ornaments missed
-
బంగారు ఆభరణాలు మాయం; ఆళ్లనాని సీరియస్
సాక్షి, అమరావతి: తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్లో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయం వ్యవహారంపై ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై మంత్రి నాని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాయమైన బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్స్ వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు అందచేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీచేశారు. తిరుపతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తి పై స్విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మఅలిపిరి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. (టీడీపీ ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేసింది) రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో జరిగిన ఈ సంఘటనపై మంత్రి ఆళ్ల నాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి కరోనా బాధితులకు అండగా ఉంటూ వారి ఆరోగ్యం మెరుగుదలకు కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్స్ గాని, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో గాని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కరోనా మృతుని రింగ్, సెల్‌ఫోన్ మాయం! తిరుపతి తుడా: తిరుపతి స్విమ్స్ శ్రీపద్మావతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనాబారిన పడి మృతిచెందిన వ్యక్తి నుంచి బంగారు ఉంగరంతో పాటు సెల్‌ఫోన్ మాయం కావడం విమర్శలకు తావిచ్చింది. కొన్ని రోజులుగా స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి, ఈ నేపథ్యంలో చౌడేపల్లెకు చెందిన వెంకటరత్నంనాయుడు పదిరోజుల క్రితం మృతి చెందాడు. ఈ మృతదేహం చేతికి ఉన్న బంగారు ఉంగరంతో పాటు ఖరీదైన మొబైల్‌ను పీపీకిట్లతో విధుల్లో వున్న ఓ వ్యక్తి అపహరించడం గురువారం సీసీ పుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది. కరోనా మృతుల ఆభరణాలు, మొబైల్ ఫోన్లను దొంగిలిస్తున్న ఉదంతాలు స్విమ్స్ ప్రతిష్టకు మచ్చలా మారింది. ఇకనైనా అధికారులు ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి్సన అవసరం ఎంతైనా ఉంది. -
లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా
సాక్షి, అమరావతి: శ్రీవారికి చెందిందిగా ప్రచారంలో ఉన్న గులాబీ వజ్రం అసలు లేనేలేదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తిరుమల ఆలయంలో నగల మాయం, అర్చకుల తొలగింపు, విబేధాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన ఈ భేటీకి టీటీడీ ఈవో సింఘాల్ సహా ఇతర ఉన్నతాధికులు హాజరయ్యారు. (చదవండి: చంద్రబాబు పదేపదే అదే చెప్పారు: సింఘాల్) ‘‘శ్రీవారి ఆభరణాల రికార్డుల్లో గులాబీ వజ్రం అనేది లేనేలేదు. రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా? ఎక్కడి నుంచి తెస్తాం? అసలు రమణదీక్షితులు ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?’’ అని టీటీడీ చైర్మన్ ప్రశ్నించారు. కొద్దిరోజులుగా జరుగుతోన్న వ్యవహారాలపై సీఎం వివరాలు అడిగారని, అన్ని విషయాలూ సవివరంగా చెప్పామని, రమణదీక్షితులుగానీ మరొకరుగానీ చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ ఈవో సింఘాల్ సైతం మీడియాతో మాట్లాడుతూ.. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శిస్తామని అన్నారు. వేంకటేశ్వరుడికి చెందిన గులాబీ వజ్రంతోపాటు కొన్ని ఆభరణాలు కనిపించకుండా పోయాయని, పోటు(వంటశాల)ను మూసివేసి స్వామివారిని పస్తులు ఉంచారని శ్రీవారి ఆలయం మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమధ్య జర్మనీలో వేలం వేసిన గులాబీ వజ్రం శ్రీవారిదే అయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు కూడా. -
సీఎం పదేపదే అదే చెప్పారు: టీటీడీ ఈవో
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో నగల మాయం వ్యవహారం, అర్చకుల మధ్య విబేధాలు తదితర పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం టీటీడీ ముఖ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో భేటీ అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. వివాదాలకు సంబంధించి సీఎం ఏం చెప్పారో వివరించారు.. (చదవండి: లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా) సీఎం గట్టిగా చెప్పారు: ‘‘టీటీడీలో అన్ని పనులూ చట్టప్రకారం, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం జరుగుతున్నాయి. నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని చెప్పగలుగుతున్నాం. ఇకపోతే సమావేశంలో సీఎంగారు మాకు పదేపదే ఒకే విషయాన్నిగుర్తుచేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతకు ఎక్కడా భంగం వాటిల్లకుండా, భక్తుల మనోభావాలు గాయపడకుండా చూసుకోవాలని చెప్పారు. అదేసమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దని ఆదేశించారు. ఆయా రోజులకు సంబంధించి స్వామివారి కైంకర్యాల వేళల్లో ఎలాంటి మార్పులు చేయలేదని మేం సీఎంకు వివరించాం’’ అని సింఘాల్ తెలిపారు. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే ప్రదర్శిస్తాం: 1952 నుంచి శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని టీటీడీ ఈవో చెప్పారు. ‘‘2011 జనవరి 20న టీటీడీ వేసిన రిటైర్డ్ జడ్జీల కమిటీ కూడా ఆభరణాలన్నీ ఉన్నాయని తేల్చింది. కానీ శ్రీకృష్ణ దేవరాయల ఆభరణాలు యేవో ఆ కమిటీ తేల్చలేకపోయింది. ప్రతి ఏడాది ఆభరణాల తనిఖీ జరుగుతూనే ఉంటుంది. ఒక్క మిల్లీ గ్రాము అటూ ఇటైనా రికార్డుల్లోకి వస్తాయి. శ్రీవారి ఆభరణాల జాబితా ఇప్పటికే ఇచ్చాం. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రచారంలో ఉన్నట్లు గులాబీ వజ్రం ఏదీ లేదు. రూబీ మాత్రమే ఉంది. అదికూడా భక్తులు విసిరిన నాణేలు తగిలి పగిలిపోయింది’’ అని అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. కాగా, సీఎంతో భేటీకి ముందు ఈవో మీడియాకు ఏం చెప్పారో, సమావేశం తర్వాత కూడా అదే చెప్పడం గమనార్హం. తద్వారా శ్రీవారి నగల మాయంపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు ఎలాంటి చర్యలుగానీ, విచారణగానీ చేపట్టబోవడంలేదని తెలుస్తున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. -
మా నగలు ఉన్నాయో.. పోయాయో?
బందరు కెనరాబ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన నగల మాయంపై అంతర్గత విచారణ మచిలీపట్నం : మచిలీపట్నం కెనరా బ్యాంకులో బంగారు నగల మాయం కుంభకోణంపై విచారణ జరుగుతోంది. కెనరా బ్యాంకు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల వివరాలను పరిశీలిస్తున్నారు. బంగారం మిస్సింగ్ ఘటనతో తాము కుదువపెట్టని నగలు, దాచుకున్నవి ఉన్నాయో పోయాయోనంటూ ఖాతాదారులు పెద్దసంఖ్యలో గురువారం బ్యాంకు వద్ద బారులుతీరడంతో గందరగోళం నెలకొంది. ఆర్ పేట సీఐ వరప్రసాద్ బ్యాంకు వద్ద బందోబస్తు చేపట్టాల్సి వచ్చింది. ఒకానొక దశలో పోలీసులు, ఖాతాదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. సోమ మంగళవారాల్లో చెబుతాం ఉన్నతాధికారులు, బ్యాంకు సెక్యూరిటీ చీఫ్ అధికారి వి ప్రసాద్, మేనేజరు జయరాజ్ తదితరులు రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో ఖాతాదారులు బ్యాంకుకు వస్తే పూర్తి వివరాలు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఖాతాదారులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.