orders passed
-
ఎంపీలు వస్తే అధికారులు లేచి నిలబడాలి..
సాక్షి, చండీగఢ్ : హరియాణలో బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సభ్యులు సందర్శిస్తే అధికారులు లేచి నిలబడాలని సూచించింది. ఎంపీల పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అధికారులు తమను ఖాతరు చేయడం లేదని ఎంపీలు హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేయడంతో 2011 మార్గదర్శకాలను ఉటంకిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్యాలయాల్లోకి పార్లమెంట్ సభ్యులు ప్రవేశించగానే సంబంధిత అధికారులు అప్రమత్తమై లేచి నిలబడి,వారిని స్వాగతించాలని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. హరియాణ మంత్రి అనిల్ విజ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిందని నిర్ధారించారు. మరోవైపు ఈ ఉత్తర్వులపై అధికారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వ అధికారుల హోదాను దిగజార్చడంతో పాటు వారి స్థాయిని తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ అధికారులు ఇలా సమయాన్ని వృధా చేయడం సరికాదని, ఈ పనులు దిగువస్థాయి సిబ్బందికి అప్పగిస్తే బాగుండేదని మరికొందరు సీనియర్ అధికారులు వాపోయారు. -
జంగారెడ్డిగూడెం సీటీవో బదిలీ
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం సీటీవో వి.కేదారేశ్వరరావు బదిలీ అయ్యారు. ఆయనను విజయనగరం జిల్లా తోమయ్యవలస బోర్డర్ చెక్‌పోస్టుకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీసీటీవో ఎ న్ .దుర్గారావు ఇటీవలే ఆకివీడుకు బదిలీ కాగా, సీటీవో కేదారేశ్వరరావును బోర్డర్ చెక్‌పోస్టుకు బదిలీ చేశారు. జంగారెడ్డిగూడెంలో అనధికార వసూళ్ల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖలో ‘వసూల్ రాజాలు’ శీర్షికన గత డిసెంబర్ 1న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు సీటీవో వి.కేదారేశ్వరరావును విచారణ అధికారిగా నియమించారు. విచారణ నేపథ్యంలో డీసీటీవో, సిబ్బంది తనను బెదిరిస్తున్నారని కేదారేశ్వరరావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో జంగారెడ్డిగూడెం ఇన్ చార్జ్ సీటీవోగా తణుకు సీటీవో కేవీఎస్ ఆంజనేయులు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు సీటీవో కేదారేశ్వరరావును తోమయ్యవలస బోర్డర్ చెక్‌పోస్టుకు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఉద్యోగుల పీఆర్సీ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై శుక్రవారం రాత్రి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ కమిషన్ సిఫారసుల మేరకు వేతన సవరణ చేసినట్లు అందులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేస్తున్నట్లు గురువారం ప్రకటించిన సీఎం కేసీఆర్... మంచి రోజైన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. దీంతో ఆర్థికశాఖ ఆగమేఘాలపై ఈ ఫైలును సిద్ధం చేసింది. గురువారం అర్ధరాత్రి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ ఫైలుపై సంతకం చేశారు. అప్పటికే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లటంతో శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులు హడావుడి పడ్డారు. ఆ ఫైలును సీఎం ఆమోదం, సంతకం కోసం ఫ్యాక్స్‌లో ఢిల్లీకి పంపారు. సీఎం ఆమోదం అనంతరం రాత్రి 7 గంటలకు జీవో నం.12 జారీ చేసినట్లు అధికారికంగా వెబ్సైట్లో పొందుపరిచారు.