ornaments roberry
-
‘బాధితురాలు ఇచ్చింది రూ.38 లక్షలు మాత్రమే’
సాక్షి, విశాఖపట్నం : సింహాద్రి అప్పన్న ఆభరణాలు వేలం పాట పేరిట ఇప్పిస్తామని మోసగించిన కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన హైమావతి తనకున్న పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. గత పదేళ్లుగా అప్పన్న ఆలయానికి వచ్చే నెల్లూరుకు చెందిన శ్రావణికి వేలం పాట ద్వారా స్వామి ఆభరణాలు ఇప్పిస్తామంటూ హైమవతి ఫోన్ చేయగా ఆమె విడత వారీగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసింది. దీనికి రసీదుగా సింహాచలం అప్పటి ఈవో భ్రమరాంబ సంతకాలు చేసినట్లు రెండు రసీదులు కూడా పంపించారు. (విజయవాడకు మరో వరం ప్రకటించిన సీఎం) రోజుల తరబడి ఆభరణాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి భర్త నేరుగా ఫోన్ చేయడంతో మోసం బయటపడింది. కాకా హైమావతికి ఈ రసీదులు తయారు చేయడంలో శ్రీకాకుళం జిల్లా చిన్న బరాటం వీధికి చెందిన మధు..విశాఖకు చెందిన శేఖర్ సహకరించినట్లు విచారణలో తేలింది. వీళ్లిద్దరు ఎన్ఏడి జంక్షన్ లో రసీదు ద్వారకా నగర్లో సింహాచలం దేవస్థానం స్టాంపు తయారు చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. కాగా ఈ వ్యవహారంలో కోటి 40 లక్షల రూపాయలు ఇచ్చినట్లు శ్రావణి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా విచారణ మాత్రం ఆమె 38 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు గుర్తించారు. (వుడాకి పూర్వ వైభవం తీసుకువస్తాం..) -
సినీ ఫక్కీలో మహిళ నగలు చోరీ
సాక్షి, తిరుపతి క్రైం : మహిళను మోసం చేసి సినీ ఫక్కీలో ఆమె నగలను చోరీ చేసిన సంఘటన నగరంలోని దొడ్డాపురం వీధిలో సోమవారం చోటుచేసుకుంది. ఈస్టు ఎస్ఐ ఇమ్రాన్‌బాషా వివరాల మేరకు.. దొడ్డాపురంలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ధనలక్ష్మి భర్త మృతి చెందడంతో కుమారుల వద్దే ఉంటోంది. రోజులాగా సోమవారం వాకింగ్‌కు వెళ్లింది. తిరుగుప్రయా ణంలో కూరగాయలు కొనేందుకు వెళుతుండగా ఆమె ముందు ఓ పర్సు పడి వుంది. ఆమె ఆ పర్సును తీసుకుంంటుండగా.. తాను కూడా పర్సును చూశానని, తనకూ భాగం ఇవ్వాలంటూ మరో మహిళ వాగ్వాదానికి దిగింది. ఇదంతా ఎందుకని, ఇద్దరూ కలిసి పంచుకునేందుకు ఓ చోట కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడకు ఒక వ్యక్తి తన పర్సు పోయిందంటూ రాగా, ఆ ఇద్దరు మహిళలు పర్సును దాచారు. తన పర్సు ఎక్కువ నగలు వేసుకున్న మహిళ తీసుకుందని ఎవరో చెప్పినట్లు సదరు వ్యక్తి చెప్పగా.. ఆ మహిళలు తాము కాదని, అక్కడ చాలా మంది ఉన్నారని దబాయించారు. మీరు ఇక్కడే ఉంటే నేను వెళ్లి కనుక్కొని వస్తానంటూ సదరు వ్యక్తి వెళ్లిపోయాడు. నగలను చూసి మనమే అనుకుంటున్నాడని, ఆ నగలను పర్సులో పెట్టి దాచిపెడదామంటూ ధనలక్ష్మీతో పాటు ఉన్న మహిళ సలహా ఇచ్చింది. దాంతో ధనలక్ష్మి తన నగలను పర్సులో పెట్టింది. తిరిగి వచ్చిన సదరు వ్యక్తి ధనలక్ష్మి కొంగుచాటున దాచిన పర్సును చూసి.. అదే తన పర్సని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ నగల పర్సును లాక్కుని ఉడాయించాడు. ఆమెతో ఉన్న మహిళ కూడా అతన్ని పట్టుకునేందుకు వెళ్లినట్టుగా వెళ్లి మెల్లగా జారుకుంది. పోలీసులను పెడదారి పట్టించిన బాధితురాలు.. బాధితురాలు జరిగిందంతా దాచిపెట్టి తప్పుడు సమాచారంతో పోలీసులను పెడదారి పట్టించిందని ఎస్ఐ తెలిపారు. తనను ఎవరో కత్తులతో బెదిరించి 104 గ్రాముల చైన్, 4గాజులు, ఉంగరాన్ని దోచుకెళ్లారని ఫిర్యాదు చేసిందన్నారు. సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం తెలిసిందన్నారు. జరిగిన సంఘటన తెలిస్తే ఎవరైనా ఏమైనా అంటరేమోనని ఇలా పోలీసులను పక్కదారి పట్టించిందన్నారు. చోరీ కేసుతో పాటు చీటింగ్ కేసు కూడా నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
సంపన్నుల వేడుకలే టార్గెట్..
బాలుడి చోరీల పరంపర అరెస్టు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం క్రైం : సంపన్నుల వివాహాలకు బంధువుగా వెళ్లడం.. సుష్టిగా భోజనం చేయడం.. అనంతరం వధూవరుల గదుల్లోకి వెళ్లి విలువైన నగలు, నగదును తస్కరించడం అతడికి కరతలామాలకం. ఆ దొంగ పదహారేళ్ల బాలుడు కావడం విశేషం. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండల డీఎస్పీ రమేష్ బాబు ఆ వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామానికి చెందిన ఒక బాలుడు 16 ఏళ్లకే ఇలా వినూత్నంగా చోరీలు చేస్తున్నాడు. సంపన్నుల వివాహాలు జరిగే కల్యాణ మండపాలను లక్ష్యంగా ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఉన్నత వర్గానికి చెందిన వాడిగా కనబడడం, ఖరీదైన దుస్తులు ధరించడంతో ఆ బాలుడిపై ఎవ్వరికీ అనుమానం కలగదు. పుట్టినరోజు వేడుకలో చోరీ రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని ఎస్వీ ఫంక్షన్ హాల్లో ఈనెల 6న నగరంలోని గాంధీపురానికి చెందిన గారపాటి జగన్ మోహన్ రావు తన మనుమరాలి మొదటి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ వేడుక హాజరైన బాలుడు.. పుట్టినరోజు కానుకలకు సంబంధించిన 1.50 లక్షలు విలువైన నగదు, బంగారపు ముక్కలు, చిన్న చైన్, 14 గ్రాముల బంగారు ముక్కలు, మూడు గ్రాముల చై¯Œæను చోరీ చేసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ప్రకాష్ నగర్ పోలీసులు.. ఎస్వీ ఫంక్షన్ హాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బాలుడిని సహకరించిన అతడి బంధువు కడారి నానీని కూడా అరెస్టు చేశారు. వారి నుంచి రూ1.50 లక్షలు విలువైన నగదు, 14 గ్రాముల బంగారం ముక్కలు, మూడు గ్రాముల చైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో బొమ్మూరు పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగు చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో ప్రకాష్ నగర్ సీఐ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. కాగా.. చోరీ చేసిన డబ్బులతో బాలుడు విలాస వంతమైన జీవితం గడిపేవాడు. ఖరీదైన మోటారు సైకిల్‌పై తిరిగేవాడు. ఇతర పట్టణాలకు వెళ్లి ఖరీదైన లాడ్జిల్లో దిగేవాడు.