాత్రమే చేయగలిగారు. తద్వారా పుట్టిన బిడ్డలకు ఎయిడ్స్ రాకుండా నివారించగలిగారు. అలా కాకుండా మనం కోరుకున్న లక్షణాలు గల బిడ్డలు పుట్టాలంటే జన్యువులను మెరుగుపరచాలి. ఆయా లక్షణాలకు సంబంధించిన మార్పులు జన్యువుల్లో చేయగలగాలి. ఇప్పటికీ అనేక జబ్బులను నయం చేయడమే మనిషికి సాధ్యం కావడంలేదు. అవన్నీ వదిలేసి కోరుకున్న లక్షణాలున్న బిడ్డలను తయారు చేసుకోవడం అనేది అసాధ్యమంటున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మేధావులైన వైద్య పరిశోధకులు నిజంగా డిజైనర్ బేబీస్‌ను తయారు చేస్తే అప్పుడు సమాజంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? ఇటువంటి వైద్య విధానాలు కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. సమాజంలో 90 శాతంగా ఉన్న ఇతర వర్గాలకు ఇటువంటి టెక్నాలజీలు ఎంతో దూరంలో ఉంటాయి. అంటే డబ్బున్నవారు మాత్రమే తమకు కావాల్సినవిధంగా బిడ్డలను లేబరేటరీల్లో తయారు చేయించుకుంటారు. అందమైన, తెలివైన, దీర్ఘాయువు గలిగిన, వ్యాధులు దరిచేరని హై ప్రొఫైల్ బిడ్డలను తయారు చేయించుకుని పెంచుకుంటారు. సమాజంలోని మిగిలిన వర్గాల ప్రజలు వీరితో ఏ విషయంలోనూ పోటీ పడలేరు. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. ఇప్పటికే మన సమాజంలో ఆడబిడ్డలంటే పుట్టకముందే చంపేసే దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా తమకు పుడుతున్న బిడ్డల్లో లోపాలు తెలుసుకుని మరో రకమైన భ్రూణహత్యలు సమాజంలో పెరిగిపోతాయి. ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది. ఒక వైకల్యం నిరోధించడానికి ఒక జన్యువును సవరించగలుగుతాం. కాని దాని వల్ల మరో కొత్త వైకల్యం వస్తే..ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? పైగా మనుషులు.. ప్రోగ్రామింగ్ చేసిన రోబోల్లా...ప్రోగ్రామింగ్ బిడ్డలు భూమి మీదకు వస్తే వారికి సొంత తెలివితేటలు, ఆలోచించే శక్తి ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రులు ఎలా కోరుకుంటే వారు అలాగే తయారవుతారు. ఇటువంటి పరిణామాలు, పరిశోధనలు భవిష్యత్ సమాజాన్ని గందరగోళంగాను, అంతరాలు మరింతగా పెంచేదిగాను, అస్తవ్యస్థంగాను, సమాజాన్ని వినాశనం దిశగానూ నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని సమాజం మేలు కోరే వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లో కొత్త కొత్త జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంటుందని చెబుతున్నారు. సైన్స్‌కు సంబంధించిన ఏ ఆవిష్కరణ జరిగినా అది సమాజంలో ప్రజలందరికీ ఉపయోగపడాలి. అంతేగాని కొన్ని వర్గాలకు, సమాజంలోని కులీన వర్గాలకు మాత్రమే ఉపయోగపడే ఆవిష్కరణలు ఏమాత్రం మంచిది కాదని సామాజికవేత్తలు గట్టిగా వాదిస్తున్నారు. బిడ్డలు కలగని దంపతులకు పిల్లలు కలిగేవిధంగా అనేక ప్రయోగాలు చేశారు. నలభై సంవత్సరాల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టినపుడు ప్రపంచం ఆశ్యర్యపోయింది. క్లోనింగ్‌తో గొర్రె పిల్లల్ని పుట్టించినపుడు మరింత సంభ్రమాశ్చర్యాలకు సమాజం గురైంది. ఇంటా.. బయటా గొడ్రాలు అని నిందిస్తుంటే అవమానంతో కుమిలిపోయే మహిళలకు వరంలా నేడు ఐవీఎఫ్ విధానం, సరోగసి విధానం అందుబాటులోకి వచ్చాయి. రోజు రోజుకూ సాంకేతికంగా ఎంతో వృద్ధి చెందుతున్నాం. సైంటిస్టులు ప్రజలకు సర్వ సౌకర్యాలు, సౌఖ్యాలు అందిస్తున్నారు. అదే సమయంలో డిజైనర్ బేబీస్ గురించి జరుగుతున్న పరిశోధనలు సమాజంలోని ఒక వర్గానికి సంతోషం కలిగించవచ్చు. కాని 90 శాతం మంది ప్రజలకు ఇటువంటి ప్రయోగాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రమాదకర వ్యాధులు రాకుండా, కావాల్సిన విధంగా పిల్లల్ని తయారుచేయించుకుంటే...బోనస్‌గా మరిన్ని కొత్త జబ్బులు, కొత్త సమస్యలు పుట్టుకురావచ్చు. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా కకావికలం చేసిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాదాపు వందేళ్ళ క్రితం ఇద్దరు బయాలజిస్టులు మానవ పునరుత్పత్తి ప్రక్రియలో అద్భుతమైన సాంకేతిక పురోగోతి వస్తుందని ప్రకటించారు. వీటి గురించే ఆల్డస్ హక్స్లీ అనే రచయిత బ్రేవ్ న్యూ వరల్డ్ అనే పుస్తకం రాసాడు. ఫ్యాక్టరీలో వస్తువులను తయారు చేసుకుంటున్నట్లుగా...2540 నాటికి మనకు కావాల్సిన బిడ్డలను ప్రయోగశాలల్లో తయారు చేసుకుంటామని అందులో రాసాడు. అప్పటి కాలంలో మహిళలు పిల్లల్ని స్వయంగా కనే పరిస్థితులు ఉండవని, కేవలం లేబరేటరీల్లోనే తయారవుతారని తెలిపాడు. డిజైనర్ బేబీస్ గురించి జరుగుతున్న పరిశోధనలు కూడా చివరికి మానవ సమాజాన్ని ఆ దిశగా తీసుకువెళ్తాయనే చర్చ సాగుతోంది. సమాజంలో సంభవించే కొన్ని పరిణామాలు, కొన్ని శాస్త్ర ప్రయోగాలు ఎవరు అడ్డుకున్నా ఆగవు. అలా కొందరు ఆపగానే ఆగిపోతే మానవ సమాజం ఇంత పురోగతి సాధించేది కాదు. అలాగే హక్స్లీ తన పుస్తకంలో రాసినట్లుగా కొన్నేళ్ళలో మన తర్వాతి తరం వారు.. పిల్లల్ని తమకు కావాల్సిన విధంగా ప్రయోగశాలల్లో తయారు చేయించుకుని కొనుక్కునే రోజులు వస్తాయేమో. (అయిపోయింది) ఈ. వీ. బాలాజీ, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’ విహీనమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షు డు కళా వెంకటరావు నాయకత్వాన్ని అక్కడి టీడీ పీ శ్రేణులు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి. తన మాట మాత్రమే వినాలనే కళా వైఖరిని ఎండగడుతున్నాయి. తనతో కలిసి పనిచేయకపోతే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తానని కళా బెదిరిస్తుంటే.. మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇక్కడేం చేయగలరని బాహాటంగానే బదులిస్తున్నాయి. దీంతో కళా వెంకటరావు పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. ఇప్పటికే ఆయనను కాదని బయటకు వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు స్వతంత్రంగా పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ నియోజకవర్గంలో కళాకు ప్రత్యామ్నాయంగా మారుతున్నారు. అసంతృప్త నేతలు, కార్యకర్తలంతా ఇప్పుడు కలిశెట్టితో కలుస్తున్నారు. కలిశెట్టి నాయకత్వ పటిమను పక్కన పెడితే.. కళా కంటే మేలేనని కా ర్యకర్తలు భావిస్తున్నారు. కలిశెట్టిని పార్టీ నుంచి రెండుసార్లు సస్పెండ్ చేయిస్తే డోంట్‌కేర్ అంటూ పార్టీ జెండాతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. బుజ్జగింపు.. బెదిరింపు పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతుండడంతో కళా అండ్‌కో పార్టీ శ్రేణులను దారికి తెచ్చుకు నే ప్రయత్నం చేస్తోంది. కలిశెట్టి వెనుక తిరుగుతున్న వారిని బుజ్జగించే పనిలో ఉంది. కలిశెట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాదని తమతోనే పనిచేయాలని కళా కోరుతున్నారు. అయితే ఈ రా య‘బేరాలకు’ ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణు లు తలొగ్గడం లేదు. కళా నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఫోన్ లోనే నేరుగా చెప్పేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న స్పందనతో అవాక్కవుతు న్న కళా అండ్‌కో చివరికి బెదిరింపులకు దిగుతున్నారు. కళా పోటీలో లేకుంటే ఆయన కుమారు డు పోటీ చేస్తాడని, కాదూ కూడదంటే లోకేష్‌ను తీసుకువచ్చి పోటీ చేయిస్తారని కేడర్‌కు బెదిరింపుల సంకేతాలు పంపిస్తున్నారు. కానీ ఆ బెదిరింపులకు కూడా ఎవరూ లొంగడం లేదు. లోకేష్ ఇ క్కడికొస్తే అవమానం తప్ప ఏమీ ఉండదని, స్థా నికుడే నాయకుడిగా ఉండాలని «ధీటుగా జవాబు ఇచ్చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఎచ్చెర్లలో బయట నుంచి ఏ నాయకుడొచ్చి నాయకత్వం వహించినా టీడీపీ శ్రేణులు తరిమికొట్టేలా ఉన్నాయి. ఇవీ చదవండి: ‘రోడ్డు’ మ్యాప్ రెడీ కోటి రూపాయలను తలదన్నే కథ -
‘హక్కు’ కోసం.. ‘ఉక్కు’ సంకల్పం
సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటు పరం కానిచ్చేది లేదంటూ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఎంతోమంది ప్రాణత్యాగ ఫలమని, వారి త్యాగాన్ని వృథాకానివ్వం అంటూ తెగేసి చెబుతున్నాయి. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి భవిష్యత్ తరాలకు ప్లాంట్‌ను అప్పగిస్తామంటున్నాయి. ఒకప్పుడు 10%, 20% షేర్లు.. డిజిన్వెస్ట్‌మెంట్ అంటూ భయపెట్టిన కేంద్రం.. ఈసారి వ్యూహాత్మక అమ్మకం(స్ట్రాటజికల్ సేల్) పేరిట ప్లాంట్‌ను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆరాటపడుతోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గనుల కేటాయింపులో వివక్ష దేశంలోని ప్రయివేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించడంలోమాత్రం వివక్ష చూపుతూ వస్తోంది. ఫలితంగా ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయమవుతుండగా, సొంత గనుల్లేని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 65 శాతం వ్యయం అవుతోంది. దీనివల్ల కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా గత నాలుగేళ్లలో మూడేళ్ల పాటు నష్టాలు చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లు పైనే అయ్యాయి. అయితే స్టీల్ ప్లాంట్ గత 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ.40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం. సరళీకృత విధానాల పేరుతో.. ఆర్థిక సరళీకృత విధానాల పేరిట అప్పటి యూపీఏ, ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వాలు చాలా కాలంగా స్టీల్ ప్లాంట్ నుంచి 10 శాతం, 20 శాతం షేర్లు ఉపసంహరించాలని నిర్ణయించాయి. కార్మిక సంఘాలు ఆందోళన, కొన్ని సార్లు, మార్కెట్లో సరైన ధర రాకపోవడం వల్ల ఆ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ.. దక్షిణ కొరియాకు చెందిన ‘పోస్కో’ సంస్థకు రెడ్ కార్పెట్ పరుస్తూ స్టీల్ ప్లాంట్ భూమిలో ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటుకు ఎంవోయూ చేసింది. దానిపై ఆందోళన కొనసాగుతుండగానే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) స్ట్రాటజికల్ సేల్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్లాంట్ ఆధీనంలో ఉన్న అనుబంధ సంస్థలను వ్యూహాత్మక అమ్మకంలో చేర్చాలా, ప్రత్యేకంగా ఉంచాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రికి అప్పగించారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీ వేసినట్టు స్టీల్ ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. కమిటీ కూడా ఆమోదం తెలిపితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని ఉద్యోగ, కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో కన్వేయర్ బెల్టుల దగ్ధం స్టీల్‌ప్లాంట్ రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఆర్ఎంహెచ్పీ) విభాగంలో గురువారం రెండు కన్వేయర్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన వల్ల ఉత్పత్తికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. విభాగంలోని 67వ నంబర్ కన్వేయర్‌కు గురువారం ఉదయం షట్‌డౌన్ పనులు చేస్తున్నారు. పనులు చేస్తుండగా అక్కడ బెల్టుకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆ పక్కనే ఉన్న 66వ కన్వేయర్‌కు అంటుకున్నాయి. వెంటనే సీఐఎస్ఎఫ్ ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 150 మీటర్ల బెల్టు దగ్ధం కావడంతో పాటు చూట్ సెన్సార్లు, బెల్ట్ స్కేల్స్ కూడా కాలిపోయాయి. దీంతో 67వ నంబర్ కన్వేయర్ ద్వారా సింటర్ ప్లాంట్‌కు ముడిపదార్థాల రవాణా నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. రాత్రి షి‹ఫ్ట్ట్కల్లా పునరుద్ధరణ పనులవుతాయని అధికార వర్గాల సమాచారం. ఎంతటి ఆందోళనకైనా సిద్ధం స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని కేంద్రం చేస్తున్న కుట్రను అడ్డుకుంటాం. ఇందుకోసం కార్మిక వర్గాన్ని సమాయత్తం చేస్తున్నాం. ఈ అంశంపై ఎంతటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నాం. –జె.అయోధ్యరామ్, గుర్తింపు సంఘం అధ్యక్షుడు త్యాగాలను వృథా కానివ్వం.. ఎంతో మంది ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. వారి త్యాగాలను వృథా కానివ్వం. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి విశాఖ ఉక్కును కాపాడుకుంటాం. – డి.ఆదినారాయణ, స్టీల్ ప్లాంట్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తెస్తాం స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ప్రజాప్రతినిధులను కలిసి, వారి మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. దివంగత సీఎం వైఎస్సార్ వల్లే ప్లాంట్ నిలిచింది. – వై.మస్తానప్ప, స్టీల్ ప్లాంట్ వైఎస్సార్ టీయూసీ ప్రధాన కార్యదర్శి -
లంబాడాలను ఎస్టీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్
-
సమ్మెకు దిగుతున్న బ్యాంకు ఉద్యోగులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళ బ్యాంకు విలీనం ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంపై బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు. అసోసియేట్ బ్యాంకులకు చెందిన దాదాపు 45వేలమంది ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. జులై 12 న సమ్మెకు దిగనున్నారు. అలాగే జూలై 13న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. అయిదు అనుబంధ బ్యాంకుల స్టేట్ బ్యాంక్ విలీనంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటానికి దిగుతున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలతో ఉద్యమానికి దిగుతున్నట్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం వెల్లడించారు. మొండి బకాయిల రికవరీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనీ.. అదే సందర్భంలో బ్యాంకింగ్ పరిశ్రమలో కన్సాలిడేషన్ ఇప్పుడు ప్రధానం కాదని ఆయన వాదించారు. 100,000 కోట్ల మేర పేరుకుపోయిన రుణాల రికవరీపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా మొండి బకాయిల సమస్యతో పోరాడటానికి, పబ్లిక్ రంగ బ్యాంకులను సుస్థిర దిశకు తీసుకురావడానికి వీలుగా ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. నాలుగు లిస్టెడ్ బ్యాంకులు, ఒక్క అన్‌లిస్టెడ్ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకులవిలీనానికి కేంద్ర క్యాబినెట సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్, హైదరాబాద్, బికనూర్, మైసూర్, పాటియాల, భారతీయ మహిళాబ్యాంక్ వీటిలో ఉన్నాయి.