OSIRIS-REx
-
గ్రహశకలం నుంచి భూమి వైపుగా వస్తోన్న ఒసిరిస్ రెక్స్
వాషింగ్టన్: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ 2020లో అక్టోబరు 21న విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై తాకిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గ్రహశకలంపై కంప్రెస్డ్ నైట్రోజన్ వాయువుతో పేలుడును సృష్టించి గ్రహశకలంపై ఉన్న దూళి కణాలను సేకరించింది. దాంతోపాటుగా ఒసిరిస్ రెక్స్ అంతరిక్ష నౌకలో అమర్చిన రోబోటిక్ ఆర్మ్ సహాయంతో గ్రహశకలంపై ఉన్న రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి, తిరిగి బెన్నూ గ్రహశకలం నిర్ణీత కక్ష్యలోకి చేరింది. తాజాగా ఒసిరిస్ రెక్స్ నౌక బెన్నూ గ్రహశకలం ఆర్బిట్‌ను వీడి భూమి వైపుకు అడుగులు వేస్తోన్నట్లు నాసా తెలిపింది. ఈ నౌక 33.4 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూమిని చేరనుంది. ఒసిరిస్ రెక్స్ నౌక 2023 సెప్టెంబర్ 24 న ఉటా ఎడారిలో ల్యాండ్ అవుతుందనీ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఒసిరిస్ రెక్స్ నౌక గంటకు 600 మైళ్ల వేగంతో భూమి వైపుగా కదులుతోంది. నౌకతో పాటుగా బెన్నూ గ్రహశకలంపై సేకరించిన 60 గ్రాముల ధూళి, రాళ్లు, మట్టి కణాలను తీసుకొనివస్తోంది. గ్రహశకలం నుంచి సేకరించిన నమూనాలతో సౌరకుటుంబం పుట్టుకకుసంబంధించిన రహస్యాలను తెలుసుకోవచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు. అపోలో సమూహంలోని బెన్నూ ఒక కార్బోనేషియస్ గ్రహశకలం.దీనిని లీనియర్ ప్రాజెక్ట్‌లో భాగంగా 1999 సెప్టెంబర్ 11 కనుగొన్నారు.ఈ గ్రహశకలం 2175-2199 మధ్య సంవత్సరాలలో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. బెన్నూ సగటు వ్యాసం 490 మీటర్లు. ఒసిరిస్ రెక్స్ అంతరిక్ష నౌక బరువు సుమారు 880 కిలోగ్రాములు Tomorrow, our @NASASolarSystem OSIRIS-REx mission departs asteroid Bennu, carrying a sample of rocks & dust for return to Earth. Set a reminder to watch live at 4pm ET as the spacecraft begins its journey home: https://t.co/L4alRfju1k#ToBennuAndBack pic.twitter.com/68uLNEYv7e — NASA (@NASA) May 9, 2021 చదవండి: అంగారక గ్రహంపై ఆక్సిజన్...! -
గ్రహశకలంపై వాలిన ఒసిరిస్ రెక్స్
వాషింగ్టన్: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోబోటిక్ అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై వాలింది. మంగళవారం ఉదయం 6.12 గంటలకు అమెరికాలోని కొలరాడోలోని డెన్వర్ ప్రాంతంలో ఉన్న లాక్‌హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి ఒసిరిస్ రెక్స్‌ను గ్రహశకలంపై దింపగలిగారు. ‘నేలపై వాలడం పూర్తయింది’అన్న ప్రకటన వినగానే కేంద్రంలోని శాస్త్రవేత్తలందరూ హర్షధ్వానాలు చేశారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలోని రోబోటిక్ అంతరిక్ష నౌకను నియంత్రించడం, దానితో బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు!. నాసా సుమారు పన్నెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూండగా బెన్నూ గ్రహశకలంపై వాలి కేవలం 16 సెకన్ల కాలంలో నమూనాలు సేకరించింది. ఓ మినీ వ్యాన్ అంత సైజుండే ఒసిరిస్ 11 అడుగుల పొడవైన రోబోటిక్ చేతితో బెన్నూ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని రాళ్లను సేకరించి ఆ వెంటనే గ్రహశకలం నుంచి వేరుపడింది. ఈ నమూనాల ఫొటోలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. రానున్న ఏడు రోజుల్లో ఈ ఫోటోలు నాసాకు చేరనుండగా.. వాటి ఆధారంగా మరిన్ని నమూనాలను సేకరించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. 60 గ్రాముల నుంచి 2 కిలోల వరకూ... బెన్నూ గ్రహశకలం నుంచి అరవై గ్రాముల నుంచి రెండు కిలోగ్రాముల వరకూ రాతి నమూనాలను సేకరించాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. కర్బనం ఎక్కువగా ఉండే ఈ రాళ్ల ద్వారా మన సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చు. మంగళవారం నాటి ప్రయోగం అంతా అనుకున్నట్లుగానే సాగిందని, ఒసిరిస్ రెక్స్ చేయి పీడనంతో కూడిన వాయువును విడుదల చేయడం ద్వారా నమూనాలను సేకరించిందని ప్రాజెక్టు పర్యవేక్షకుడు డాంటే లారెట్టా తెలిపారు. -
ఆస్టరాయిడ్ సమీపానికి నాసా నౌక
వాషింగ్టన్: ఉత్తరార్థగోళంలోని బెన్ను గ్రహశకలంలోని అగ్ని పర్వత ప్రాంతమైన నైటింగేల్‌కు 620 మీటర్ల దూరంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఓస్రిస్ రెక్స్ అంతరిక్ష నౌక విహరించింది. నౌక తన 1.2 కిలోమీటర్ల కక్ష్యను వదిలేసి 11 గంటల పాటు ఆస్ట రా యిడ్ చుట్టూ తిరిగిందని అమెరికాలోని గోడార్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్లోని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వచ్చే ఆగస్టులో అంతరిక్ష నౌక నైటింగేల్ ప్రాంతం నుంచి న మూనాలను సేకరించనుంది. ఈ అంతరిక్ష నౌక 250 మీటర్ల దగ్గరగా రెండుసార్లు ఆస్టరాయిడ్ చుట్టూ తిరుగు తుందని తెలిపింది. -
ఆస్టరాయిడ్‌పై నాసా చూపు
వాషింగ్టన్: గ్రహాల పుట్టుక, అవి ఏర్పడిన తీరు గురించి తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలు గ్రహశకలాలపై దృష్టిసారించారు. గ్రహశకలాల నమూనాలను సేకరించి, వాటిపై పరిశోధనలు చేయడం ద్వారా గ్రహాల ఆవిర్భావాన్ని గురించి తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం మొట్టమొదటిసారిగా ఆస్టరాయిడ్ శాంపిల్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒసిరిస్-ఆర్ఈఎక్స్ అనే అంతరిక్షనౌకను బెన్నూ గ్రహశకలం మీదికి పంపనున్నారు. సెప్టెంబరు 8న ప్లోరిడాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి... 2018లో బెన్నూ గ్రహశకలాన్ని చేరుతుంది. బెన్నూపై పూర్తిస్థాయి పరిశోధనలు పూర్తయ్యాక ఆ గ్రహశకలానికి చెందిన 60-2000 గ్రాముల శాంపిల్‌ను 2023 నాటికి తీసుకొస్తుంది.